కడప

నేడు కేంద్ర కరవు బృందం రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జనవరి 23: జిల్లాకు కేంద్ర కరవుబృందం మంగళవారం రానుంది. ఈ బృందం క్షేత్రస్థాయిల్లో పర్యటించి రైతులతో కలిసి పంట పొలాలు పరిశీలించి కేంద్రప్రభుత్వానికి నివేదిక సమర్పించిన అనంతరం రైతులను ఆదుకునేందుకు కేంద్రానికి కరవు బృందం నివేదిక పంపనుంది. వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్ సీజన్‌లో పంటలు దిగుబడి రాక పూర్తిగా కరవునెలకొనడంతో కేంద్రం, రాష్ట్రప్రభుత్వాలకు కరవుప్రాంతాల రైతులను ఆదుకోవాలని నివేదిక పంపింది. రాష్ట్రం జిల్లాలో 32 మండలాలు కరవుమండలాలుగా ప్రకటించింది. ఈ నేపధ్యంలో కరవు ప్రాంతాల్లో కేంద్రబృందం పరిశీలించి, ఎండిపోయిన పండ్లతోటలను ఖరీఫ్‌లో సాగుచేసిన ఎండి పోయిన పంటల ప్రాంతాలను కేంద్ర బృందం పరిశీలించనుంది. కరవు బృందం వెంట కలెక్టర్ కెవి సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ శే్వతతెవతియ, వ్యవసాయశాఖ, రెవెన్యూశాఖ, ఉద్యానవనశాఖ, జలవనరులశాఖ తదితరశాఖల అధికారులు పర్యటించనున్నారు. పర్యటన అనంతరం జిల్లాకేంద్రంలో శాఖలవారీగా అధికారులతో సమీక్ష నిర్వహించి కేంద్రానికి నివేదిక పంపనున్నారు.

శెనగ పంట అగ్నికి ఆహుతి
* 25 ఎకరాల పంట నష్టం
జమ్మలమడుగు, జనవరి 23: పెద్దముడియం మండలం డి.కల్వటాల గ్రామానికి చెందిన ఎ.శేఖర్‌రెడ్డి సాగుచేసిన శెనగ పంట అగ్నికి ఆహుతి అయింది. వివరాల మేరకు శేఖర్‌రెడ్డి 25 ఎకరాలను కౌలుకు తీసుకుని శెనగ పంటను సాగుచేశారు. అత్యల్పంగా దిగుబడి వచ్చిన పంటను పొలంలోనే నూర్పిడిచేసి తరలించేందకు సిద్ధం చేశాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అకస్మాత్తుగా పొలంలో నూర్పిడిగావున్న శెనగ అగ్నికి ఆహుతి అయింది. సోమవారం ఉదయం విషయం తెలుసుకున్న బాధితుడు శేఖర్‌రెడ్డి పొలంకువెళ్లి చూడగా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విషయంపై పెద్దముడియం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి డియస్పీ టి.సర్కార్ సిబ్బందితో కలిసి వచ్చి పరిశీలించాడు. అనంతరం డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. వైకాపా నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ సుధీర్‌రెడ్డి సంఘటన స్థలానికివచ్చి బాధితుడిని పరామర్శించి సంఘటనపై ఆరా తీశారు. బాధితుడికి న్యాయం జరిగేలా చూడాలని డియస్పీని, అధికారులను సుధీర్‌రెడ్డి కోరారు. ఈ విషయంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దముడియం పోలీసులు తెలిపారు.

