కడప

దౌర్జన్యాలు చేయడం వైఎస్ కుటుంబానికే చెల్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,్ఫబ్రవరి 28: డబ్బు, అధికార దాహంతో దౌర్జన్యాలు చేయడం వైఎస్ కుటుంబానికే చెల్లిందని రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్‌నాయుడు విమర్శించారు. మంగళవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో పలువురు నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. శాసన మండలికి జరుగుతున్న ఎన్నికల్లో తమపార్టీ అభ్యర్థి బిటెక్వ్రి వంద ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి ఎమ్మెల్యేలు, జడ్పీటిసిలు, ఎంపిటిసిలు స్వచ్చంధంగా చేరుతున్నారని, తమపార్టీ ఎవరికీ ఎలాంటి ప్రలోభాలకు పాల్పడటం లేదన్నారు. తమపార్టీకి ఉన్న ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేకనే నిందారోపణలు చేయడం వైసిపికి తగదన్నారు. ఆనాడు వైఎస్ వివేకానందరెడ్డి ప్రతిపక్షనేత వైఎస్ జగన్ తల్లి విజయమ్మపై ఎన్నికల్లో పోటీ చేసినందున ఈరోజు ఆయన్ను ఎమ్మెల్సీగా పోటీ చేయించి ఓటమిపాలయ్యేలా చేసేందుకు జగన్ సిద్దమయ్యారని ఆరోపించారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డిలు మాట్లాడుతూ వైసిపి నాయకులు పనిచేస్తున్న అధికారులను సరిగా పనిచేయడం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రం లో నీతివంతమైన పాలన జరుగుతోందన్నారు. ప్రొద్దుటూరు, కడపకు శాశ్వత నీటి పరిష్కారం కోసం చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రొద్దుటూరు తాగునీటి సమస్య తీర్చేందుకు ఈనెల 3న మైలవరం డ్యామ్ నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు. బద్వేలు, రాయచోటిలో నీటి సమస్య పరిష్కారానికి ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని సమన్వయ కమిటీలో మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలో ప్రణాళిక సిద్ధం చేసి తాగునీటి సమస్య లేకుండా చేస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు బలం ఉందని అధికసంఖ్యలో ఓట్లు ఉన్నాయని చెప్పుకుంటున్నారని, ఎవరికి మద్దతు ఉందో బహిరంగ ఓటుకు సిద్దమేనా అని వారు సవాల్ విసిరారు. జగన్మోహన్‌రెడ్డి అవగాహన రాహిత్యం వల్లే వైఎస్సార్ పార్టీ నుంచి ఇతర పార్టీలకు వలస వెళ్తున్నారన్నారు. వైసిపికి దాడులు చేయడం పరిపాటని ఆ పార్టీని ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి బిటెక్ రవి అత్యధిక మెజార్టీతో గెలవడం తధ్యమని వారు స్పష్టం చేశారు. అనంతరం సిఎం రిలీఫ్ ఫండ్‌కింద మంజూరైన చెక్కులు బాధితులకు అందజేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి బిటెక్ రవి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, పలువురు టిడిపి జిల్లా కార్యదర్శి హరిప్రసాద్, రాజశేఖరరెడ్డి, జిలానీ తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలల అభివృద్ధికి కృషి

పెండ్లిమర్రి,్ఫబ్రవరి 28: మండలంలోని 19గ్రామపంచాయతీల్లోని పాఠశాలల అభివృద్ధికి ఆయా పాఠశాలల కమిటీ చైర్మన్లు, సభ్యులు అభివృద్ధికి పాటుపడాలని మండల విద్యాధికారి సుజాత పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మార్సీ కార్యాలయంలో స్కూల్ కమిటీ చైర్మన్లకు, సభ్యులకు సమావేశం ఏర్పాటుచేసి ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి స్కూల్ అభివృద్ధికోసం తక్కువశాతం నిధులు మంజూరు అవుతున్నాయని దీనివల్ల స్కూళ్ల అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. గ్రామంలోని దాతల సహాయంతో, ఎన్‌ఆర్‌ఐల సహాయంతో అభివృద్ధికోసం పాటుపడాలని తెలియజేస్తూ వేసవి కాలం రావడంతో స్కూళ్లల్లో నీటి సమస్యలేకుండా సంబంధిత సర్పంచ్‌లతో మాట్లాడి నీటి సమస్య పరిష్కరించేందుకు పాటుపడాలని అలాగే రాబోయే సంవత్సరం స్కూళ్లల్లో పిల్లలను చేర్పించేందుకు ఇప్పటినుంచే తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రభుత్వం నుంచి పిల్లలకు వచ్చే ఉచిత పాఠ్యపుస్తకాలతోపాటు మద్యాహ్నభోజనం, యూనిఫాం తదితర వాటిపై వివరించాలని ఆమె సూచించారు. అలాగే టెన్త్ ఫలితాల్లో గత రెండు సంవత్సరాలు జిల్లాలో ప్రథమ స్థానంలో పెండ్లిమర్రి మండలం నిలిచిందని, ఈ ఏడాది కూడా జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సంపాదించేందుకు ఉపాధ్యాయులు ఎంతో కష్టపడుతున్నారన్నారు. వారికి సహాయ సహకారాలు అందించాలని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్కూల్ కమిటీ చైర్మన్లతోపాటు సర్పంచ్‌లు పాల్గొన్నారు.