కడప

ఎన్నికల అధికారులపై ఫిర్యాదులు.!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,్ఫబ్రవరి 21: ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని అధికార, ప్రతిపక్షనేతలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికనే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అధికార తెలుగుదేశంపార్టీ నేతలు ఎటు తిరిగి ఈ ఎన్నికను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి సర్వశక్తులు వడ్డుతున్నారు. వైసిపి నేతలు తమకు సంపూర్ణ మెజార్టీ ఉందని కలెక్టర్, అధికార యంత్రాంగంపైనే అనుమానాలతో ఎన్నికల కమిషన్‌కు, న్యాయస్థానాలకు ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు జిల్లా ఎస్పీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుండటంతో అధికార పార్టీ నేతలను పక్కనబెడుతున్న తరుణంలో ఆయన చర్యలకు అడ్డుకట్టవేయాలని అధికార పార్టీనేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఎంపిటిసిలు, జడ్పీటీసీలు, మేయర్, నగర పాలక కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్ల బలం వైకాపాకే అధికంగా ఉండటంతో అధికారపార్టీనేతలు వైకాపా ప్రజాప్రతినిధులను ఆకర్ష్ పథకం కింద 50మందిని తమవైపు తిప్పుకున్నట్లు తెలిసింది. ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు టిడిపిలో చేరడం, అలాగే గత కొంతకాలం క్రితం జమ్మలమడుగు, బద్వేలు వైకాపా ఎమ్మెల్యేలు సి.ఆదినారాయణరెడ్డి, టి.జయరాములు టిడిపిలో చేరికతో స్థానిక ప్రజాప్రతినిధులను తమవైపు తిప్పుకున్నారు. అయితే ప్రతిపక్ష వైసిపి అధిష్ఠానం తమ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డికి వైసిపిలోని స్థానిక ప్రజాప్రతినిధులంతా ఓటు వేయాలని లేని పక్షంలో విప్ జారీ చేసేందుకు సిద్దవౌతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నారు. ఉన్న వారిని కాపాడుకునేందుకు బెంగళూరుకు తరలిస్తున్నారు. కొంతమంది అధకార పార్టీ నేతలు వైసిపి శిబిరంలోని ప్రజాప్రతినిధులను తీసుకువచ్చేందుకు సర్వశక్తులు వడుతున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సొంత జిల్లాలో తన బాబాయ్ ఎమ్మెల్సీగా పోటీ చేయడంతో వైఎస్ కుటుంబం, పార్టీ భవిష్యత్‌కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వైకాపా దూకుడుగు కళ్లెం వేసేందుకు అధికారపార్టీ తమదైన శైలిలో సర్వశక్తులు వడ్డుతూ స్థానిక సంస్థల ఎన్నికల గెలుపే ధ్యేయంగా పెట్టుకుని బెటెట్ రవిని బరిలో దించి అధిష్ఠానం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యూహాత్మకంగా అడులు వేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నికల్లో విజేత ఎవరనేది కాలమే నిర్ణయించాల్సివుంది.