వామికొండకు చేరిన కృష్ణాజలాలు

కడప,జనవరి 23: రాయలసీమలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గండికోట ప్రాజెక్టులో అంతర్భాగమైన వామికొండకు ఎట్టకేలకు కృష్ణాజలాలు చేరాయి. ఆదివారం గండికోట నుంచి వామికొండకు శెట్టివారిపల్లె వద్ద టిడిపి, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు పోటాపోటీగా గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. సోమవారం ఉప్పలూరు సమీపంలో ఉన్న వామికొండ రిజర్వాయర్ హెడ్‌రెగ్యులేటర్ వద్దకు జలాలు చేరుకున్నాయి. దీంతో కృష్ణాజలాలు తమ ప్రాంతానికి రావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆనందంతో కాలువల్లో దిగి గంతులు వేశారు. ఇక్కడి నుంచి రిజర్వాయర్‌లోకి కృష్ణాజలాలు వెళుతున్నాయి. రిజర్వాయర్‌లో ప్రస్తుతం 0.3 టిఎంసిలు నీరు నిల్వచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే సర్వారాయసాగర్ వైపు వెళ్లే హెడ్‌రెగ్యులేటర్ సరిగా పనిచేయనందున వాటి నుంచి లీకై సర్వారాయసాగర్ వైపు నీరు వెళ్లడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సర్వారాయ సాగర్ పనులు ఇంకా జరగాల్సివుండగా ఆలస్యం కావడంతో సర్వారాయసాగర్ వైపు కృష్ణాజలాలు త్వరితగతిన వెళ్లేందుకు అవకాశాలు కన్పించడంలేదు. రిజర్వాయర్ పనులు నత్తనడకన నడుస్తున్నకారణంగా నీళ్లు అటుగా వెళితే పనులు కుంటుపడతాయన్న ఆందోళన అటు కాంట్రాక్టర్లలో వ్యక్తవౌతోంది. వృధా అవుతున్న నీటిని కట్టడి చేయకపోతే వామికొండకు నీరు చేరే అవకాశం లేదని రైతులు భావిస్తున్నారు. వామికొండ రిజర్వాయర్ కింద 10,054 ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే మూడు మండలాలకు సంబంధించిన ఆయకట్టు ఆ సాగర్ కింద ఉంది. ఎర్రగుంట్ల మండలం చిలమకూరు పంచాయతీ పరిధిలోని పలు గ్రామాలకు సంబంధించిన 2952 ఎకరాలు భూమి సాగుకానుంది. అతి తక్కువగా అంకిరెడ్డిపల్లె గ్రామంలో కేవలం 52 ఎకరాలు భూమి మాత్రమే సాగులోకి వస్తోంది. వామికొండ రిజర్వాయర్ వైశాల్యం దాదాపు వెయ్యి ఎకరాలు కాగా చుట్టుకరకట్ట పొడవుతొమ్మిది కిలోమీటర్లు ఉంది. ఎన్నో ఏళ్లుగా గండికోట రిజర్వాయర్ ద్వారా పులివెందుల, కమలాపురం, నియోజకవర్గాలలోని అనేక గ్రామాల ఆయకట్టుకు నీరు అందించాలన్న తపనతో దశాబ్దాల క్రితం ప్రారంభించిన ఈ గండికోట రిజర్వాయర్ నుండి ఈప్రాంతానికి కృష్ణాజలాలు రావడంతో ఈప్రాంతరైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కృష్ణాజలాలు తగినంత జలాశయాల్లో నిల్వవుంచి ఆయకట్టుకు నీరు ఇచ్చి పంటలు ఎండిపోకుండా కాపాడతారా అన్న అనుమానం మాత్రం రైతుల్లో ఇంటా మిగిలి వుంది.

