కడప

సంచలనం రేపిన మైనార్టీ యువకుని కిడ్నాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోరుమామిళ్ల, మార్చి 6: పట్టణ నడిబొడ్డులో, పూర్తి జనసంచారమున్న బాదుల్లా టీ దుకాణంవద్ద కిడ్నాప్ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. కిడ్నాప్ విషయం పట్టణంలో సంచలనంగా మారింది. ఒకటవ వార్డు ఎంపిటిసిగా గెలుపొందిన డాక్టర్ గౌస్‌పీర్ టిడిపి నుండి వైకాపాలోకి వచ్చి పదిరోజులు అవుతోంది. ఆయన వైకాపా శిబిరంలోకి వెళ్లడంతో ఐదురోజుల క్రితం గౌస్‌పీర్ ఆసుపత్రివద్ద ఆయన కుమారుడు ముర్తూజాహుస్సేన్‌ను టిడిపి వర్గీయులు బెదిరించినట్లు తెలుస్తోంది. పక్కా ప్రణాళికతో ఆదివారం రాత్రి సినీపక్కీలో మూడు స్కార్పియోలతో వెంబడించారు. సినిమాకు వెళ్లేందుకు స్నేహితుడు షాహిదాతో కలిసి మోటర్‌బైక్‌పై వెళ్తున్న ముర్తూజాను టి దుకాణం వద్ద అటకాయించారు. కార్లతో అడ్డుకుని ఇద్దరినీకొట్టి ముర్తూజాను క్షణం ఆలస్యం చేయకుండా కారులోకి బలవంతంగా ఎక్కించుకుని మైదుకూరు వైపు అతివేగంగా వెళ్లారు. నడిరోడ్డులో జనం ఉండగానే ఇలా యువకుడిని కిడ్నాప్ చేయడం ఈ ప్రాంతంలో సంచలనం రేపింది. కిడ్నాప్ విషయం తెలుసుకున్న తల్లి అత్తరున్నీసా పోలీసులను ఆశ్రయించి కొంతమందిపై అనుమానమున్నట్లు కేసు నమోదుచేశారు. సిఐ పద్మనాభన్, ఎస్సై పెద్ద ఓబన్న కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. సిఐ విలేఖరులతో మాట్లాడుతూ సిసి ఫుటేజీలు లభ్యమయ్యాయని, ఒక మొబైల్ కూడా సంఘటనా స్థలంలో దొరికిందని, వాటి ఆధారంగా కేసు పరిశీలించేందుకు పై అధికారులకు సమాచారం అందించామన్నారు. సోమవారం డిఎస్పీ శ్రీనివాసులు పోరుమామిళ్ల స్టేషన్‌కువచ్చి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే కిడ్నాప్ మిస్టరీని ఛేదిస్తామని, ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని అందరు పోలీసులను అప్రమత్తం చేశామన్నారు. ముద్దాయిలు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, వారికి శిక్షపడేలా చూస్తామన్నారు.
ప్రజాప్రతినిధుల కిడ్నాప్‌ల పర్వం

కడప,మార్చి 6: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఓటర్లను తమవైపు మలచుకునేందుకు స్థానిక ప్రజాప్రతినిధుల ప్రలోభాలకు గురిచేస్తూ , కిడ్నాప్‌ల పర్వానికి తెరలేపారని చెప్పవచ్చు. తాజాగా అధికార టిడిపి నేతలు రంగంలోకి దిగి జిల్లాలోని పోరుమామిళ్ల ఎంపిటిసి డాక్టర్ గౌస్‌పీర్ తన కుమారుడిని జాహుసేస్‌ను ఆదివారం రాత్రి కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ విషయం తెలుసుకున్న వైసిపి నేత మూకుమ్మడిగా సోమవారం ఉదయం పోరుమామిళ్లకు చేరుకుని కిడ్నాప్ వ్యవహారంపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని ఎంపిటిసిని తమకు 24గంటల్లో అప్పచెప్పాలని లేనిపక్షంలో పోలీసుస్టేషన్‌వద్ద ఆమరణ నిరాహారదీక్ష చేపడతామని కడప వైసిపి ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి పోలీసులకు అల్టిమేటం ఇచ్చారు. ఈనెల 17న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపధ్యంలో తెలుగుదేశంపార్టీ నేతలు తమకు స్థా నిక ప్రజాప్రతినిధులు తక్కువగా ఉండటంతో వారిని తమవైపు తిప్పుకోవాలని ఇలాంటి చర్యలు చేపట్టారని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. కాగా ఇప్పటికే కడప, ఎర్రగుంట్ల, ముద్దనూరు వైసిపి ఎంపిటిసిలు, జడ్పిటిసిలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లపై దాడులు జరిగాయి. ఓ పక్క క్యాంప్‌లకు వైసిపి, టిడిపిలు తమ సంబంధీకులను తరలించారు. ఇళ్ల వద్ద వున్న అరకొర ఎంపిటిసిలు, జడ్పిటిసిలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను ఇరుపార్టీల నేతలు తమ శిబిరాలకు తరలించే ప్రయత్నంలో ఉన్నారు. ఇరుపార్టీలకు చెందిన నేతలు లెక్కలేనంత నజరానాలు స్థానిక ప్రజాప్రతినిధుల ఓటర్లకు ముట్టచెబుతున్నారు. కొంతమంది క్యాంప్‌లకు వారి కుటుంబసభ్యులందర్నీ తీసుకెళ్తున్నారు. మహిళా ఓటర్లను తీసుకెళ్లాలంటే వారి బంధువులు, కుటుంబ సభ్యులు సైతం క్యాంప్‌లకు వెళ్లారు. అధికార టిడిపి నేతలు తమ ఓటర్లు చేజారిపోకుండా వైసిపిలోనుంచి టిడిపిలోకి వచ్చిన నేతలందర్నీ కాపాడుకునే దిశగా ఉన్నారు. టిడిపి నేతలు తిరుపతి, చిత్తూరు, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్టణంలోని శిబిరాలకు తరలించారు. వైసిపి నేతలు బెంగళూరుకు తమ ఓటర్లను తీసుకెళ్లారు. ఈనెల 17న ఎన్నికల నాటికి రాజకీయాల్లో ఎన్ని మలుపులు తిరుగుతాయో అర్థంకాక ఓటు హక్కు కలిగిన నేతలకు వారి కుటుంబసభ్యులకు, బంధువులకు సపర్యసేవలు అందిస్తూ వారిని మచ్చిక చేసుకుంటున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేసేజ్‌లతో ప్రచారం

