కడప

రోడ్డుపైకి చేరిన కృష్ణాజలాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండాపురం, జనవరి 21: కడప - తాడిపత్రి ప్రధాన రహదారిపై మండలపరిధిలోని గంగాపురం గ్రామ సమీపంలో శనివారం రాత్రి కృష్ణా జలాలు రోడ్డుపైకి చేరాయి. గత ఏడాది అక్టోబర్ 2 నుండి కృష్ణా జలాలు గండికోట జలాశయంకు చేరుతున్నాయి. ఈ నేపద్యంలో శనివారం నాటికి గండికోట జలాశయం 4.978 టి ఎంసీల నీటిమట్టానికి చేరుకుంది. ఔట్‌ప్లోయింగ్ లేకపోవడంతో గండికోట జలాశయం నీటిమట్టం పెరుగుతుండటంతో రోడ్డుపైకి నీరు చేరాయి. అధికారులు ముందస్తుచర్యల్లో భాగంగా గత రెండురోజుల నుండి వాహనాల రాకపోకలను దారిమళ్లిస్తున్నారు.
ఎసిబి దాడులతో ఉలిక్కిపడ్డ అధికారులు

కడప,జనవరి 21: జిల్లాలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖలో భాగంగా బద్వేలు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సిఐ హిమబిందు అవినీతి అక్రమాలపై ఎసిబి డిఎస్పీ నాగరాజు నేతృత్వంలో శుక్రవారం చేసిన దాడులతో జిల్లాలో పలు అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. బద్వేలు సిఐ హిమబిందు రూ.54వేలు బ్రాందిషాపు యజమాని నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుబడటం, ఆమెను అరెస్టుచేసి శనివారం రిమాండ్‌కు పంపి కడప సెంట్రల్‌కు తరలించారు. పోలీసుశాఖలో అవినీతి అక్రమాలు అరికట్టేందుకు జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ చార్జి తీసుకున్న ఆరునెలల నుంచే శాఖలో అవినీతి అక్రమార్కుల భరతం పడటంతో పోలీసుశాఖలో చాలా వరకు అవినీతి అక్రమాలు తగ్గుముఖం పడ్డాయి. జిల్లాలో మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్, ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఆరితేరిన హోంగార్డు నుంచి జిల్లా పోలీసు అధికారి వరకు ఎస్పీ రామకృష్ణ పలు కోణాల్లో విచారణ చేసి స్పెషల్‌పార్టీని నియామకం చేసి అక్రమాలకు పాల్పడుతున్న కానిస్టేబుల్స్, సిఐ, ఎస్‌ఐలను దాదాపు 20మందిపై చర్యలు తీసుకున్నారు. దీంతో పోలీసుశాఖలో అవినీతి అక్రమాలంటే అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ఇక ఏసిబి అధికారులు ప్రొహిబిషన్, ఎక్సైజ్, రెవెన్యూ, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, సబ్‌ట్రెజరి, రిజిస్ట్రేషన్, వైద్య ఆరోగ్యశాఖ, ప్రభుత్వ ఆరోగ్యవైద్యశాలలు, జలవనరులశాఖ, రోడ్ల భవనాలశాఖ, పలుశాఖలపై ఏసిబి అధికారులు దాడులు చేసేందుకు డిఎస్పీ మూడుమాసాలుగా అన్నికోణాల్లో సంబంధితశాఖల అవినీతి అక్రమార్కుల జాబితాలు వెలికితీసి సమగ్రవిచారణ పూర్తిచేసి దాడులకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏసిబి డిజిపి ఆర్‌పి ఠాగూర్ గతంలో ఎస్పీగా పనిచేసిన తరుణంలో ఆయనకు జిల్లాపై సమగ్ర అవగాహన ఉండటం, తరచు ఆయన జిల్లాలో జరుగుతున్న అవినీతి అక్రమాలు కూడా జిల్లాలో చోటుచేసుకున్న విషయాలపై తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. అవినీతి నిరోధకశాఖ కడప డిఎస్పీ నాగరాజు అవినీతి అక్రమాలు రూపుమాపడమే తమ ధ్యేయమని అన్ని శాఖలపై పూర్తిస్థాయిలో అవగాహన తీసుకుని దాడులు చేసి అవినీతి అక్రమాలకు అడ్డుకట్టవేసేందుకు ఎప్పటికప్పుడు చర్యలకు శ్రీకారం చుట్టారు. అయితే అవినీతి అక్రమాలకు పాల్పడే అధికారులపై ఫిర్యాదు చేసేందుకు పలువురు అధికారులు, సిబ్బంది వివిధ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది, అవినీతి అక్రమాలకు పాల్పడే వారిపై ఫిర్యాదుచేసే సమయంలో ఉన్న స్పీడు ఆ కేసుల విచారణలో ఉండటం లేదు. ఈ ఆరంభ సూరత్వాల వల్ల పలు కేసులు నీరుగారిపోతున్నాయి. అవినీతి అక్రమార్కులపై ఫిర్యాదుచేసే బాధితులు చివరి వరకు కేసులు నిలబడేందుకు గట్టిచర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మాతాశిశు మరణాల నివారణ చర్యలు