బాలుపల్లె అటవీ ప్రాంతంలో
గాలిలోకి కాల్పులు

రైల్వేకోడూరు, ఫిబ్రవరి 21:కడపజిల్లా రైల్వేకోడూరు మండలం బాలుపల్లె అటవీ ప్రాంతంలో మరోమారు స్మగ్లర్ల తిరుగుబాటుతో గాలిలోకి కాల్పులు జరిపామని అటవీ అధికారి రెడ్డిప్రసాద్ మంగళవారం తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలిలావున్నాయి. ఎర్రచందనం కూలీలు, స్మగ్లర్లు తమిళనాడు నుంచి శేషాచలం అటవీ ప్రాంతంలోకి చొరబడ్డారనే సమాచారంతో గడిచిన మూడు రోజులుగా తమ సిబ్బంది సహకారంతో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో ఉన్నఫళంగా 15 మంది ఎర్రచందనం కూలీలు ఎదురు పడ్డారని, కాని తాము కేవలం ఐదుమంది మాత్రమే ఉన్నందున ఎర్ర కూలీలు ఎదురు దాడికి దిగడంతో ఒక్కసారి కాల్పులు జరిపినట్లు ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో కూంబింగ్ నిర్వహిస్తూ మంగళవారం తెల్లవారు జామున బాలుపల్లె సమీపంలోని జ్యోతినగర్ కాలనీ వద్దకు చేరుకోగానే అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న 83 దుంగలను పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. వీటి విలువ మార్కెట్‌లో సుమారు రూ. రెండు కోట్లు ఉంటుందన్నారు. ఎర్రచందనం దుంగలతో పాటు చిత్తూరుజిల్లా రేణిగుంటకు చెందిన శ్రీనివాసులు, కడపజిల్లా కోడూరు మండలం బయనపల్లెకు చెందిన మునెయ్య, తమిళనాడుకు చెందిన శరవణ్‌ను అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సంఘటనా స్థలంలో ఒక ఐషర్ లారీ పట్టుబడిందన్నారు. కాగా కోడూరు దళితవాడకు చెందిన రాజేంద్ర అనే స్మగ్లర్ సంఘటనా స్థలం నుండి పారి పోయినట్లు రెడ్డిప్రసాద్ పేర్కొన్నారు. నాలుగు రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక సారి గాలిలోకి కాల్పులు జరపగా శేషాచలం నుండి 15 మంది ఎర్ర కూలీలు పారి పోయారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. డిఆర్వో ఎసి పిచ్చయ్య, ఎఫ్‌బిఓలు సుబ్బయ్య, సంజన్న, బాలుపల్లె సెక్షన్ స్ట్రైకింగ్ ఫోర్స్‌తో కలసి ఎర్రచందనం దుంగలు పట్టుకున్నామని ఆయన తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు కృషి

రాజంపేట, ఫిబ్రవరి 21:నవ్యాంధ్రను సస్యశ్యామలం చేసే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన సాగుతున్నదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాజంపేటలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గత 6, 7 సంవత్సరాల నుండి 10 ఏళ్లుగా నిలిచిపోయిన అనేక సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా చంద్రబాబునాయుడు ప్రత్యేక ప్రణాళికతో కృషి చేస్తున్నారని, స్వయంగా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు పర్యవేక్షిస్తున్నారన్నారు. 20 సంవత్సరాల కల అయిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 7 గ్రామాలు నవ్యాంధ్రలో కలిపేలా ఆర్డినెన్స్‌ను ప్రమాణ స్వీకారానికి ముందే తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. అందువల్లే ఇప్పుడు 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో చంద్రబాబునాయుడు ఉన్నారన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడం వల్ల ధవలేశ్వరం నుండి వృధాగా సముద్రంలో కలిసిపోతున్న 3000 టిఎంసిల నీటిని రైతుల దరికి చేర్చేందుకు వీలవుతుందన్నారు. ఇందువల్ల క్రిష్ణపట్నం మొదలు రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతాంగం ప్రయోజనాలు మెరుగుకానున్నాయన్నారు. ఆరేడు సంవత్సరాలుగా నిలిచిపోయిన గాలేరు-నగరి ప్రాజెక్టు పనులను కూడా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకెళుతున్నదన్నారు. అలాగే నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ పనులు కూడా 3 నుండి ఎడెనిమిది నెలల్లో పూర్తి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. రైతుల ప్రయోజనాలు కాపాడడానికి ముఖ్యమంత్రి దూరపు ఆలోచనతో ఇరిగేషన్ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారని, నిరంతర పర్యవేక్షణ వల్లే ఇది సాధ్యమవుతున్నదన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తయ్యే దిశగా పనులు సాగుతుండడం చూసి ఓర్వలేక వైకాపా కువిమర్శలకు దిగుతున్నదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తి అంశం వైకాపా నేతలకు మింగుడు పడడం లేదన్నారు. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం తధ్యమన్నారు. వైకాపాపై విశ్వసనీయత ఆ పార్టీ కార్యకర్తల్లో కూడా రోజురోజుకు సన్నగిల్లుతున్నట్టు సోమిరెడ్డి పేర్కొన్నారు.

