కడప

అభివృద్ధే ధ్యేయంగా సైకిలెక్కిన ఎమ్మెల్సీ బత్యాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,్ఫబ్రవరి 10: కాంగ్రెస్ పార్టీ సీనియర్‌నేత, కాపుసంఘ నేత ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు కోడూరు అభివృద్ధిని ఆకాంక్షించి తెలుగుదేశం పార్టీలో గురువారం ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుతో చర్చలు జరిపి సూత్రప్రాయంగా తెలుగుదేశం పార్టీలో చేరినట్లు శుక్రవారం ఆయన అనుచరగణం పేర్కొన్నారు. అలాగే జిల్లా అభివృద్ధి, ముఖ్యంగా ప్రాజెక్టు నిర్మాణాల పూర్తి, రైల్వేకోడూరు సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు తోడ్పాటు అందిస్తారని తన అనుయాయులతో పెద్ద ఎత్తున అధికారంగా టిడిపిలో ఈనెల 17న నియోజకవర్గం వ్యాప్తంగా నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నట్లు ఆయన అనుచరగణం తెలిపారు. ఈ నేపధ్యంలో బత్యాల చెంగల్రాయులు ఈనెల 13వ తేదీన కాంగ్రెస్‌పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామాచేసి ఈనెల 17న తన అనుచరవర్గంతో బహిరంగంగా తెలుగుదేశంపార్టీలో చేరుతున్నట్లు ఆయన అనుచరులు తెలుపుతున్నారు. ఆయన రైల్వేకోడూరు సమీపంలోని తిరుపతిలో విద్యాభ్యాసం చేసి విద్యార్థినాయకునిగా కొనసాగిన నేపధ్యంలో తిరుపతిలో రింగ్‌రోడ్డు, కడప జిల్లా అభివృద్ధి, రైల్వేకోడూరుకు ప్రత్యేక అభివృద్ది చేసేందుకు తెలుగుదేశంపార్టీలో ప్రస్తుతం చేరారని వారు గుర్తుచేశారు. తెలుగుదేశంపార్టీ నేత ఎన్.చంద్రబాబునాయుడు చేపడుతున్న అభివృద్ధిపథకాలు, సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులు పూర్తిచేయడంపై పార్టీలో చేరినట్లు ఆయన అనుచరగణం తెలిపారు. అలాగే కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రజలు తిరుమల పుణ్యక్షేత్రం దర్శనం నిమిత్తం నేరుగా తిరుమల వెళ్లేందుకు రింగ్ రోడ్డు ఏర్పాటుచేసి రామచంద్రాపురం, భాకరాపేట, పుత్తూరు, ఏర్పేడు, తిరుచానూరు, చంద్రగిరి మీదుగా సరాసరి తిరుమలకు చేరేందుకు రింగ్‌రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని చాలా కాలంగా ప్రజలతో చెప్పుకుంటూ వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా ఈప్రతిపాదన అందజేసినట్లు తెలిసింది. ప్రతి కుటుంబానికి నెలకు 35కేజిలు పంపిణీ చేసే విధంగా కూడా ప్రతిపాదన సిఎంకు అందజేసినట్లు తెలిసింది. గతంలో ఆయన రాజకీయ రంగప్రవేశం బిజెపి ద్వారా జరిగి రాష్టస్థ్రాయిలోనే సీనియర్ నేతగా ఉంటూ కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడుకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించారు. ప్రస్తుతం కేంద్రంలో బిజెపితో, రాష్ట్రంలో టిడిపితో సంబంధాలు ఏర్పరచుకుని రైల్వేకోడూరు అభివృద్ధికి టిడిపిలో చెంగల్రాయులు సూత్రప్రాయంగా చేరినట్లు ఆయన అనుచరగణం తెలుపుతున్నారు. మొత్తం మీద జిల్లాలోనే ఒక కాపునేతగా, సీనియర్ నాయకుడుగా, విద్యావంతుడుగా చెంగల్రాయులుకు మంచి పేరుంది. అందేకాకుండా వచ్చేనెలలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి బిటెక్ రవిని గెలిపించేందుకు చెంగల్రాయులు వర్గానికి చెందిన 50మంది పైబడి ప్రజాప్రతినిధుల ఓటర్లు ఉండటంతో ఆయన టిడిపిలో చేరడంతో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది.

