కడప

యురేనియం నిక్షేపాలకై కొనసాగుతున్న అనే్వషణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజుపాళెం, ఫిబ్రవరి 18: యురేనియం నిక్షేపాల కోసం ఇంకా గాలింపుచర్యలు చేపడుతూనే ఉన్నారు. ఈ అనే్వషణలో రైతుల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొనివుంది. మరోమారు శనివారం కేంద్రప్రభుత్వం, యురేనియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆద్వర్యంలో హెలీకాప్టర్ ద్వారా గాలింపు చేపడుతున్నారు. ఇప్పటికి ప్రజల నుంచి తెలుసుకున్న సమాచారం మేరకు ఇటీవల నెలలోపే 15సార్లు హెలీకాప్టర్ అత్యాధునిక యంత్రంతో గాలింపుచేపట్టింది. మండలంలోని పలు గ్రామాల్లో హెలీకాప్టర్ చక్కర్లుకొట్టింది. ప్రతిరోజూ హెలీకాప్టర్ గాలింపుతో యురేనియం నిక్షేపాలపై రైతుల్లో ఆశక్తి పెరుగుతోంది. ఈ ప్రాంతంలోని భూమిలో యురేనియం నిక్షేపాలున్నట్లు హెలీకాప్టర్ ద్వారా సర్వే నిర్వహించే అధికారులకు కచ్ఛితమైన సమాచారం వుండడంతో యురేనియంపై ప్రభుత్వ అధికారులు స్పష్టమైన ప్రకటన విడుదలచేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సర్వే వలన భూమిలో యురేనియం నిక్షేపాలు ఖచ్చితంగా ఉంటే భూముల ధరలకు రెక్కలొస్తాయని రైతులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎకరాభూమి ధర రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు పలుకుతోంది. తొండలదినె్న తదితర ప్రాంతాల్లోని కెసి ఆయకట్టు పరిదిలో ఎకరా భూమి ధర రూ.13 లక్షల వరకు కూడా పలుకుతోంది. కొందరు ఆర్థికంగా ఇబ్బందులున్నవారు తమ భూములను అమ్మకాలకోసం పెట్టుకోగా హెలీకాప్టర్ సర్వేతో భూమి అమ్మకాలను నిలిపివేసుకుంటున్నారు. అదే యురేనియం నిక్షేపాలు భూమిలో బయటపడితే ఎకరా భూమి ధర లక్షలాదిరూపాయలు పలుకుతుందని కొందరు రైతులు పేర్కొంటున్నారు. ఎక్కువగా మండలంలోని అర్కటవేముల, సోమాపురం, రాజుపాళెం, తొండలదినె్న, కూలూరు, అయ్యవారుపల్లె తదితర గ్రామాల్లో హెలీకాప్టర్ రోజూ రెండుగంటలపాటు సర్వే నిర్వహిస్తోంది. ఎక్కువగా రేగడి పొలాల్లోనే హెలీకాప్టర్ సంచరిస్తుండడంతో భూమిలో నిక్షేపాలపై రైతులకు తీవ్ర ఆశక్తి నెలకొని వుంది.

పగిలిన ట్యాంకులు..
నీరు వృథా!

కడప, ఫిబ్రవరి 18: గండికోట ప్రాజెక్టునుంచి కొండాపురం మండలం పరిధిలో నీళ్ల ట్యాంకులు నిర్మించి అక్కడి నుంచి అనంతపురం జిల్లా యల్లనూరుకు సాగునీరు తరలించేందుకు ఏర్పాటుచేసిన ట్యాంకులు శనివారం పగిలి నీరంతా వృధా అయ్యింది. నాసిరక నిర్మాణాల కారణంగానే లక్షలాది రూపాయలు ప్రజాధనం దుర్వినియోగంతోపాటు భారీఎత్తున నీరు వృధా అయ్యిందని చెప్పవచ్చు. గాలేరు-నగరి సుజల స్రవంతిలో అంతర్భాగమైన గండికోట ప్రాజెక్టుకింద కొండాపురం మండల పరిధిలోని పాలూరుగ్రామంలో నిర్మించిన గండికోట లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్ జికెఎల్ ఐఎస్ -2 వద్ద నాలుగు వాటర్ ట్యాంకులు నిర్మించారు. ఆ నీటి ట్యాంకర్లను గత వారం రోజులుగా అధికారులు ఒక్కొక్కటి నింపుతూ వచ్చారు. అయితే తాజాగా వాటర్ ట్యాంకుల్లో అడుగుభాగాన ఒక్కసారిగా పెచ్చులు ఊడిపడిపోవడంతో నీరంతా కిందపడి వృధాగాపోయింది. ఈ నీరంతా కింద ఏర్పాటుచేసిన మోటార్లకింద ఉన్నకాలువలోకి నీరుచేరింది. నాణ్యతా లోపంవల్లే ఇలాంటి సంఘటన చోటుచేసుకుందని అక్కడి ప్రజలు విమర్శిస్తున్నారు. ట్యాంక్ సైతం శిథిలావస్థలో కూలిపోయే పరిస్థితిలో ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈలిఫ్టు ఇరిగేషన్ ద్వారా అనంతపురం జిల్లా యల్లనూరు, గడ్డంవారిపల్లి, గొడ్డుమర్రి, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు నీరు తరలించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీటి ప్రయత్నం నీరుగారిపోయిందని ప్రజలు విమర్శిస్తున్నారు. అలాగే గతంలోకూడా గండికోట ఎత్తిపోతల పథకం నుంజి జికెఎల్-1 నుంచి పైడిపాలెంకు నీటిని తీసుకుపోయే తరుణంలో పైపులైన్‌పగిలి నీటి తరలింపు దాదాపుగా 10రోజులు నిలిచిపోయిన సంఘటన పాఠకులకు తెలిసిందే. అలాగే 20రోజుల క్రితం ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించిన ఎత్తిపోతల పథకం పైపులు కూడా పగిలిపోయి భారీ ఎత్తున నీరు వృధా అయ్యింది. ఈ నేపధ్యంలో గండికోట ప్రాజెక్టుకింద చేపట్టిన జరిగిన పనుల్లో నాణ్యత ఎలా ఉందోనని ప్రజలు ఆరోపిస్తున్నారు. తాజాగా వాటర్ ట్యాంకులు నుంచి నీరు వృధా కావడంతో ఈ ప్రాజెక్టు పనులు నిర్మాణంలో ఏమాత్రం నాణ్యత ఉందో అద్దపడుతోంది. మరో రెండు ట్యాంకుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది వాటి నుంచి కూడా చిన్నగా నీరు వస్తోంది. దెబ్బతిన్న నీటి ట్యాంకర్లను యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి రైతులకు సాగునీరు అందేందుకు కృషిచేయాలని ఈప్రాంత రైతాంగం కోరుతోంది.