కడప

బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీపై సిఐడి విచారణ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జనవరి 21: విద్యాశాఖలో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీలో అనేక అక్రమాలకు పాల్పడి అర్హులను గాలికి వదిలి, అనర్హులతో పోస్టులు భర్తీ చేయడంపై ఆరోపణలు రావడంతో జిల్లా అధికార యంత్రాంగంపై సిఐడి బృందం ఆధ్వర్యంలో వచారణకు సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే మూడుమాసాల క్రితం బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయని సంబంధిత అధికారులు ఇరువురు మండల విద్యాశాఖాధికారులను సస్పెండ్‌చేసి జిల్లా యంత్రాంగం చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో సంబంధిత ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు బ్యాక్‌లాగ్ పోస్టులు నిమిత్తం 14 ఖాళీలు తేల్చడం జరిగింది. ఆమేరకు ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీచేశారు. ముఖ్యంగా బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ విషయంలో జిల్లా ముఖ్యఅధికారి నేతృత్వంలో విచారణ జరగాలి, బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలి. అయితే నగరంలో ఐటిఐ సర్కిల్, ఎన్‌జివో కాలనీలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అక్కడ అక్రమంగా మార్కులు వేసి వివరాల జాబితాలో తారుమారు చేసి పలువురు హెడ్మాస్టర్లు, విద్యాశాఖాధికారులు, డిప్యూటీ విద్యాశాఖాధికారులు, చివరకు జిల్లా, ప్రాంతీయ అధికారులు సైతం బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. జిల్లాలో ప్రముఖంగా రాజకీయ అండదండలున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తప్పుడు మార్కుల జాబితాను అందజేసి, రికార్డులనే తారుమారు చేసి ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఎంఇఓ, డిప్యూటీ డిఇఓ సంతకాలు లేకుండానే ప్రైవేట్ యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు వారికి ఇష్టమొచ్చినట్లు రికార్డులు తయారుచేసి 15 మంది అభ్యర్థులకు బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి తప్పుడు నివేదికలు ఇచ్చి తద్వారా ఉద్యోగాలు భర్తీ చేశారు. అధికారపార్టీ నేతలు అండదండలు, రాష్టస్థ్రాయిలో విద్యాశాఖ అధికారులు చివరకు సాక్ష్యాత్తు ప్రభుత్వంలో కీలక నేత బ్యాక్‌లాగ్ పోస్టుల్లో లక్షలాది రూపాయల అక్రమాలకు పాల్పడి, అడుగడుగునా అర్హులకు అన్యాయం చేస్తూ అనర్హులకు పోస్టులు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, ఓసి బ్యాక్‌లాగ్ పోస్టుల్లో అక్రమాల భర్తీతో విద్యాబోధన ఏవిధంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. పలుమార్లు ఈ వ్యవహారంపై అనేక విచారణ జరిగి ఇద్దరు ఎంఇఓలను సస్పెండ్‌చేసి జిల్లా అధికారులు చేతులు దులుపుకున్నారు. తాజాగా శుక్రవారం ప్రభుత్వానికి పలువురు ఫిర్యాదుచేసిన దరిమిలా సెకండరీ ఎడ్యుకేషన్, ఉన్నత విద్యశాఖ ముఖ్యఅధికారి ఈ వ్యవహారంపై సిఐడి విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలియవచ్చింది. ఇప్పటికైనా జిల్లా అధికారులు బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీలో అవకతవకల్లో అక్రమార్కులను తేల్చి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పాతర గడ్డితో పాల దిగుబడి
పెరుగుతుంది
పెండ్లిమర్రి,జనవరి 21: పచ్చిగడ్డి అందుబాటులో లేని తరుణంలో పాతర గడ్డితో పాల ఉత్పత్తిని పెంచుకోవచ్చునని పశువైద్యులు బాబురామచంద్ర తెలిపారు. శనివారం ఆయన వైద్యకేంద్రంలో విలేఖర్లతో మాట్లాడుతూ పచ్చిగడ్డి ఏడాదిపొడవునా అందుబాటులో ఉండదని ఆ తరుణంలో మొక్కజొన్న పంటను వేసిన 75రోజుల తర్వాత ఎండబెట్టి అనంతరం అంగుళం సైజులో ముక్కలు ముక్కలుగా కట్‌చేసుకుని గాలి చొరబడని ప్రదేశంలో నిల్వచేసుకోవాలని తెలిపారు. దీని వల్ల ఈ పాతరగడ్డిని ఏడాది పొడవునా పశువులకు పచ్చిగడ్డి రూపంలో ఉపయోగించుకోవచ్చునని దీని వల్ల పశువుల్లో పున ఉత్పత్తి సామర్థ్యం పెరగడంతోపాటు దూడలు ఏపుగాపెరిగి ధృడంగా ఉంటాయన్నారు. ఈ పాతర గడ్డిలో పొడిపదార్థం 35 శాతం, మాంసపుకృత్తులు 10శాతం, పిండిపదార్థం 40శాతం, పీచుపదార్థం 50శాతం ఉంటుందని వీటివల్ల పశువుశరీర బరువు పెరిగి బలిష్టంగా ఉంటుందన్నారు. పశువు సామర్థ్యంబట్టి రోజుకు 5కిలోలనుంచి 8కిలోల చొప్పున మేతగా ఉపయోగించుకోవాలన్నారు.