వ్యాపారుల ఆందోళన

బద్వేలు, జనవరి 23: ఎన్‌హెచ్-7 రోడ్డు పనుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సోమవారం వ్యాపారులు రోడ్డెక్కారు. రోడ్డుకు ఇరువైపులా నిర్ణీత కొలతలు వేసి ఆక్రమణలు తొలగించిన తర్వాతే రోడ్డును ఏర్పాటుచేయమని తాము చెబుతున్నప్పటికీ ఒక వర్గంవారు అధికారులతో కుమ్మక్కు కావడంతో రోడ్డును మధ్యలో కాకుండా జరిపి తమ ఇళ్ల వైపుకు తీసుకొస్తున్నారంటూ మైదుకూరురోడ్డులోని పలువురు వ్యాపారులు ఆరోపించారు. సోమవారం మధ్యాహ్నం రోడ్డు వేసేందుకు సిబ్బంది రావడంతో ఆ పనులను రోడ్డుకు ఒకవైపునున్న వ్యాపారులు అడ్డుకున్నారు. ముందుగా డ్రైనేజీ కాలువలు తీసిన తర్వాత రోడ్డును వేస్తామని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారని, అయితే మరలా రోడ్డు పనులు ప్రారంభించడం ఎందుకంటూ పనులను నిలిపివేశారు. ఈ సందర్భంగా మరొకవైపునున్న వ్యాపారులు పనులు ప్రారంభించాలంటూ వత్తిడి తీసుకురావడంతో రోడ్డుకు ఇరువైపులానున్న వ్యాపారుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. మాటకుమాటా పెరగడంతో విషయాన్ని తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు పిలిపించి అర్బన్ ఎస్సై వ్యాపారుల వద్ద నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఎన్‌హెచ్-7 డిఇతో ఫోన్‌లో మాట్లాడగా తాను కడపలో ఉన్నానని తెలుపడంతో స్థానిక సిబ్బందిని స్టేషన్‌కు రమ్మనాలని ఎస్సై తెలియజేశారు. అనంతరం ఇంజనీరింగ్ అధికారులు, వ్యాపారులు చర్చించి మంగళవారం నుంచి రోడ్డుకు ఇరువైపులా కాలువలు తీసిన తర్వాత పనులను ప్రారంభించేలా తాము కోరినట్లు వ్యాపారులు తెలిపారు.

బాలికలే సమసమాజ నిర్మాతలు

కడప,జనవరి 23: సమ సమాజ నిర్మాణానికి కర్తలు బాలికలేనని కలెక్టర్ కెవి సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బాలికల దినోత్సవంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 24వ తేదీన బాలికల దినోత్సవం పురస్కరించుకుని భవిష్యత్ సమాజ నిర్మాణ కర్తలు బాలికలేనని అభివృద్ధి చెందిన దేశాల్లో స్ర్తి నిష్పత్తి ఎక్కువగా ఉందని, అలాగే మన దేశంలో స్ర్తి నిష్పత్తిలో మన జిల్లాను చూస్తే వెయ్యిమంది పురుషులకు గాను 918 మంది స్ర్తిలు మాత్రమే ఉన్నారని ఇది అభివృద్ధికి చిహ్నం కాదని ఈ విషయంపై ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆడ పిల్లలను ఆహ్వానించాలని కోరారు. ప్రభుత్వం ఈ అంశంపై అనేక కార్యక్రమాలు అంమలుచేస్తున్నా ప్రయోజనం కొంత మాత్రమే ఉందని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆడపిల్ల పుట్టుకను సంతోషంగా ఆహ్వానించి, వారికి మంచి విద్యాబుద్దులు నేర్పించి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు తోడ్పడాలన్నారు. బాల్య వివాహాలను అరికట్టాలని బాల్యవివాహం చట్టరీత్యా నేరమన్నారు. తొలుత బాల వివాహాలు చట్ట విరుద్దం, బాల్య వివాహం చట్టరీత్యా నేరం అన్న గోడపత్రాలను కలెక్టర్, జెసి శే్వత, జిల్లాన్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి, జిల్లా అదనపు జడ్జి యు.యు.ప్రసాద్‌లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిఆర్వో ఈశ్వరయ్య, డిఆర్‌డిఏ పిడి అనిల్‌కుమార్‌రెడ్డి, డ్వామా పిడి రమేష్, ఐసిడిఎస్ పిడి రాఘవరావు, జిల్లా బాలల హక్కుల పరిరక్షణ అధికారి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్రజాపాలనలో టిడిపి విఫలం : ఎమ్మెల్యే

