కడప

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఫిబ్రవరి 18: ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలని మాదిగలకు ఇచ్చిన హామీని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ఏపి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట శనివారం ధర్నా జరిగింది. ఈ ధర్నాకు హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతం లో మాదిగలకు ఇచ్చిన హామీమేరకు వర్గీకరణ బిల్లుపెట్టేందుకు అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి పంపాలని డిమాండ్ చేశారు. అంతకుముందు సమీపంలోని జగజ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు డప్పువాయిద్యాలతో వందలాది మం ది కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయాన్ని దిగ్బంధించారు. అనంతరం ధర్నానుద్దేశించి వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ 23 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణకోసం మాదగ ఉపకులాలు ఉద్యమాలుచేస్తున్నా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మాదిగలపట్ల చిన్నచూపు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలు 70సంవత్సరాలుగా మాదిగ ఉపకులాలకు అందకుండా కేవలం మాలకులస్తులే అనుభవించడం ద్వారా మాదిగలు నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంతో చర్చించకుండా పోవడం మాదిగల ఆగ్రహావేశాలు చవిచూడాల్సివస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా స్పందించి చంద్రబాబునాయుడు అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని లేనిపక్షంలో తమిళనాడు తరహాలో మరో జల్లికట్టు ఉద్యమాన్ని చేసేందుకు మాదిగలు వెనుకాడరని హెచ్చరించారు. అలాగే 10వ తేది నుంచి మాదిగ ఉపకులాలు అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించి మార్చి 25న విజయవాడలో రాష్టక్రార్యవర్గసమావేశం జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. అప్పటికికూడా ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చంద్రబాబు ప్రభుత్వంపై తాడోపేడో తేల్చుకునేందుకు మాదిగలు సిద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ధర్నాలో రాష్టవ్రర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.వెంకటరమణ మాది, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్.రాజారాం మాదిగ,రాష్ట్ర కన్వీనర్ జి.మునెయ్య మాదిగ, జిల్లా అధ్యక్షుడు మాతంగి సుబ్బరాయుడు మాదిగ తదితరులు ప్రసంగించారు. ఈకార్యక్రమంలో స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ ఇలియాస్, ఎ.సుబ్బరాయుడు, కె.సుబ్బరామ, సి.కొండయ్య, కె.చంద్ర, టి.హరిబాబు, బాలఓబయ్య, రమణ, బాల గురువయ్య తదితరులు పాల్గొన్నారు.

ఏడుగురు
తమిళకూలీల అరెస్టు
కమలాపురం, ఫిబ్రవరి 18: ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణపై ఏడుగురు తమిళకూలీలను శనివారం అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కడప నుంచి యర్రగుంట్లకు వెళ్లే ఆర్టీసీ బస్సులో కొందరు తమిళకూలీలు ఎర్ర చందనం దుంగలను తీసుకువెళ్తున్నట్లు అటవీశాఖ అధికారులకు సమాచారం అందడంతో వారు మండలపరిధిలోని పందిళ్లపల్లె వద్ద ఆర్టీసీ బస్సును ఆపి అనుమానాస్పదంతో ఏడుగురు తమిళనాడుకూలీలను అదుపులోకితీసుకుని వారి నుంచి ఎర్రచందనం దుంగల సంచులను స్వాధీనం చేసుకుని వారిని విచారిస్తున్నట్లు సమాచారం. వీరందరిని యర్రగుంట్ల సర్కిల్ పోలీసుస్టేషన్‌కు తరలించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
లైసెన్సు ఆయుధాలు అప్పగించాలి
కడప(లీగల్),్ఫబ్రవరి 18: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లాలో లైసెన్సు కలిగిన ఆయుధాలను ఆయుధాల చట్టం 1959లోని సెక్షన్ 17(3)(బి) ప్రకారం లైసెన్సు దారులు వారి సమీప పోలీసుస్టేషన్‌లో వారివద్ద ఉన్న ఆయుధాలను డిపాజిట్ చేయాల్సిందిగా కలెక్టర్ కె.వి.సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుస్టేషన్లలో డిపాజిట్ అయిన లైసెన్సు ఆయుధాలను ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేంతవరకు ఎస్పీ పరిధిలో గల పోలీసుస్టేషన్‌లో భద్రపరచడం జరుగుతుందని తెలియజేశారు.

అట్టహాసంగా ప్రారంభమైన గండికోట ఉత్సవాలు
జమ్మలమడుగు, ఫిబ్రవరి 18:గండికోట వారసత్వ ఉత్సవాలు శనివారం అట్టహాసంగాప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా శని, ఆదివారాల్లో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు పలు కార్యక్రమాలు రూపొందించారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఆర్డీవో, జిల్లా అధికారులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గండికోటలో ఉదయం నుండి గాలిపటాల ఎగురవేత కార్యక్రమం, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు, కేరళ కళాకారులచే సింగారి మేళా తదితరాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. మైదుకూరుకు చెందిన హరిరామ నిర్వహించిన ఇంద్రజాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ అంశాలపై ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ప్రజలు తిలకించారు. అలాగే ప్రధాన వేదికపై టిటిడి బృందం ఆలపించిన అన్నమయ్య కీర్తనలు, గండికోట వైభవం నృత్యాలు, ఎల్ ఇడి తెరపై ప్రత్యేకంగా రూపొందించిన గండికోట థీమ్ సాంగ్, శివారెడ్డిచే నిర్వహించిన మిమిక్రీ, కూచిపూడి నృత్య ప్రదర్శన, సంగీత విభావరి కార్యక్రమాలు ఆద్యంతం ప్రజలను, ఆహూతులను కట్టిపడివేశాయి.