విప్ మేడాతో బీటెక్ రవి భేటీ
రాజంపేట, ఫిబ్రవరి 21:రాజంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం కడపజిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి బీటెక్ రవి తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డితో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు సి.ఎం.రమేష్‌లు ఇందులో పాల్గొన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి తీసుకోవాల్సిన చర్యలపై వీరిమధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. వీరితో పాటు రాజంపేట మార్కెటింగ్ కమిటీ ఛైర్మెన్ యెద్దల విజయసాగర్ తదితరులు పాల్గొన్నారు.
గండికోటలో మురగదాసు సినిమా షూటింగ్
జమ్మలమడుగు, ఫిబ్రవరి 21: చారిత్రాత్మక గండికోటలో ప్రముఖ సినీ దర్శకుడు మురగదాసు సినిమా షూటింగ్‌ను మంగళవారం ప్రారంభించారు. ప్రముఖ స్టార్ హీరో మహేష్‌బాబు కథానాయకుడిగా మురగదాసు దర్శకత్వంలో రూపొందుతున్న సినీ చిత్రీకరణను పలుచోట్ల తీశారు. మురగదాసుకు అచ్చివచ్చిన జమ్మలమడుగు ప్రాంతంలో సినిమా షూటింగ్ చేయడానికి ప్రణాళిక వేసుకున్నారు. ఈ క్రమంలో జమ్మలమడుగు ప్రాంతంలోని చారిత్రాత్మక గండికోట దుర్గంలో మంగళవారం నుండి మూడు రోజుల పాటు సినిమా చిత్రీకరించేందుకు యూనిట్‌తో గండికోటలో దిగారు. సినిమా బ్యాక్‌డ్రాప్ సన్నివేశాలను చిన్నారులతో చిత్రీకరణ చేస్తున్నారు. షూటింగ్‌లో భాగంగా మంగళవారం గండికోట దుర్గంలో పావురాల మహల్ వద్దతో పాటు కారాగారం ప్రాంతాల్లో సన్నివేశాలను చిత్రీకరణ చేశారు. చివరి రోజు 24వ తేదీన కథానాయకుడు మహేష్‌బాబు షూటింగ్‌కు వచ్చే అవకాశాలు వున్నట్లు తెలుస్తోంది.

23 నుంచి పొలతలలో
మహాశివరాత్రి ఉత్సవాలు

పెండ్లిమర్రి,్ఫబ్రవరి 21: శేషాచల అటవీప్రాంతంలో వెలసివున్న శ్రీ పొలతల మల్లికార్జునస్వామి ఆలయంలో ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు మహశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీమల్లేశ్వరస్వామి, పార్వతీదేవిల కల్యాణం ఈనెల 24న మహాశివరాత్రి పర్వదినం రోజు ఉదయం 9.30గంటలకు ఆలయ ప్రాంగణంలో నిర్వహించబడునని ఆలయ ఇఓ కృష్ణానాయక్ తెలిపారు. ఈ కల్యాణాన్ని భక్తులు విరివిగా పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. ఉదయం మహాన్యాపూర్వక రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తారన్నారు. అలాగే రాత్రి 9గంటలకు చెక్క్భజన, హరికథ కార్యక్రమాలు ఉంటాయని, 10గంటలకు స్వామివారిని ఆలయం నుంచి అక్కదేవతల ఆలయం వరకు గ్రామోత్సవం జరుగుతుందని, కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని ఆలయ ఇఓ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో వెలసివున్న అక్కదేవతలు అడుగుతానే అభయమిచ్చే అక్కదేవతలని వీరిని దర్శించుకుంటే మోక్షాన్ని పొందవచ్చునన్నారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశామని తెలిపారు.

వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు
విజయవంతం చేయండి

రాయచోటి, ఫిబ్రవరి 21: నేటి నుండి నిర్వహించనున్న భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఆలయ కార్యనిర్వహణాధికారిణి మంజుల కోరారు. మంగళవారం స్థానిక వీరభద్రస్వామి వారి దేవస్థానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కంటే ఈ యేడాది అత్యంత పకడ్బంధీగా ఉత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్క శాఖాధికారితో సమావేశాలు నిర్వహించి తమకు సహాయ సహకారాలు అందజేయాలని కోరినట్లు తెలిపారు. దానికితోడు స్థానిక భక్తులే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల నుండి వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసేందుకు ప్రత్యేక బారికేడ్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కొరకు బస చేసేందుకు తగు ఏర్పాట్లు చేశామన్నారు. నేటి ఉదయం 5 గంటలకు యాగశాల ప్రవేశంతో జాతర ప్రారంభమవుతుందని ఆమె వివరించారు. భక్తాదులెల్లరూ ఉత్సవాలలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు.

టిడిపిలోకి మరో వైసిపి ఎంపిటిసి జంప్!
కమలాపురం, ఫిబ్రవరి 21: తెలుగుదేశం పార్టీలోకి మరో వైసిపి ఎంపిటిసి జంప్ కావడం జరిగింది. వైసిపికి చెందిన పట్టణంలోని మహిళా మైనార్టీ ఎంపిటిసి ఆ పార్టీని వీడి తెలుగుదేశం శిబిరంలోకి వెళ్లినట్లు తెలుగుదేశం పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మండలంలోని వైసిపికి చెందిన జడ్పీటిసి, ఎంపిటిసి ఆదివారం గోడదూకగా, మంగళవారం అదే పార్టీకి చెందిన మహిళా ఎంపిటిసి ఫిరాయించడం చోటు చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తెలుగుదేశం మండలాన్ని కైవశం చేసుకుంది. ఇటీవల పందిళ్లపల్లె వైసిపి ఎంపిటిసి మాజీ ఎమ్మెల్సీ పుత్తా సమక్షంలో దేశం పక్షాన చేరింది. మిగిలిన 6గురిలో పెద్దచెప్పల్లి ఎంపిటిసి బాబయ్య, గతవారం దేశం శిబిరంలో చేరిపోయాడు. మరో ఇద్దరు. ఆది,మంగళవారాల్లో దేశం శిబిరంలో చేరడంతో వైసిపికి ముగ్గురే మిగిలిపోయారు. వారిలో ఇరువురు బెంగళూరు వైసిపి శిబిరంలో ఉన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపిదే విజయం
కమలాపురం, ఫిబ్రవరి 21: మండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే జి వీరశివారెడ్డి ధీమా వ్యక్తంచేసారు. ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి విజయ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నరు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్భ్రావృద్దికి చేస్తున్న కృషిని గుర్తించి పెద్ద సంఖ్యలో వైసిపి చెందిన పలువురు ఎంపిటిసిలు మునిసిపల్ కౌన్సిలర్లు దేశం పక్షాన చేరారన్నారు. అంతేకాక విపక్షాలు శిబిరాలకు తరలించగా తాము అక్కడ ఉండలేమని చెప్పి చాలామంది స్థానిక ప్రాంతాలకు వచ్చి తెలుగు దేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారన్నారు. టిడిపి అవినీతి ప్రలోభాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. గౌరవమైన మెజార్టీతో తమ పార్టీ అభ్యర్థి బిటెక్ రవి విజయం సాధిస్తారన్నారు. తమిళనాడులో అవినీతి కేసులో శశికళకు జైలుశిక్ష పడ్డంతో వైసిపి ఎమ్మెల్యేలకు గుబులు కలిగి భయాందోళనలకు గురి అవుతున్నారని విమర్శించారు.

