కడప

సూర్యప్రభ వాహనంపై ఊరేగిన వీరభద్రుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, ఫిబ్రవరి 28: స్థానిక భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేదపండితులచే ప్రమధ గణహోమము, టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారిచే చెక్క్భజనలు అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు ఆలయ ఈవో మంజుల తెలిపారు. ఈ కార్యక్రమాలను తిలకించేందుకు స్థానిక భక్తులతో పాటు కన్నడ భక్తులతో ఆలయం పోటెత్తింది. సూర్యప్రభ వాహనంలో స్వామి, అమ్మవార్లను పట్టణంలోని మార్కెట్, గాంధీబజార్, కంసలవీధి, బ్రాహ్మణవీధుల గుండా ఊరేగారు. భక్తాదులకు తీర్థప్రసాదాలను ఆలయ అర్చకులు అందజేశారు.

ఎన్నికల హామీలు తుంగలో తొక్కిన
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు

కడప,్ఫబ్రవరి 28: గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తుంగలో తొక్కాయని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, టిటిడి మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు విమర్శించారు. మంగళవారం స్థానిక కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో జరిగిన జన ఆవేదన సదస్సుకు శాసన మండలిలో ప్రతిపక్షనేత సి.రామచంద్రయ్య, హాజరైన బాపిరాజు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు గత ఎన్నికల్లో 400కు పైగా ప్రజలకు హామీలు ఇచ్చారని అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయకుండా తుంగలో తొక్కి ప్రజావ్యతిరేక పాలన అందిస్తున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికలకు ముందు 64 లక్షలకోట్లరూపాయల నల్లధనాన్ని వెలికితీస్తానని ఇంతవరకు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటన్నారు. వెలికితీసిన నల్లధనాన్ని ప్రజల అకౌంట్లలో వేస్తానని మాయమాటలు చెప్పి సామాన్య ప్రజలకు మేలు చేస్తానని పెద్దనోట్ల రద్దుతో ప్రజలకు ఇబ్బందులు కల్గించారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా అవసరమని చెప్పిన ఆనాటి పెద్దలు నేడు హోదా విషయంపై మాట్లాడకపోవడం దారుణమన్నారు. ప్రత్యేక ప్యాకేజితోనే అభివృద్ధి సాధ్యవౌతుందన్న బిజెపి, టిడిపిలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్దిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రత్యేకహోదా వస్తే రాష్ట్భ్రావృద్ధితోపాటు పరిశ్రమలు వచ్చి నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. మండలి ప్రతిపక్షనేత రామచంద్రయ్య మాట్లాడుతూ చంద్రబాబు పాలన అవినీతి పాలనగా తయారైందని ప్రజాస్వామ్యాన్ని మంట కలుపుతూ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఈ సదస్సులో కడప జిల్లా ఇన్‌చార్జి చెంగల్‌బాబు, డిసిసి అధ్యక్షుడు నజీర్ అహ్మద్, నగర అధ్యక్షుడు బండి జక్కరయ్య, కాంగ్రెస్‌పార్టీ నాయకులు సత్తార్, శ్రీనివాసులు, శ్రీనివాసులు పాల్గొన్నారు.

ముగ్గురు తమిళ కూలీల అరెస్టు
* ఎర్రచందనం దుంగలు స్వాధీనం
సిద్దవటం,్ఫబ్రవరి 28: మండల పరిధిలోని సిద్దవటం బీట్ చెంచులక్ష్మి ప్రదేశంలో మంగళవారం ముగ్గురు తమిళకూలీలను అరెస్టుచేసి ఐదు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు రేంజర్ దినేష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సిద్దవటం బీట్‌లో తమిళకూలీలు చొరబడ్డారన్న సమాచారం తెలియడంతో సిబ్బందితో కలిసి హుటాహుటిన వెళ్లామన్నారు. ఈమేరకు బీట్‌లోని చెంచులక్ష్మిప్రదేశం 20 మంది తమిళకూలీలు తారసపడ్డారన్నారు. వారిపై దాడులు నిర్వహించి ముగ్గురిని పట్టుకోగా 17 మంది పరారయ్యారన్నారు. పట్టుబడ్డవారిలో ఏలూరు జిల్లాకు చెందిన వళైతిరుపత్తూరు గోవిందకృష్ణమూర్తి, రామహనుమాన్, ధర్మాపురం జిల్లా కైలాపూర్‌కు చెందిన శంకర్‌లు ఉన్నారు. స్వాధీనం చేసుకున్న దుంగలు 126 కేజిలు ఉండగా దాదాపు రూ.40వేలు విలువ చేస్తుందని, దాడిలో అధికారి ఏలిషాతోపాటు అటవీశాఖ సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.