కడప

మార్చిలోగా వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దవటం,జనవరి 21: మార్చినెలాఖరులోగా మండలంలోని 10గ్రామపంచాయతీల్లో వ్యక్తిగత మరుగుదొడ్లను పూర్తిచేయాలని ఎంపిడివో జయసింహా మండల అధికారులకు సూచించారు. స్థానిక ఎంపిడివో కార్యాలయంలో శనివారం ఉపాధిహామీ, డ్వాక్రా, పంచాయతీరాజ్ అధికారులతో వ్యక్తిగత మరుగుదొడ్లపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపిడివో మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ఉపాధిహామీ పథకం కింద నిధులు మంజూరవుతాయన్నారు. ఉపాధిహామీ, వెలుగు, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ కో ఆర్డినేషన్‌తో వ్యక్తిగత మరుగుదొడ్లు మార్చి 31లోగా పూర్తిచేయాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరైన వారు జాబ్‌కార్డు, వ్యక్తిగత పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డుతో దరఖాస్తులు పూర్తిచేసి ఇవ్వాల్సి వుంటుందన్నారు. ఏపిఎం సుబ్బలక్ష్మి మాట్లాడుతూ వెలుగు ఆధ్వర్యంలో వ్యక్తిగత మరుగుదొడ్ల సర్వే నిర్వహించామన్నారు. ఏపిఓ భార్గవి మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్లకు సంబంధించిన లబ్ధిదారులను వెలుగు అధికారులు గుర్తిస్తారన్నారు. గుర్తించిన లబ్ధిదారులకు సంబంధించిన ఫొటో క్యాప్సన్‌ను సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ కెమెరాలో తీసుకుని ప్రతిపాదనలు కలెక్టర్‌కు పంపడం జరుగుతుందన్నారు. అనుమతి వచ్చిన తర్వాత మరుగుదొడ్లు నిర్మించుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో పంచాయతీకార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వెలుగు సిసిలు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లాకు రూ.52కోట్ల పంటబీమా విడుదల

మైలవరం, జనవరి 21:జిల్లాకు 2012-13 ఏడాదికి శనగ పంట ఇన్సూరెన్స్ క్రింద రూ.52కోట్లు మంజూరైందని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెలిపారు. మైలవరం ఎంపిడివో కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే ఆది మాట్లాడుతూ 2012-13 ఏడాది శెనగపంటకు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించిన రైతులకు పంటనష్టపోవడంతో బీమా మొత్తము మంజూరు అయిందన్నారు. ఇందులో భాగంగా భీమా కంపెనీ రూ.52కోట్లు విడుదల చేసిందన్నారు. జిల్లాలో సింహభాగం జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని రైతులకు వచ్చిందన్నారు. విడులయిన బీమా మొత్తమును ఈ నెలాఖరున రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు పత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెలిపారు. రైతులు ఎప్పటికప్పుడు పంటల సాగు సమయంలో భీమాకు ప్రీమియంను చెల్లిస్తే పంట నష్టపోయినప్పుడు వారికి భీమా మొత్తము చేదోడుగా ఉంటుందన్నారు. ప్రస్తుతం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన క్రింద భారీగా రైతులకు లబ్దిచేకూరేలా పంటలకు బీమాచేసే వెసలుబాటు వచ్చిందన్నారు. రైతులు పంటలు నష్టపోయిన తరుణంలో త్వరితగతిన బీమా మంజూరుచేసే విధానం కూడా అమలులో ఉందన్నారు. గండికోట జలాశయంలో 5టియంసిలకు పైగా నిల్వవున్న నీరు పులివెందుల నియోజకవర్గానికి ఎత్తిపోత పథకాల ద్వారా పంపిణీ చేస్తున్నారన్నారు. అక్కడికి విడుదలలు పూర్తవగానే మైలవరం జలాశయంనకు నీటిని విడుదల చేసేందుకు కృషి చేస్తామన్నారు. వేసవిలో మైలవరం జలాశయం పరిధిలోకి వచ్చే గ్రామాలు, మున్సిపాలిటీలు ప్రజలకు త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా నివారణ చర్యలకు అవసరమైన నీటి నిల్వలకు గండికోట జలాశయం నుండి నీటి విడుదలకు సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించామన్నారు.