కడప

సౌమ్యనాథుని సన్నిధిలో హైకోర్టు న్యాయవాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందలూరు, ఫిబ్రవరి 18: జిల్లాలోని చారిత్రత్మక ఆలయంగా ప్రసిద్ధికెక్కిన నందలూరు సౌమ్యనాథాలయాన్ని శనివారం హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది సునీల్‌బాబు కుటుంబసమేతంగా సందర్శించారు. తొలుత ఆలయానికి వచ్చేసినవారికి స్థానిక ఎస్సై ప్రతాప్‌రెడ్డి స్వాగతం పలికారు. ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సునీల్‌బాబు కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు శర్మ వారికి ఆలయ విశిష్టతతో పాటు చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సి శివాజీగణేష్‌రావు, హేమాద్రి, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.
నీటి ఎద్దడి నివారణకు శాశ్వత చర్యలు
ప్రొద్దుటూరు టౌన్, ఫిబ్రవరి 18: పట్టణంలో నెలకొన్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికై అన్నిచర్యలూ చేపడుతున్నామని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఛైర్మన్ మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్ ఉండేల గురివిరెడ్డితో కలిసి శనివారం లింగారెడ్డి విలేఖరుల సమావేశం ఏర్పాటుచేశారు. రాష్ట్ర, కేంద్ర నిధులతోపాటు మున్సిపాలిటీలో ఉన్నటువంటి నిధులతో రాబోవు ఆరునెలల్లో పైపులైన్ల ద్వారా పట్టణంలో పూర్తిస్థాయిలో నీటిని సరఫరా చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, తక్షణమే పనులు చేపడుతామని తెలియజేశారు. అలాగే శ్రీశైలం నుండి అవుకు రిజర్వాయర్‌కు, అక్కడి నుండి గండికోట జలాశయం ద్వారా మైలవరం డ్యామ్ నుంచి పెన్నానదికి రెండున్నర్ర టి ఎంసీల నీటిని విడుదలచేసేలా జిఒను అమలుచేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబుకు, భారీ నీటిపారుదలశాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు విన్నవించామని, త్వరలో ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుండి ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని భరోసానిచ్చారు. పట్టణంలోని నీటి సమస్యపై ప్రతిపక్ష నాయకుడైన ఎమ్మెల్యే రాచమల్లుశివప్రసాదరెడ్డి ఎటువంటి దీక్షలు, పాదయాత్రలు, ఆందోళనలు చేపట్టాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత తమపై ఉందని, ప్రతిపక్ష నాయకులైన మీరు అనవసర రాద్ధాంతం చేయడం సమంజసం కాదన్నారు. మరో ఏడాదిలోపు కుందూ - పెన్నా వరదకాలువ నిర్మాణాన్ని పూర్తిచేస్తామన్నారు. గత పదిరోజుల కంటే ప్రస్తుతం పట్టణంలో నీటి ఎద్దడి కొంతమేర తగ్గించామని, పట్టణంలోని 1,2,3,7,8,9,35,36,37,38,39 వార్డుల్లో నీటి సమస్య పూర్తిగా వుండేదని, వారానికొకసారి అందించే నీటిని మూడురోజులకొకసారి అందిస్తున్నామన్నారు. మున్సిపాలిటీ పరిదిలో 52 బోర్లుండగా 25 బోర్లు పనిచేస్తున్నాయని, రెండుబోర్లు కొత్తగా వేశామని, యుద్ధప్రాతిపదికన 20 ట్యాంకర్లను కూడా ఏర్పాటుచేశామన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే ధర్నాకు కూర్చోకముందే పెన్నాకు 0.02 క్యూసెక్కుల నీరు వదిలారని, మరో 20 క్యూసెక్కులను పెంచేలా కలెక్టర్‌తో చర్చించామన్నారు. కార్యక్రమంలో మైలవరం ఇఇ సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటశివారెడ్డి, టిడిపి కౌన్సిలర్లు పాల్గొన్నారు.
భక్తులతో కిటకిటలాడిన సౌమ్యనాథాలయం
నందలూరు, ఫిబ్రవరి 18:నందలూరు సౌమ్యనాధాలయం శనివారం ప్రత్యేక పూజలను పురస్కరించుకుని జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి శనివారం ప్రత్యేక పూజలతో పాటు ప్రత్యేక అలంకరణను దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు పెద్దఎత్తున విచ్చేశారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారి చుట్టూ ప్రదక్షణలు చేశారు. ఆలయ ఇఓ సుబ్బారెడ్డి, సిబ్బంది, ఆలయ నిర్వాహకులు భక్తులు ఇబ్బందులు పడకుండా క్యూలైన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అన్నదాన సేవా ట్రస్టు అధ్యక్షులు యెద్దల సుబ్బరాయుడు, చక్రాల రామసుబ్బన్న, గంటా వాసుదేవయ్య మాట్లాడుతూ గతంలో ఒక శనివారం మాత్రమే భక్తులకు అన్నదాన సేవా ట్రస్టుద్వారా అన్నదాన ప్రసాదం కల్పించే వారమని, సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్ధం కోసం శుక్ర, శని, ఆదివారాలలో కూడా అన్నదానం ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తుల నుండి వచ్చే కానుకలు, విరాళాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే సేవా భాగ్యం కలుగుతుందన్నారు. కొంతమంది భక్తులు ప్రత్యేకంగా జన్మదినం, వివాహా వార్షికోత్సవాలను పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్నారన్నారు.