కడప,మార్చి 6: మరో రెండురోజుల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రచారాల గడువు ముగియడంతో టిడిపి నేతలు మూకుమ్మడిగా గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు కెజె రెడ్డి, బచ్చల పుల్లయ్యలను గెలిపించాలంటూ సెల్‌ఫోన్లకు మేసేజ్‌లు గుప్పించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై నియోజకవర్గ, జిల్లా స్థాయి నేతలు శిబిరాల్లో ఉండగా శిబిరాల నుంచే మేసేజ్‌లను పంపుతున్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు గ్రాడ్యుయేట్స్ విభాగంలో కెజె రెడ్డికి వేయాలని, అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్యకే ఓట్లు వేయాలని మేసేజ్‌ల మీద మెసేజ్‌లు పంపిస్తున్నారు. నిన్నా మొన్నటి వరకు సభలు, సమావేశాలు, సమీక్షల్లో ప్రచారం చేసిన ఈనేతలు ప్రస్తుతం మేసేజ్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. పార్టీలోని ఆన్ని విభాగాలకు చెందిన నేతలంతా మండలాల వారీగా కేటాయింపులు చేసుకుని గ్రామ, మండల, డివిజన్, నియోజకవర్గం, జిల్లాస్థాయిల్లో ఓటర్లందరికీ మేసేజ్‌లు పంపుతూ విద్యార్థి సంఘం నేతలు, ఉపాధ్యాయ సంఘం నేతలు టిడిపి నేతలు సంప్రదింపులు చేస్తూ ఇరువురి అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పెట్టుకుని కృషి చేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించుకుని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రైవేట్, ప్రభుత్వపాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలల, పాలిటెక్నికల్ కళాశాలలు, యోగివేమన విశ్వవిద్యాలయంలో నేతలంతా మూకుమ్మడిగా సోమవారం వినూత్నంగాప్రచారాన్ని ముమ్మరం చేశారు. సాధారణ సెల్స్‌కు, వాట్స్‌ఆఫ్ ఉన్న వారికి ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తితో మేసేజ్‌లు పంపారు. కెజె రెడ్డి గత నెలరోజులుగా ఒక్కొక్కరికి పది పర్యాయాలు మెసేజ్‌లు పంపారు. ఉపాధ్యాయుల, గ్రాడ్యుయేట్స్‌ల ప్రచారం జిల్లాలో ముందంజలో ఉంటూ గెలుపే ధ్యేయంగా వారు ధీమాతో ఉన్నారు. పోలింగ్ రోజు శిబిరాలకు వెళ్లిన జిల్లా, రాష్ట్ర నేతలు జిల్లాకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుని ఓట్లు వేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అలాగే గ్రాడ్యుయేట్స్ తరపున డాక్టర్ గేయానంద్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ తరపున కత్తి నరసింహారెడ్డి, ఒంటేరు శ్రీనివాసులురెడ్డి, పోచం రెడ్డి సుబ్బారెడ్డి తదితరులు కూడా ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికల పోలింగ్ సమీపించే కొద్దీ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.