క్రికెట్ బుక్కీలు అరెస్టు

లక్కిరెడ్డిపల్లె,్ఫబ్రవరి 10: మండలంలోని లక్కిరెడ్డిపల్లె స్టేట్ బ్యాంకు ఎదురుగా ఉన్న వీధిలోని ఇంటిలో శుక్రవారం జరుగుతున్న ఇండియా-బంగ్లాదేశ్ టెస్టుమ్యాచ్‌కు సంబంధించి 11 మంది క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండటంతోపాటు వారు గంజాయినీ కూడా విక్రయిస్తుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లక్కిరెడ్డిపల్లె సిఐ పుల్లయ్య, ఎస్‌ఐలు రాజాప్రభాకర్, మంజునాథ్‌లు ఏక కాలంలో దాడులు నిర్వహించి వారి వద్ద నుంచి 20కేజిల గంజాయి, రూ.42,500 నగదు, 8సెల్‌ఫోన్లు, టివి, సెటాప్ బాక్సును స్వాధీనం చేసుకున్నట్లు పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్ తెలిపారు. వీరితోపాటు మరో నలుగురు వేరొక ప్రాంతంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా క్రైమ్‌నెం.20/17 కింద అరెస్టుచేయగా, ఒకరు తప్పించుకుని పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. పోలీసుల వివరాలు మేరకు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఇండియా-బంగ్లాదేశ్ టెస్టుమ్యాచ్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న అతి పెద్ద బుక్కీ విష్ణుప్రసాద్‌రెడ్డి లక్కిరెడ్డిపల్లెకు వచ్చి సెల్‌ఫోన్ల ద్వారా బెట్టింగ్ ఆడుతుండటంతో లక్కిరెడ్డిపల్లె పోలీసులు అప్రమత్తమై దాడులు నిర్వహించగా ఒకే ఇంటిలో 11 మంది క్రికెట్‌బెట్టింగ్ నిర్వహించడంతోపాటు వారు గంజాయిని కూడా విక్రయిస్తుండటంతో పోలీసులు వారందర్నీ అదుపులోకి తీసుకున్నారు. విష్ణుప్రసాద్‌రెడ్డి అనే బుకీ గంజాయిని విశాఖపట్టణం నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వీరందరితో ఇక్కడి నుంచి గంజాయిని విక్రయించడం మొదలుపెట్టారన్నారు. దాదాపు 20 కేజిల గంజాయి ధర మార్కెట్ విలువ రూ.20లక్షలకు పైగా వుంటుందని వారు
తెలిపారు. వీరందర్నీ అరెస్టుచేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. కాగా ఆపరేషన్‌లో పాల్గొన్న సిఐ పుల్లయ్య, ఎస్‌ఐలు రాజాప్రభాకర్, మంజునాధ్, ఏఎస్‌ఐ భాస్కర్, హెడ్‌కానిస్టేబుల్ రహమతుల్లా, కానిస్టేబుళ్లు నాగేంద్ర, కిరణ్, గంగాధర్‌రెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి, రమేష్, షబ్బీర్‌లకు జిల్లా ఉన్నతాధికారుల నుంచి రివార్డులు అందజేస్తారని ఏఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

శాస్త్రోక్తంగా రావి, వేపచెట్టుకు కల్యాణం
ప్రొద్దుటూరు టౌన్, ఫిబ్రవరి 10: పట్టణంలోని వెదుర్లబజారువీధిలోనున్న రావి, వేపచెట్లకు భక్తులు శుక్రవారం శాస్త్రోక్తంగా వివాహం జరిపించారు. రావిచెట్టును స్వామివారుగా, వేపచెట్టను అమ్మవారుగా అలంకరించి, పసుపుకుంకుమలు వేసి, నూతన వస్త్రాలతో చెట్లను అలంకరించారు. ఉదయం 9గంటలకు వేదపండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ వివాహం కన్నులపండువగా జరగగా మహిళలు పెద్దసంఖ్యలో హాజరై వివాహాన్ని తిలకించారు. హిందూ సంస్కృతి ప్రకారం ఇలా వివాహం జరిపించిన యడల ప్రజలు అన్ని విధాలా సుఖసంతోషాలతో క్షేమంగా వుంటారని భక్తుల నమ్మకం. ఈ వివాహ వేడుకలో భక్తులు కాయాకర్పూరాలు సమర్పించి పూజలు చేశారు. కాగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కల్గకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.