పెండ్లిమర్రి,జనవరి 23: గతమూడు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పాలనలో పార్టీ విఫలమైందని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డి విమర్శించారు. సోమవారం మండలంలోని ఉలవలపల్లె గ్రామంలో గడప గడప కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ అబద్దపు హామీలతో అందలం ఎక్కిన చంద్రబాబునాయుడు పరిపాలన విఫలమైందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఇప్పటికీ ప్రజలు మరచిపోలేదన్నారు. వైకాపా అధికారంలోకి వస్తే తిరిగి రాజన్న రాజ్యం పాలన వస్తుందని ఆయన మహిళలకు తెలిపారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పి అందలం ఎక్కిన ఆరునెలలకు కేవలం రూ.10వేలు మాత్రమే ఒక్కొ మహిళకు మాఫీ చేస్తామని చెప్పి నేటికి ఆ రూ.10వేలు కూడా ఖాతాల్లో వేయని పరిస్థితి నెలకొనిందన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో మాత్రం రైతులకు పెద్ద పీట వేస్తామని చెప్పి, నిరుద్యోగ భృతి కల్పిస్తామని వాగ్దానం చేసి ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి గురించి చర్చించడం కానీ చేయలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల ఉపాధ్యక్షుడు వెంకటశివారెడ్డి, ఉప సర్పంచ్ రామాంజనేయరెడ్డి, మండల కన్వీనర్ చంద్రారెడ్డి, సర్పంచ్‌లు రవీంద్రారెడ్డి, నాగమల్లేష్, వైకాపా నాయకులు రామసుబ్బారెడ్డి, గంగాధర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
భార్య హత్యకేసులో భర్తకు జీవిత ఖైదు
కడప,(లీగల్)జనవరి 23: బద్వేలుపట్టణం సుమిత్రనగర్‌కు చెందిన షేక్ మహబూబ్‌బాషాపై భార్యను హత్యచేసిన నేరం రుజువైనందున జీవితఖైదు, రూ.3వేలు జరిమానా విధిస్తూ కడప జిల్లా నాల్గవ అదనపు జిల్లా జడ్జి ఎస్.అన్వర్‌బాషా సోమవారం తీర్పుచెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి... బద్వేలు పట్టణం సుమిత్ర నగర్‌కు చెందిన షేక్ మహబూబ్‌బాషా మైదుకూరు పట్టణానికిచెందిన షేక్ షహనాబీని కట్నకానుకలతో వివాహంచేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం. అనంతరం మహబూబ్ బాషా జీవనోపాధికోసం కువైట్‌కు వెళ్లాడు. తిరిగి 2015లో బద్వేలుకు వచ్చి ఎలాంటి పనులు చేసుకోకుండా జులాయిగా తిరుగుతూ తాగుడుకు బానిసై భార్యను, బిడ్డలను కొట్టి వేధించేవాడు. కాగా దురలవాట్లకు బానిస అయిన మహబూబ్‌బాషా భార్యను అదనంగా రూ.10వేలు అదనపు కట్నం తెమ్మని వేధించేవాడు. ఆమె అదనపు కట్నం తమ తల్లిదండ్రులు ఇవ్వలేదని తిరస్కరించేంది. ఇందుకు మహబూబ్‌బాషా 2015లో మధ్యాహ్నం 1గంటకు భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ సంఘటనను గమనించి కాలనీ వాసులు ఆమెను రిమ్స్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ 2-8-2015వ తేదీన ఆమె కాలిన గాయాలతో మరణించారు. తమల కుమార్తె మరణానికి కారణం అత్తమామలు, భర్త అని బద్వేలు పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో బద్వేలు పోలీసులు ముద్దాయిలపై హత్యకేసును నమోదుచేయగా జిల్లా కోర్టులో పబ్లిక్‌ప్రాసిక్యూటర్ రాజశేఖరరెడ్డి 14 మంది సాక్ష్యాలతో ముద్దాయి మహబూబ్‌బాషాపై నేరం రుజువుచేయగా జీవిత ఖైదు విధించారు. కాగా తల్లిదండ్రులపైన నేరం రుజువుకానందున కేసును కొట్టివేశారు.
రెండు ఆలయాల్లో చోరీ
పులివెందుల, జనవరి 23: ఆదివారం అర్ధరాత్రి మండలపరిదిలోని అరిశవెల్లి గంగమ్మ ఆలయం, పుట్టరాయునిపేట వద్దనున్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీ జరిగింది. అర్బన్ ఎస్సై గోపీనాధ్‌రెడ్డి వివరాల మేరకు ఆదివారం అర్ధరాత్రి చోరి జరిగినట్లు అనుమానం వ్యక్తమవుతోందని, అరిశవెల్లి ఆలయంలో దాదాపు రూ.10 వేల వరకు హుండీలో డబ్బును దోచుకెళ్లారని, ఈ విషయాన్ని సోమవారం ఉదయం ఆలయ అర్చకులు తమకు తెలియజేశారని, దీంతో తాము అక్కడికి వెళ్లి పరిశీలించామని తెలిపారు. కేసు నమోదుచేసి విచారణ చేపట్టామని ఎస్సై అన్నారు.

లోకేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు
తెలిపిన వాసు

కడప,జనవరి 23: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌బాబు జన్మదినం సందర్భంగా సోమవారం జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు) గుంటూరుకు వెళ్లి లోకేష్‌బాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతోపాటు ప్రొద్దుటూరు పార్టీ ఇన్‌చార్జి ఎన్.వరదరాజులురెడ్డి, గ్రంథాలయ కమిటీ అధ్యక్షుడు రమణారెడ్డి, జిల్లాలోని ప్రముఖులు గుంటూరుకెళ్లి లోకేష్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ కూడా జిల్లా నేతలపై ఆరా తీసి జిల్లా విషయాలను అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా జిల్లాలో లోకేష్ జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయాల్లో కార్యాలయ ఇన్‌చార్జి చింతంరెడ్డి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.హరిప్రసాద్, కార్యనిర్వహణ కార్యదర్శి ఎస్.గోవర్ధన్‌రెడ్డి, వాసు పిఏ ధర్మారెడ్డి తదితరులు లోకేష్‌బాబు జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నేతలు, కార్యకర్తలు లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాలల్లో, ఆసుపత్రుల్లో పండ్లు పంపిణీ చేశారు.

పిఆర్ కార్యాలయం ఎదుట
సిపిఐ ధర్నా

బద్వేలు, జనవరి 23: అధికారపార్టీ నాయకుల అధిపత్యంతో ఆగిపోయిన రూ.11 కోట్ల పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌చేస్తూ సోమవారం స్థానిక పంచాయతీరాజ్ డిఇ కార్యాలయం ఎదుట సిపిఐ ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బద్వేలు ఏరియా, పట్టణ కార్యదర్శులు వి.వీరశేఖర్, ఎస్.చంద్రశేఖర్‌లు మాట్లాడుతూ 2015-16వ ఆర్థిక సంవత్సరానికిగాను నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బిసి గ్రామాల్లో సిమెంట్‌రోడ్లు వేయడానికి 260 పనులకుగాను రూ.11 కోట్లు మంజూరైందన్నారు.
అయితే నియోజకవర్గంలోని అధికారపార్టీ నేతలు ఆ పనులు తమ వర్గానికంటే తమ వర్గం వారికంటూ అదిపత్యం కోసం ప్రాకులాడుతూ వచ్చిన నిధులను సైతం వెనక్కు వెళ్లేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే నిధులు, అభివృద్ధి విషయంలో నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుంటే వచ్చిన అరకొర నిధులు కూడా ఇలాంటి నాయకుల మధ్య అనైక్యత వలన ఆగిపోతే నియోజకవర్గం ఎప్పటికి అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆదిపత్యం మాని అభివృద్ధికి కృషి చేయాలని, లేకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. ఆమేరకు పిఆర్ డిఇ స్పందించి ఫిబ్రవరి 5వ తేదీలోగా అన్ని పనులూ ప్రారంభిస్తామని తెలియజేశారు. డిఇ ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే 6వ తేదీన డిఇ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పారు. ధర్నాలో సిపిఐ నాయకులు పి.జకరయ్య, పి.చంద్రమోహన్‌రాజు, ప్రభాకర్, ఎఐఎస్‌ఎఫ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

