కడప

10 నామినేషన్లు దాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,్ఫబ్రవరి 28: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ఘట్టం మంగళవారంతో ముగిసింది. ప్రధాన రాజకీయపార్టీలకు చెందిన టిడిపి, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులతోపాటు ఒక మంగళవారమే పలువురు నామినేషన్లు దాఖలయ్యాయి. ఈమేరకు మొత్తం 10 నామినేషన్లు అయ్యాయి. టిడిపి తరపున బిటెక్ రవీంద్రారెడ్డి, వైకాపా తరపున వైఎస్ వివేకానందరెడ్డి, స్వతంత్ర అభ్యర్థులు రవీంద్రారెడ్డి, కె.వివేకానందరెడ్డి, ఎన్. రవిశంకర్‌రెడ్డి, ఆర్. రవీంద్రారెడ్డి, ఎం. జ్యోగిరెడ్డి, సి.రవీంద్రారెడ్డితోపాటు వివిధ పార్టీల నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు.
జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి.!

కడప,్ఫబ్రవరి 28: జిల్లాలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. జిల్లాలోని వైసిపి, తెలుగుదేశం పార్టీ అగ్రనేతల మధ్య రాజకీయ వేడి రగులుకొని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై తీవ్ర ప్రభావం చూపుతొంది. ఫలితంగా ఓట్లకోసం దాడులు, ప్రతిదాడులు, హెచ్చరికల మధ్య జిల్లా అట్టుడికి పోతోంది. ఇరుపార్టీల నేతలు సంఖ్యాబలాన్ని పెంచుకోవడానికి అధికారపార్టీ, ప్రతిపక్ష నేతల మధ్య బాహాబాహీగా ఘర్షణలు తారాస్థాయికి చేరాయి. పోలీసు యంత్రాంగానికి నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లు, కిడ్నాప్‌లు సవాల్‌గా నిలిచాయి. రాష్టవ్య్రాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్టవ్య్రాప్తంగా ఉన్న 13 జిల్లాల్లో వైకాపా 12 జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలో దించలేదు. కేవలం వైసిపి అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లా అయిన కడపలో మాత్రమే తన బాబాయ్, రాష్టమ్రాజీ మంత్రి వివేకాను బరిలో దించారు. అయితే వైసిపికి జిల్లాలో పురపాలక సంఘం, జడ్పీటిసిలు, ఎంపిటిసిలు, నగర పాలక సంస్థల్లో ఓటర్లు అధికంగా ఉన్నా అధికారపార్టీ వైపే అధికంగా స్థానిక ప్రజాప్రతినిధులు మొగ్గుచూపుతున్నారు. రాయచోటి, జమ్మలమడుగు, కడప అసెంబ్లీ సెగ్మెంట్లలో స్థానిక ప్రజాప్రతినిధులు ఇరుపార్టీల నేతలు పార్టీ ఫిరాయింపులతో ఆ ఓటర్లే కీలకంగా మారారు. చాలా మంది ప్రజాప్రతినిధులు ఓటుకు రేటు పెట్టుకుని పార్టీ ఫిరాయింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార టిడిపికి ఓటర్లు తక్కువగా ఉన్నా తమకు ఓటర్లు అధికంగా ఉన్నారని అంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 840 మంది ఓటర్లు ఉండగా, అధికారపార్టీ నేతలు తమకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓటర్లు 450 మంది సభ్యులు ఉన్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పక్ష వైసిపి నేతలు మాత్రం టిడిపికి 350 మంది కూడా లేరని కేవలం వైకాపా ప్రజాప్రతినిధులను భయబ్రాంతులు చేసి తమవైపు వారిని తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వైకాపా నేతలు బాహాటంకంగా టిడిపి నేతలపై ఆరోపిస్తున్నారు. జిల్లాలో అధికారపార్టీలో పలు నియోజకవర్గాల్లో లుకలుకలున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికలోనే ఏకపక్షంగా నిర్ణయించారని ఒకవర్గం చెప్పుకుంటోంది. ప్రతి నియోజకవర్గంలో టిడిపిలో ఆదిపత్యపోరు తారాస్థాయికి చేరుకుంది. కేవలం తమ రాజకీయ ఉనికి కాపాడుకునేందుకే అధికారపార్టీ నేతలు పైకి నటిస్తూ లోలోపు స్థానిక సంస్థల విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఈవిషయంలో కాలమే నిర్ణయించాల్సివుంది. ఇదిలా వుండగా వైకాపా నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇప్పటికే ఆపార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధుల్లో 90శాతం మందిని బెంగుళూరులోని తమ శిబిరంలో భద్రపరిచినట్లు తెలుస్తోంది. మొత్తం మీద స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోరు జిల్లాలో రసవత్తరంగా మారింది.