అసాంఘిక కార్యకలాపాలకు
పాల్పడితే కఠిన చర్యలు

రాయచోటి, ఫిబ్రవరి 10: ఎంతటి వారైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్ తెలిపారు. శుక్రవారం స్థానిక అర్బన్ పోలీసుస్టేషన్‌లో అర్బన్ సీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏఎస్పీ మాట్లాడుతూ గతంలో ఎస్‌ఎన్ కాలనీలోని ఓ అంగట్లో జరిగిన చైన్ స్నాచింగ్‌కు పాల్పడటం తెలిసిందేనని, అంతేకాకుండా పట్టణంలో పలు ద్విచక్రవాహనాలు చోరీలకు పాల్పడటం జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అప్పటి నుండి తమ సిబ్బందితో కలిసి నిఘా ఉంచినట్లు తెలిపారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం చెక్‌పోస్టు వద్ద ఎస్‌ఐ మైనుద్దీన్ నిర్వహిస్తున వాహనాల తనిఖీలో అనుమానాస్పదంగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఆపి అందులోని ఇద్దరిని విచారించగా బైకు దొంగతనాలకు పాల్పడినట్లు తెలిసిందన్నారు. అంతేకాకుండా శుక్రవారం ఉదయం మదనపల్లె మార్గంలోని పెట్రోల్‌బంకు వద్ద వస్తున్న ఆటోను ఎస్‌ఐలు రమేష్‌బాబు, మైనుద్దీన్‌లు ఆపి తనిఖీలు నిర్వహించగా 4.60 తులాల బంగారు గొలుసు ఉందని తమదైన శైలిలో నిందితులను విచారించగా 12 బైకులు, ఒక ఆటోను కూడా స్వాధీనపరచుకోవడం జరిగిందన్నారు. నిందితులలో మదనపల్లెకు చెందిన షేక్ ఇర్ఫాన్, భాస్కర్‌నాయక్ కాగా రాయచోటికి చెందిన శివయ్య, సుధాకర్‌లు ఉన్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఇందుకు గాను ఈ కేసులో నిందితులను పట్టుకొనడంలో కీలకపాత్ర వహించిన అర్బన్ సీఐ మహేశ్వర్‌రెడ్డి, ఎస్ ఐలు రమేష్‌బాబు, మైనుద్దీన్, హెడ్‌కానిస్టేబుల్ సర్దార్, కానిస్టేబుళ్లు బర్కతుల్లా, ఖాదర్‌బాషలకు రివార్డులు వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వీటి విలువ దాదాపు రూ.6.50 లక్షల విలువ చేయునని ఆయన వివరించారు. ఈ సమావేశంలో అర్బన్ సీ ఐ మహేశ్వర్‌రెడ్డి, ఎస్ ఐలు రమేష్‌బాబు, మైనుద్దీన్, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

రాజంపేటలో డ్రంకన్ డ్రైవ్
రాజంపేట, ఫిబ్రవరి 10:రాజంపేట పాత బస్టాండులో శుక్రవారం రాత్రి స్థానిక మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ రాజాబాబుతో కలిసి అర్బన్ సిఐ అశోక్‌కుమార్, అర్బన్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రంకన్ డ్రైవ్‌లో మద్యం తాగి ద్విచక్ర వాహనాలు నడుపుతున్న 5మందిపై కేసులు నమోదు చేసినట్టు సిఐ అశోక్‌కుమార్ తెలిపారు. కేసులు నమోదు చేసిన వారిలో ఇ.హరి, ఆర్.గంగాధర్, కె.నాగేంద్రబాబు, కె.రాజేంద్ర, ఎ.రమేష్‌లు ఉన్నారన్నారు. ఇటీవల కాలంలో పట్టణంలో ద్విచక్ర వాహనాలు డీకొని మృతి సంఘటనలు జరుగుతున్న నేపధ్యంలో రాత్రుళ్లు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అర్బన్ సిఐ అశోక్‌కుమార్ నేతృత్వంలో ఈ డ్రంకన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సిఐ అశోక్‌కుమార్ మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టపరిధిలో చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనాలు అతివేగంగా వెళ్ళి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న యువత ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని ప్రమాదాల నివారణకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్‌ఐ రెడ్డప్ప, ఎఎస్‌ఐ నరశింహులు ఇతర పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రైల్వేకోడూరులో...
రైల్వేకోడూరు: జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి ఎస్సైలు వెంకటేశ్వర్లు, భక్తవత్సలం, వారి సిబ్బంది కడప-చెన్నై ప్రధాన రహదారిపై డ్రంకన్ డ్రైవ్ కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని రాత్రి వేళల్లో నిర్విగ్నంగా సాగిస్తామన్నారు.