కడప,జనవరి 21: మాతాశిశుమరణాలు తగ్గించేందుకు ముఖ్యంగా ఆడశిశువుల సంరక్షణ నిమిత్తం రాష్ట్రప్రభుత్వం అత్యంతప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకుని గర్భిణీలకు ఆల్ట్రా సౌండ్ పరీక్షలు కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లలోనూ, ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఉచితంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. గర్భం దాల్చినప్పటినుంచి శిశువు పెరుగుదల, వివిధ రుగ్మతలు తెలుసుకోవడానికి అత్యంత కీలకమైన అల్ట్రాసౌండ్ వైద్యపరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంది. ఆల్ట్రాసౌండ్ పరీక్షలు అందుబాటులో ఉన్న జిల్లాలోని 14 కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లలోనూ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా పరీక్షలు నిర్వహించేందుకు ఎంఓయు ఒప్పందం నిమిత్తం, ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ పరీక్షలు నిర్వహణ నిమిత్తం కేంద్రప్రభుత్వం కూడా జాతీయ ఆరోగ్యమిషన్ నిధుల నుంచి ఖర్చుచేయాల్సివుంది. జిల్లా వ్యాప్తంగా 73 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలో 448 ఉపాధి ఆరోగ్యకేంద్రాలు ఉన్నాయి. వాటిలో 34 ఆరోగ్యకేంద్రాలు 24 గంటలు పనిచేయాల్సివుంది. ఆరు సీమాంగ్ ఆసుపత్రులు, ఆరు పిపి యూనిట్లు, ఒక పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం, 12 వైద్యవిధాన పరిషత్ వైద్యశాలలు, ప్రొద్దుటూరులో జిల్లా కేంద్ర వైద్యశాల, ప్రాంతీయ, వైద్య, ప్రభుత్వ వైద్యశాలలు 3, పట్టణ ఆరోగ్యకేంద్రాలు 10 వరకు ఉన్నాయి. ముఖ్యంగా జిల్లాలో 2315 మంది ఆశావర్కర్లు పని చేస్తున్నారు. 3615 అంగన్వాడీ కేంద్రాల్లో మాతృమరణాలు, శిశుమరణాలు, గర్భవతుల నమోదు, ప్రసవ పూర్వ ఆరోగ్యపరీక్షలు, గర్భవతులు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, కుటుంబ నియంత్రణ శస్తచ్రికిత్సలు, ఆసుపత్రుల్లో ప్రసవం, మాతృశిశుమరణాలపై ఎప్పటికప్పుడు నిఘా వంటి వాటిపై అల్ట్రాసౌండ్ నిర్వహణ నిమిత్తం రాష్ట్రప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. ఆల్ట్రాసౌండ్ పరీక్షలు ప్రాథమిక వైద్య ఆరోగ్యకేంద్రాల్లో, రూ.200్ఫజును నిర్థారించి ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరీక్షలు చేయాలని నిర్ణయించింది. అయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆల్ట్రాసౌండ్ పరీక్షలు రూ.500 నుంచి రూ.700 వరకు వసూళ్లు చేస్తున్నారు. సామాన్యప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి, కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లలో ఉచితంగా అల్ట్రాసౌండ్ పరీక్షల నిర్వహణ, ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కేవలం రూ.200లతో పరీక్షలు నిర్వహించాల్సివుంది. 2016-17లో 64684 మంది గర్భవతులు ఉండగా వారికి ఉచితంగా వ్యాధినిరోధక టీకాలు, ఆరోగ్య తనిఖీలు, హైరిష్ తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మాతృ, శిశుమరణాలు తగ్గించేందుకు కేంద్రప్రభుత్వ ఆల్ట్రాసౌండ్ పరీక్షలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఉచితంగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా కేవలం రూ.200లకే నిర్వహించి ఆ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. మొత్తం మీద మాతశిశుమరణాలు తగ్గించేందుకు ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా నిర్వహణకు చర్యలు దిశగా శ్రీకారం చుట్టారు. దీంతో సామాన్యులకు ఊరట కల్గుతుందని చెప్పవచ్చు.