నేటి నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు

కడప,్ఫబ్రవరి 28: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షలు రాసేందుకు జిల్లా వ్యాప్తంగా 46596 మంది సిద్దపడుతున్నారు. వీరిలో మొదటి సంవత్సరం 23658 మంది, రెండవ సంవత్సరం 22938 హాజరుకానున్నారు. జిల్లా వ్యాప్తంగా 92 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల్లో ఎటువంటి అక్రమాలకు పాల్పడినా నాలుగు సంవత్సరాలు పాటు పరీక్షలు రాసేందుకు అర్హత కోల్పోతారని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి పి.ఉదయలక్ష్మి ప్రకటించారు. గతంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లను జిల్లా స్థాయిలోని ఆర్‌ఐఓ కార్యాలయంలో నియామకం చేసేవారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ బోర్డు ప్రధానకార్యదర్శి నియామకం చేయనున్నారు. అలాగే ఇన్విజిలేటర్లుగా ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిని నియామకం చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు ఆర్‌ఐఓకు ఆదేశించింది. అయితే ఫీజుల పెండింగ్ పేరుతో, అధిక ఫీజులు వసూళ్లు చేసుకునేందుకు, పరీక్షల్లో అధికమార్కులు వేయిస్తామని ప్రైవేట్ విద్యాసంస్థలు, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే ప్రత్యేకించి సైన్స్ విద్యార్థుల నుంచి రూ.2వేలు నుంచి రూ.5వేల వరకు వసూలు చేసుకుని హాల్‌టికెట్లు జారీ చేస్తున్నారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్ కెవి సత్యనారాయణకు ఇంటర్మీడియట్ బోర్డు ఆర్‌ఐఓ రవి ఫిర్యాదుచేసినట్లు తెలుస్తోంది. ఇంటర్మీడియట్ ద్వారా ఎంబిబిఎస్ రాసే విద్యార్థులకు నీట్ ద్వారా ప్రవేశం పొందాలని ఇప్పటికే ఆదేశాలు వచ్చినా ఒకవేళ మార్కులు ఆధారంగానైనా ప్రైవేట్ మెడికల్ కాలేజిల్లో సీటు సంపాదిచుకోవాలన్నా నీట్ పుణ్యమా అని ప్రైవేట్ కళాశాలల్లో ఎంబిబిఎస్ సీటు దక్కించుకునే అర్హత కోల్పోయారు. ఒక వేళ మార్కులు ఆధారంగా మేనేజ్‌మెంట్ కోటా కింద ఎంబిబిఎస్ సీటు ఇవ్వాలని కేంద్రప్రభుత్వం ఆదేశిస్తే ఏపి విద్యార్థులు లబ్దిపొందవచ్చునని జిల్లావాసులు భావిస్తున్నారు. గత కొనే్నళ్లుగా వివిధ రాష్ట్రాల్లో, స్వరాష్ట్రంలో మేనేజ్‌మెంట్ కోటా కింద జిల్లాలో పలువురు ఎంబిబిఎస్ చదివే విద్యార్థులు కోర్సుల్లో ప్రవేశించేవారు. చాలా మంది తల్లిదండ్రులు, రాజకీయ నాయకులు మేనేజ్‌మెంట్ కోటాకింద ఎంబిబిఎస్ సీటు దక్కించుకునేందుకు ప్రవేశపరీక్షకు అర్హత లేదని నీట్ ద్వారానే ఎంబిబిఎస్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. బుధవారం నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలు డిఎస్సీ కమిటి, ఆర్‌జెడి, డిఇఇఓ, ఆర్‌ఐఓ, సిట్టింగ్, ఫ్లైయింగ్ స్వ్కాడ్‌లు జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్నారు.

ప్రజా ప్రతినిధులకు అండగా ఉంటాం

కడప,్ఫబ్రవరి 28: అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై దౌర్జన్యం చేయడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం, భయపెట్టడం సరికాదని, బాధితులకు తాము అండగా ఉంటామని వైసిపి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక వైసిపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోజురోజుకు తెలుగుదేశం పార్టీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని, వారి ఆటలు సాగనివ్వమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి చెందుతామన్న భయం, బాధతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై దౌర్జన్యం చేయడం ఏమేరకు సమంజసమని ప్రశ్నించారు. వైసిపి గుర్తుపై గెలుపొందిన వారు టిడిపికి ఓట్లు వేయరని ఆయన ఘంటాపథంగా చెప్పారు. అధికారం ఉందని దౌర్జన్యాలు చేస్తుంటే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి విజయం తధ్యమని వైఎస్ జగన్ నాయకత్వాన్ని ఆశీర్వదించాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏ.అమరనాథరెడ్డి మాట్లాడుతూ టిడిపి అరాచకాలు ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. జిల్లాలో ఏమాత్రం ప్రజాప్రతినిధుల బలం లేకున్నా అభ్యర్థిని బరిలోదించి అధికార బలంతో , అంగబలం, ధన బలంతో గెలవాలని ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలను ప్రజల, గమనిస్తున్నారని, వైసిపి గెలుపుతథ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్‌బాషా, మేయర్ కె.సురేష్‌బాబు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.