కడప

విస్తృతంగా పంటల సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, ఫిబ్రవరి 14:ఒక్కప్పుడు కరవుతో అతలాకుతలమైన ఒంటిమిట్ట నేడు శ్రీకోదండరాముని పుణ్యామా అని ఒంటిమిట్ట చెరువుకు నీరు రావడంతో వేలాది బీడుగా ఉన్న భూములు పంటలతో కళకళ లాడుతున్నాయి. జిల్లాలోనే ఒంటిమిట్ట చెరువు అతి పెద్ద చెరువుగా పేరు సార్ధకం చేసుకుంది. ఇలాంటి చెరువుకు శాశ్వత నీటి వనరులు కల్పిస్థామన్న నేతల హామీలు అంతా ఇంతాకాదన్న విషయం సర్వులకు తెలిసిందే. ఇదిలా ఉండగా భద్రాద్రి రామయ్య తెలంగాణా రాష్ట్రానికి వెళ్లడంతో ఒంటిమిట్ట శ్రీకోదండరామయ్యను ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఒంటిమిట్ట చెరువుకు తప్పక శాశ్వత నీటివనరులు అవసరమైనాయనడంలో సందేహం లేదు. ఇలాంటి పరిస్ధితిల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమశిల వెనుక జలాలను ఒంటిమిట్ట చెరువుకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సుమారు రూ.33కోట్ల వ్యయంతో పనులకు ప్రత్యేక నిధులు మంజూరు చేశారు. దీంతో సుమారు 9 నెలల్లో వీటిని జిల్లా యంత్రాంగం, కాంట్రాక్టర్లు పూర్తి చేసి వాటిని సిఎం చేతుల మీదుగా విడుదల చేశారు. దీంతో చెరువుకు ప్రతి నిత్యం నీటిని విడుదల చేస్తూ ఈ ఎడాది ఏప్రిల్ 5న జరుగబోతున్న నవమి ఉత్సవాల నాటి కల్లా చెరువును పూర్తి స్ధాయి లో నింపాలన్న కలెక్టర్ ఆదేశాలను సంబదిత అధికార్లు తూచా తప్పకుండా పాటిస్తూ నీటిని చెరువులోకి సరఫరా చేస్తూన్నారు. ఫలితంగా ఈ ప్రాంతంలోని వేలాది ఎకరాల భూములకు నీటి పెరగడం ద్వారా అన్నదాతల భూములు వివిధ రకాల పంటలతో కళకళలాడుతున్నాయి. ఈ చెరువుకు నీరు ఉండడంతో ఇటు సాగునీటికి, అటు తాగునీటికి ఎలాంటి సమస్యలు నేడు తలెత్తడం లేదని ఇటు అన్నదాతలు, అటు మండల వాసులు వారి అభిప్రాయాలను చెబుతున్నారు. అలాగే ఈ చెరువు ద్వారా మండలంలోని మిగిలిన చెరువుల్లోను, బావుల్లోను, కుంటల్లోను నీటి మట్టం పెరుతోంది. ప్రస్తుతం మండల వ్యాప్తంగా వరి, అరటి, దోస వంటి పంటలపై అన్నదాతలు ఎక్కువగా మగ్గుచూపుతున్నారు. ఇప్పటికే గత ఎడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో సాగు చేసిన పంటలు చేతికి రానున్నాయి. తర్వాత కూడ రెండో కారంటూ వరి, అరటి, పంటలను సాగుచేసే అవకాశాలు కూడా లేకపోలేదు. సోమశిల డ్యామ్‌లో నీరు ఉంటే ఒంటిమిట్ట చెరువులో పుష్కలంగా నీరు ఉంటాయి. ఫలితంగా ప్రస్తుతం ఒంటిమిట్ట శ్రీకోదంరామయ్య చలువతో మండలాన్ని పీడిస్తున్న కరవు నుండి మండల ప్రజలకు విముక్తి లభించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
లైసెన్సు ఆయుధాలను
పోలీసుస్టేషన్లలో డిపాజిట్ చేయాలి

కడప,(లీగల్)్ఫబ్రవరి 14: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లాలో లైసెన్సు కలిగిన ఆయుధాలను ఆయుధాల చట్టం 1959లోని సెక్షన్ 17(3)(బి) ప్రకారం లైసెన్సు దారులు వారి సమీప పోలీసు స్టేషన్‌లో వారి వద్ద ఉన్న ఆయుధాలను డిపాజిట్ చేయాల్సిందిగా కలెక్టర్ కె.వి.సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుస్టేషన్లలో డిపాజిట్ అయిన లైసెన్సు ఆయుధాలను ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేంతవరకు పోలీసుస్టేషన్‌లో భద్రపరచడం జరుగుతుందన్నారు.