గడప గడపకు వైకాపాకు విశేష స్పందన

సంబేపల్లె, జనవరి 23: గడప గడపకూ వైకాపా కార్యక్రమానికి సంబేపల్లె మండలంలో విశేషస్పందన లభిస్తోంది. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామగ్రామాన కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం 7 గంటలకే ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి నారాయణరెడ్డిగారిపల్లె గ్రామంలో గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. గ్రామంలోని ముద్దినేనివడ్డెపల్లె, ముద్దినేనివాండ్లపల్లె, మద్దిరవాండ్లపల్లె, యర్రగుంట్ల, హరిజనవాడ, సుద్దలవాండ్లపల్లె, పేయలవాండ్లపల్లె, శ్రీనివాసపురంలలో ఇంటింటికీ వెళ్లి పార్టీ రూపొందిన ప్రచారపత్రాలను పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేరాయా అని అడుగుతుంటే లేదానే సమాధానాలే ఎక్కువగా వస్తున్నాయి. స్థానిక సమస్యలను కూడా గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. తిరుమలరాయగుట్టపై ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు విన్నవించగా, ఇందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. వీధుల్లో సిమెంట్‌రోడ్లను విడతల వారీగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో దళితుల ఇళ్లకు విద్యుత్ ఛార్జీలు ఉండేవి కావని, ఇపుడు చార్జీలు కట్టాలని విద్యుత్ శాఖాధికారులు తమపై దాడులు నిర్వహిస్తున్నారని ఆయన దృష్టికి యర్రగుంట్ల హరిజనవాడ ప్రజలు తీసుకురాగా, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తానని తెలిపారు. మద్దిరవాండ్లపల్లెలో మినీ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ ఆవుల విష్ణువర్ధన్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి, ఎంపీటీసీ, అలివేలమ్మ, మాజీ సర్పంచ్ శంకర్‌రాజాయాదవ్, వైసీపీ నాయకులు ఉదయ్‌కుమార్‌రెడ్డి, వడ్డే వెంకటరమణారెడ్డి, నాగరాజయాదవ్, శ్రీనివాసులరెడ్డి, శివశంకర్‌యాదవ్, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజావాణి అర్జీలను సత్వరమే
పరిష్కరించాలి
రాజంపేట, జనవరి 23: మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై వచ్చే ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరిస్తే ఫిర్యాదులు తగ్గుముఖం పడతాయని విప్ మేడా మల్లికార్జురెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ వీరబ్రహ్మం అధ్యక్షతన జరిగిన ప్రజావాణిలో విప్ మేడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలస్థాయిలో భూములు, నివేశన స్థల పట్టాలు తదితర సమస్యలు పరిష్కారం కాకపోవడంతోనే ప్రజలు డివిజన్‌స్థాయి ప్రజావాణికి హాజరవుతున్నారన్నారు. మండల అధికారులు ప్రజల అర్జీలపై సకాలంలో స్పందిస్తే ప్రజలు వ్యయప్రయాసలకు ఓర్చి ఆర్డీఓ కార్యాలయం వరకు వచ్చే వారు కాదన్నారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తమ విద్యార్థిని, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. విద్యార్థులకు నెల వారి పాసులు మంజూరు చేయడంలో ఆర్టీసీ అధికారులు సరిగా స్పందించడం లేదన్నారు. వెంటనే ఎమ్మెల్యే స్పందిస్తూ ఆర్టీసీ డిఎంకు ఫోన్‌చేయగా ఆయన ప్రజావాణికి హజరై కళాశాల ప్రిన్సిపాల్ సూచించిన తేదీలలో ఆర్టీసీ సిబ్బందే కళాశాలకు వెళ్లి పాసుల కేంద్రాన్ని ఏర్పాటుచేసి విద్యార్థులకు పంపిణీ చేస్తామన్నారు. ఈ సందర్భంగా మేడా మాట్లాడుతూ ఉన్నత చదువుల కోసం వచ్చే విద్యార్థిని, విద్యార్థులు బస్సు పాసులు లేక పోవడంతో ఆటోలలో ప్రయాణించి వ్యయ, ప్రయాసలకు గురవుతున్నారని, విద్యార్థుల కోసం నందలూరు ఆర్‌ఎస్ నుండి రాజంపేట ప్రభుత్వ కళాశాల వరకు రెండు బస్ సర్వీసులు నడపాలన్నారు. కళాశాల వద్ద ఆర్టీసీ బస్ షెల్టర్ ఏర్పాటుకు మున్సిపల్ అధికారులకు సూచిస్తామన్నారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంకు కృషి చేస్తున్న ఆర్డీఓ వీరబ్రహ్మంను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రజావాణికి విచ్చేసే ప్రతి అర్జీదారుని సమస్యను తెలుసుకుని, ఆ సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో ఇక్కడి నుండే ఫోన్‌లో మాట్లాడి తగు సూచనలు అందజేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి అర్జీదారునికి సత్వర రెవెన్యూ సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎఓ శ్రీనివాసులు, తహశీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపిడిఓ హరినాధ్‌బాబు, టిపిఓ బాలాజీ, టిడిపి నాయకులు బాపనయ్యనాయుడు, సంజీవరావు, కె.సుబ్బరామిరెడ్డి, మైనార్టీ నాయకులు జి.గుల్జార్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

కేంద్రమంత్రిని కలిసిన ఆల్విన్ కార్మికులు

నందలూరు, జనవరి 23: కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయను ఆదివారం ఆయన నివాసంలో నందలూరు ఆల్విన్ మాజీ కార్మికులు పెన్షనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎమ్మార్ ప్రతాప్ ఆధ్వర్యంలో కలసి వినతిపత్రాన్ని అందజేశారు. సోమవారం ప్రతాప్ మాట్లాడుతూ ఆల్విన్ పెన్షనర్ల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. 1995లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికమంత్రి వెంకటస్వామి ఇపిఎఫ్ కార్మికులకు రూ. 800 నుండి వెయ్యి రూపాయల వరకు పెన్షన్ పెంచేలా ఒక చట్టంతెచ్చి మేలు చేశారన్నారు. ఇప్పటి బిజెపి ప్రభుత్వంలో కేంద్ర మంత్రి కార్మిక సమస్యలపై తిరిగి ఆ చట్టాన్ని సవరించి రూ. 6,500 పెన్షన్ ఇప్పించేందుకు కృషిచేయాలని కోరామన్నారు. తమ వినతిపట్ల మంత్రి సానుకూలంగా స్పందించారని, కేంద్ర ప్రభుత్వంతో చర్చించి న్యాయం చేస్తామని హమీ ఇచ్చారన్నారు. మంత్రిని కలిసిన వారిలో సంఘ నాయకులు గోవిందరెడ్డి, విజయుడు, ఓబయ్య, ఎర్రన్న, వెంకట్రామిరెడ్డి, సంజీవరెడ్డి, పరమేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కడపను పోలియో రహిత
జిల్లాగా తీర్చిదిద్దాలి

కడప,జనవరి 23: అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కెవి సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో పల్స్‌పోలియో జిల్లా టాస్క్ఫోర్స్ సమావేశం , స్పర్శ్ కార్యక్రమంపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 29వ తేదీన మొదటి విడత పల్స్‌పోలియో కార్యక్రమం, ఏప్రిల్ 2న రెండవ విడత పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ పోలియో రహిత సమాజం కోసం తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. గత 25 సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రస్తుతం మన దేశంలో పోలియో లేకున్నా పొరుగుదేశాల్లో పోలియోకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయన్నారు. అందుకుగాను ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా 29వ తేదీ బస్టాండ్, రైల్వేస్టేషన్, జనరద్దీ కేంద్రాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పర్చి చిన్నారులకు టీకాలు వేయిం చాలని అధికారులును ఆదేశిం చారు. గ్రామాల్లో తగిన సౌకర్యాలు అందిం చాలన్నారు. కార్యక్రమంలో డిఆర్వో ఈశ్వరయ్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.