కడప

పోలీసుల నిఘాలో ఇంటర్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మార్చి 6: ఇంటర్మీడియట్ పబ్లిక్‌పరీక్షలు పోలీసుల నిఘాలో జరుగుతుండటం, చీటికీ మాటికీ తనిఖీల పేరుతో ఇంటర్ బోర్డు అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులు పదేపదే పరీక్షల తరగతుల రూమ్‌ల్లో తనిఖీలతో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు బెంబెలేత్తుతున్నారు. కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు పరస్పరం ఫిర్యాదుల దరిమిలా అధికారులు వాస్తవాలు గ్రహించక తనిఖీ చర్యలతో ఈ ఏడాది విద్యార్థులు ఎన్నడూలేని విధంగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. 92 పరీక్ష కేంద్రాల్లో మొదటి, ద్వితీయ సంవత్సరంలో 45వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈనేపధ్యంలో ప్రభుత్వానికి, ఇంటర్మీడియట్ బోర్డుకు ప్రైవేట్ జూనియర్ కళాశాలల నిర్వహణ సక్రమంగా లేదని అపార్టుమెంట్లలో, జనవాసాల్లో ఇరుకుగదుల్లో కళాశాలలు నడుపుతున్నారని పలు విద్యాసంస్థల్లో ల్యాబ్‌లు, లైబ్రరీలు, ఆటస్థలాలు లేవని కొంతమంది ప్రైవేట్ యాజమాన్యాలే ఫిర్యాదుచేసినట్లు తెలిసింది. దీంతో వచ్చే ఏడాది ప్రారంభంలోకానీ, ఈ ఏడాది చివరిలో కానీ కళాశాలలను తనిఖీచేసి ప్రభుత్వ నిబంధనల మేరకు కళాశాలల నిర్వహణ లేని పక్షంలో కళాశాలల గుర్తింపు రద్దుచేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా వుండగా రాయచోటిలో దాదాపు 20 జూనియర్ కళాశాలలు ఉండగా అందులో కొన్నింటిని గుర్తింపులేకుండా నిర్వహిస్తున్నారు. 11 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేవలం ప్రతిభా వంతులైన విద్యార్థులను దెబ్బతీసి, ఫలితాలు పెరగకుండా ఉండేందుకు అక్కసుతో ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాలు బయటకు వెళ్తున్నాయని పుకార్లు సృష్టిస్తున్నారు. ఇంటర్మీడియట్ అధికారులు పరీక్షల నిర్వహణపై పోలీసులను ఆశ్రయించడంతో పోలీసు అధికారులు, సిబ్బంది శాంతి భద్రతల నిమిత్తం పరీక్ష కేంద్రాల వద్ద కాపుకాయకుండా ఏకంగా పరీక్ష కేంద్రాల్లోని విద్యార్థులు పరీక్షలు రాసే రూమ్‌ల్లో, కార్యాలయాల్లో ప్రవేశించి విద్యార్థులను పరీక్షలు మూడుగంటల సేపు ప్రశాంత వాతావరణంలో రాయనివ్వకుండా పోలీసులు, అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నట్లు ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అధికారులు చర్యలు తీసుకుంటూ విద్యార్థుల పరీక్షలను ప్రశాంత వాతావరణంలో రాసుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.