కడప

గండికోటకు ప్రపంచ ఖ్యాతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మలమడుగు, ఫిబ్రవరి 18: జిల్లాలోని చారిత్రక గండికోట దుర్గానికి ప్రపంచ ఖ్యాతి తెచ్చేందుకు కృషిచేస్తున్నట్లు కలెక్టర్ కె.వి.సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని గండికోటలో వారసత్వ ఉత్సవాలను శనివారం సాయంత్రం కలెక్టర్ ప్రారంభించారు. ఉత్సవాలల్లో భాగంగా శనివారం సాయంత్రం టూరిజం అతిథి గృహం నుండి సభాప్రాంగణం వరకు కళాకారులు నగారాలతో కార్నివాల్ నిర్వహించారు. ప్రధాన వేదికవద్దకుచేరి వేదికపై నుంచి నగారా, కొమ్ము బూర ఊది జ్యోతి ప్రజ్వలనతో అట్టహాసంగా ఉత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ గండికోటకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉందన్నారు. 1123లో కాకరాజు గండికోట దుర్గాన్ని శతృదుర్భేద్యంగా నిర్మించారన్నారు. వందల యేళ్లు గడుస్తున్నా దుర్గం, కట్టడాలు చెక్కుచెదరకుండా నిలిచివుండడం సామాన్య విషయం కాదన్నారు. ఎందరో కవులు, రచయితలు నడయాడిన ప్రాశస్త్యం మనకు ఉందన్నారు. ఇంతటి చరిత్ర వున్న జిల్లా ఘన కీర్తిగా గండికోట దుర్గం ప్రాశస్త్యాన్ని చాటేందుకు వారసత్వ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. యునెస్కో గుర్తింపు సాధిస్తే ప్రపంచ వ్యాప్తంగా గండికోట దుర్గానికి గుర్తింపు లభిస్తుందని, తద్వారా పర్యాటక అభివృద్ది సాధ్యమవుతుందనే దిశగా కృషి చేస్తున్నామని పునరుద్ఘాటించారు. అనంతరం గండికోటపై రాసిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆహూతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో జెసి టి.శే్వత, టూరిజం ఆర్డీ గోపాల్, ఆర్డీవో కె.వినాయకం, జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

క్యాంపు రాజకీయాలు!

* విజయవాడలో టిడిపి- బెంగళూరులో వైకాపా శిబిరాలు
* ఉత్కంఠ రేపుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు

కడప, ఫిబ్రవరి 18: జిల్లాలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా క్యాంపురాజకీయాలు జోరందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అధికారపార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు, కర్నాటకలోని బెంగుళూరులో వైసిపి స్థానిక ప్రజాప్రతినిధులు శిబిరాలకు చేరిపోయారు. ముఖ్యంగా ఎంపిటిసిలు, జడ్పీటిసిలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు 90శాతం పైబడి క్యాంపు శిబిరాలకు వెళ్లిపోయారు. అయితే సంబంధిత ప్రజాప్రతినిధుల్లో ఆడవారు ఇళ్లవద్ద, వారి భర్తలు, పిల్లలు క్యాంపు శిబిరాలకు చేరిపోయారు. స్థానిక సంస్థల ఎన్నిక ఉత్కంఠతతో జిల్లాలో ఠారెత్తిపోతోంది. అధికారపక్షం ఆకర్ష్ ద్వారా ఇప్పటికే వందలోపు స్థానిక ప్రజాప్రతినిధులను తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇరువర్గాలు తమ శిబిరాలకు తీసుకెళ్లేందుకు సంబంధిత ప్రజాప్రతినిధులపై వత్తిళ్లుతెస్తూ దాడులు, ప్రతిదాడులు, పోలీసుకేసులతోపాటు నయానో, భయానో తమ శిబిరాలకు తరలించుకుపోవడమే ధ్యేయంగా పెట్టుకుని చకచక పావులు కదుపుతున్నారు. ఇరుపార్టీల నేతలకు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో ఆ అవకాశాలు వినియోగించుకుంటూ నీళ్ల తరహాలో డబ్బులు వెచ్చిస్తూ డబ్బులు వెదజల్లుతూ కావాల్సిన కాంట్రాక్టు పనులు ఇస్తామని అధికార పార్టీనేతలు హామీఇస్తూ వస్తున్నారు. జిల్లాలో పట్ట్భద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకంటే ఈ ఎన్నికలే రోజుకొక మలుపుతిరుగుతూ ఎవరికున్న పరపతి వారు వినియోగించుకుని దొరికిన ప్రజాప్రతినిధులను దొరికినట్లుగానే తమ క్యాంపు శిబిరాలకు తరలించుకుపోతున్నారు. పలు పోలీసుస్టేషన్లలో ఇరుపార్టీల నేతలు ప్రజాప్రతినిధులు కన్పించకపోతే ఫిర్యాదులు చేసుకుంటూ వస్తున్నారు. పోలీసులు కూడా అధికారపార్టీ నేతలకే పలుకుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ ఎన్నికల నిబంధనలు తు.చ తప్పకుండా అమలుచేయాలని, తప్పుచేస్తే టివారినైనా వదిలే ప్రసక్తేలేదని పదే పదే హెచ్చరిస్తున్నా కొంతమంది రాజకీయ నాయకుల చెప్పుచేతుల్లోనే అధికారులు ఉంటున్నట్లు తెలుస్తోంది. రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రైల్వేకోడూరు, రాజంపేట ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులకు గిరాకీ బాగుందని కొంతమంది ఓటుహక్కు కలిగిన స్థానిక ప్రజాప్రతినిధులు ఇరుపార్టీలకు జైకొడుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రాజంపేట, కడప వైకాపా ఎంపిలు పివి మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డిలతోపాటు ఎమ్మెల్యేలు, వైకాపా అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి, టిడిపి తరపున సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రాష్ట్ర పరిశీలకులు దొరబాబు, జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుతు తదితరులు తమకున్న రాజకీయ యుక్తులు, కుయుక్తులు ఉపయోగించి ఇరువర్గాలకు చెందిన జిల్లా అగ్రనేతలు శిబిరాలకు తరలించేందుకు వ్యూహం, ప్రతివ్యూహం మధ్య స్పీడు పెంచారు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా మారింది.