కష్టపడి పనిచేసే వారికే ప్రాధాన్యత

రాజంపేట, ఫిబ్రవరి 21:తెలుగుదేశం పార్టీ పటిష్టతకు కష్టపడి పనిచేసేవారికే గ్రామ కమిటీలలో ప్రాధాన్యత కల్పిస్తూ రాష్ట్ర పార్టీకి ప్రతిపాదనలు పంపాలని విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ 5వేలకు పైగా జనాభా కలిగిన గ్రామాల్లో గ్రామ కమిటీకి అధ్యక్షునితో పాటు ఇద్దరు ఉపాధ్యక్షులను గుర్తించి వారి పేర్లను ప్రోపార్మా-1లో నమోదు చేయాలన్నారు. మున్సిపాలిటీలో వార్డు కమిటీలకు అధ్యక్షునితో పాటు ఒక ఉపాధ్యక్షులు, ఒక ప్రధాన కార్యదర్శి, ఒక కార్యనిర్వాహక కార్యదర్శి, ఇద్దరు కార్యదర్శులు, ఒక కోశాధికారి, 10 మంది కార్యవర్గ సభ్యులతో మొత్తం 17 మంది సభ్యులుంటారన్నారు. వారి వివరాలను ప్రోపార్మా-4లో నమోదు చేయాలన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో 5గురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీరు గ్రామ కమిటీలను గుర్తించడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామ కమిటీలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అధ్యక్ష, కార్యదర్శి ఒకే సామాజిక వర్గానికి చెందినవారు ఉండకూడదని, కమిటీలో మంచి నాయకత్వం వచ్చేలా సమగ్రమైన వ్యక్తులు ఎన్నుకునేందుకు మండల నాయకులు కృషి చేయాలన్నారు. గ్రామ స్థాయిలో కమిటీలు బలంగా ఉంటే పార్టీ అభివృద్ధికి దోహదపడతాయన్నారు. ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా ఈ గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకులు విజయమోహన్‌రెడ్డి, టిడిపి పట్టణ అధ్యక్షులు టి.సంజీవరావు, రూరల్ అధ్యక్షులు ఎస్.బాపణయ్యనాయుడు, మాజీ కడప ఆర్టీసీ రీజనల్ ఛైర్మెన్ యెద్దల సుబ్బరాయుడు, పార్టీ నాయకులు బాసినేని వెంకటేశ్వర్లు, చొప్పా వెంకటరెడ్డి, మందపల్లె శ్రీనివాసులు, నందలూరు మండల పార్టీ అధ్యక్షులు బి.లక్ష్మీనరసయ్య, ఒంటిమిట్ట పార్టీ అధ్యక్షులు కొమరా వెంకటనరసయ్య, పార్టీ నేతలు శివారెడ్డి, కట్టా నారాయణయ్య, గజ్జల శ్రీనివాసులురెడ్డి, వీరబల్లె పార్టీ అధ్యక్షులు రామక్రిష్ణయ్య, సుండుపల్లె మండల పార్టీ అధ్యక్షులు రాజకుమార్‌రాజు, ఊటుకూరు సర్పంచ్ లక్ష్మీనరసయ్య, గడ్డం జనార్దన్‌రెడ్డి, మైనార్టీ నాయకులు షేక్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.
మేడాకు సత్కారం
ఇటీవల కడప నగరంలో జరిగిన 7వ జాతీయ ఇండోర్ ఫీల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్ 2017 పోటీలు విజయవంతంగా నిర్వహించినందుకు సహకరించిన జిల్లా ఇండోర్ ఫీల్డ్ ఆర్చరీ గౌరవాధ్యక్షులు, విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డిని మంగళవారం ఆ ఆసోసియేషన్ నిర్వాహకులు స్థానిక పార్టీ కార్యాలయంలో దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. కాగా ఈ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వాహకులు, ఆల్ ఇండియా ఫీల్డ్ ఆర్చరీ ఉపాధ్యక్షులు సంతోష్, కార్యదర్శి సుభాష్‌చంద్రనాయర్‌లను ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి ఈ సందర్భంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్చరీ సంఘ నాయకులు చంద్రకుమార్‌రాజు, మందపల్లె శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు