కడప

నేడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మార్చి 16:స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం జిల్లాలో జరగనున్న పోలింగ్‌కు మూడు రెవెన్యూ సబ్‌డివిజన్లలో అధికారులు పకడ్బంధీగా ఏర్పాట్లు చేశా రు. ఎటువంటి అక్రమాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెబ్‌కాస్టింగ్ కెమెరాలతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. జిల్లాలో ఆరుగురు ఐపిఎస్ అధికారులతోపాటు 3వేల మంది పైబడి బందోబస్తు ఏర్పాటుచేశారు. కేవలం కడప జడ్పీ సభాభవన్‌లో జరిగే పోలింగ్ కేంద్రం వద్ద దాదాపు 1600 మంది పోలీసులను బందోబస్తు ఏర్పాటుచేసినట్లు తెలిసింది. పోలింగ్ కేంద్రాల వద్దకు బ యటి వ్యక్తులు, ఓటు హక్కులేని ప్ర జాప్రతినిధులను అనుమతించకుండా 200 మీటర్ల దూరంలో నిబంధనలు పెట్టి భారీ ఎత్తున బ్యారిగేట్లు ఏర్పాటుచేశారు. మద్యం దుకాణాలను జిల్లా వ్యాప్తంగా మూయించారు. జమ్మలమడుగులో రెవెన్యూ డివిజన్ కార్యాలయం చుట్టు స్థిరనివాసాలు వుండటంతో కార్యాలయం చుట్టు ప్రాంతా లు కన్పించకుండా ఎత్తుగా రేకులు వేశారు. పోలీసు యాక్టు 30తోపాటు 144 సెక్షన్‌ను ప్రకటించారు. ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 841 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లాలో గతం లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదుకాకుండా ఉంటే ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈసందర్భం గా కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి కెవి సత్యనారాయణ, ఎలక్ట్రోరల్ అధికారిణి, జా యింట్ కలెక్టర్ శే్వత తెవతియ, కడప ఆర్డీఓ చిన్నరాముడు, రాజంపేట ఆర్డీఓ వీరబ్రహ్మం, జమ్మలమడుగు ఆర్డీఓ వినాయకంలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కర్నూలు డిఐజి రమణకుమార్, బుధవారం జిల్లాకు చేరుకుని ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ, ఓఎస్‌డి సత్యయేసుబాబు, పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్, ట్రైనీ ఐఎఫ్‌ఎస్ అధికారిణి నందిని, మరో ఐపిఎస్ అధికారి అమిత్‌గర్గ్‌లతోపాటు సంబంధిత డివిజనల్ పోలీసు అధికారులు జిల్లా కేంద్రంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న డిఎస్పీలకు బందోబస్తు ఏర్పా ట్లు ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణకు అప్పగించారు. జిల్లా శివారు ప్రాంతాలు మొదలుకుని అన్ని నియోజకవర్గాల శివారు ప్రాంతాల వరకు చివరకు క డప, రాజంపేట, జమ్మలమడుగు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా అడుగడుగునా చెక్ పోస్టులు ఏర్పాటుచేశా రు. జిల్లా వ్యాప్తంగా 128 మంది పైచిలుకు బైండోవర్ చేయగా కడప నగరంలోనే 34 మందిని బైండోవర్ చేశారు. ఓటరు పోలింగ్ కేంద్రానికి వెళ్లినా ఓటర్ల ముఖం కన్పించే విధంగా ఒక లైవ్ కెమెరాను ఓటరు వేసే ఓటు యాక్టివిటీనీ మరో కెమెరాలోనూ , రెండు వెబ్‌కాస్టింగ్ కెమెరాల ద్వారా ఎన్నికల ప్రక్రియ జరగనుంది. ఈ మూడు డివిజన్లలో 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈనేపథ్యంలో దుకాణాలు, ల్యాడ్జిలు, మద్యం దుకాణాలు అన్నింటినీ ఎన్నికలు జరిగే మూడు పట్టణాల్లో మూసివేయించారు. వైసిపి నేతలు మాత్రం అధికార పార్టీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని, తమ వారిని కిడ్నాప్ చేస్తున్నారని ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా ఎస్పీ రామకృష్ణ కనీవినీ ఎరుగని రీతిలో పకడ్బంధీగా పోలింగ్ ఏర్పాట్లు చేశారు. అలాగే పోలింగ్ కేంద్రాల మేడపైన , చుట్కుపక్కల జనవాసాల మేడలపైన పోలీసులను మోహరిస్తున్నారు.
నేటి నుండి పది పరీక్షలు

కడప,మార్చి 16:జిల్లాలో శుక్రవారం జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు సర్వం సిద్దం చేశారు. జిల్లాలో పరీక్షల నిర్వహణకానీ, ఎన్నికల నిర్వహణ కానీ అధికారులకు సవాల్‌గా నిలవడం, ప్రతినిత్యం కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు కేవలం మార్కులు, గ్రేడింగ్‌ల కోసం ఒక విద్యాసంస్థపై మరో విద్యాసంస్థ పరస్పరం ఫిర్యాదు చేసుకుని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఈ ఏడాది కలెక్టర్ కెవి సత్యనారాయణ స్వయంగా పరీక్షల నిర్వహణ బాధ్యతలను తానే పర్యవేక్షిస్తానని ప్రకటించి రెవెన్యూ, మండల పరిషత్ అధికారులతోపాటు మండలానికి ఒకరిని ప్రత్యేక అధికారిగా నియామకం చేశారు. జిల్లా విద్యాశాఖాధికారిణి శైలజ ఇటీవల బాధ్యతలుచేపట్టడంతో ఆమెకు అనుభవం ఉన్నా పరీక్షల నిర్వహణలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల మాయాజాలంతో ఆమె కలెక్టర్‌కు పూర్తిస్థాయిలో వివరించడంతో కలెక్టర్ స్వయంగా రంగంలో దిగారు. జిల్లాలో సమస్యాత్మకంగా ఉన్న టెన్త్ పరీక్ష కేంద్రాలైన గండిక్షేత్రం, సాంఘిక సంక్షేమపాఠశాల, దువ్వూరు జెడ్పి హైస్కూల్, తాళ్లప్రొద్దుటూరు, కొండాపురం, పెనగలూరు పరీక్ష కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటుచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 164 పరీక్షా కేంద్రాల్లో 35,992 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 10్ఫ్లయింగ్ స్వ్కాడ్‌లు, 164 మంది డిపార్టుమెంట్ అధికారులు, 1740 మంది ఇన్విజిలేటర్లు, ప్రతి ఇన్విజిలేటర్‌కు ఐడి కార్డు అందజేస్తారు. మాస్ కాపీయింగ్ జరిగే కేంద్రాలపై గట్టి నిఘా పెట్టడంతో పాటు ప్రత్యేక అధికారులను నియామకం చేశారు. కలెక్టతోపాడు ఆర్‌జెడి బి.ప్రతాప్‌రెడ్డి పరీక్షలను పర్యవేక్షనున్నారు. జిల్లాకు టెన్త్ బోర్డు అధికారులు కూడా రానున్నారు. జిల్లాలో డిప్యుటీ డిఇఓల సంఖ్య, పరీక్షల నిర్వహణ అధికారుల సంఖ్య తక్కువగా ఉండటంతో కొన్ని విద్యాసంస్థలు, కార్పొరేట్ విద్యాసంస్థలు అక్రమాలకు పాల్పడి అధికమార్కులు తెప్పించుకునేందుకు కొనసాగిస్తున్న ప్రయత్నాలకు ఈసారి కలెక్టర్ చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. కొంతమంది హెడ్మాస్టర్లు, ఇన్విజిలేటర్లే స్వ యంగా విద్యార్థులకు కాపీలు అందించడం, జవాబుపత్రాలు మా ర్చడం అనేక తంతులకు పాల్పడుతుండేవారు ఈ ఏడాది వారందరిపై గట్టి నిఘా ఉంచారు. కర్నూలు డైట్ ప్రిన్సిపాల్ రాఘవరెడ్డిని పరీక్షల పరిశీలకునిగా నియామకం చేశారు. పాఠశాల విద్యా ప్రధానకార్యదర్శి ఆదిత్యనాదాస్ ఇప్పటికే పరీక్షల ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలోనే టెన్త్ ఫలితాల్లో ప్రధమస్థానం దక్కించుకుంది. ఈ ఏడాది కూడా అదే స్థానాన్ని దక్కించుకుంటుందని ఆశిద్దాం.
భారీ పోలీసు బందోబస్తు ఆంధ్రభూమిబ్యూరో
కడప,మార్చి 16: ఐజి, డిఐజి, ఎస్పీ ప్రత్యేక పర్యవేక్షణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత ఎన్నికల నిర్వహణకు 2వేల మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్టబందోబస్తు ఏర్పాటుచేసినట్లు ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ తెలిపారు. గురువారం పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బందోబస్తు కోసం ఇతర జిల్లాల నుంచి కూడా ప్రత్యేక బలగాలు రప్పించామని, జమ్మలమడుగులో 144వ సెక్షన్‌తోపాటు 30 పోలీసు యాక్టు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అత్యాధునికమైన డ్రోమ్‌లు, సిసి కెమెరాలు, బాడీ ఓర్న్ కెమెరాలతో అనువనువునా నిఘా ఏర్పాటుచేసి అభ్యర్థులకు చెందిన బయటి వ్యక్తులు జమ్మలమడుగు పట్టణంలో ఉండకూడదని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ ఎన్నికలకు ఐజి శ్రీ్ధర్‌రావుతోపాటు డిఐజి బివి రమణకుమార్, ప్రత్యేక పర్యవేక్షణలో జరుగుతున్నట్లు వివరించారు. బందోబస్తు నిమిత్తం గుంటూరు, చిత్తూరు, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక పోలీసు బలగాలు జిల్లాకు చేరుకున్నాయని వీరితోపాటు రెండు ప్లాటూన్ల సిఆర్‌పిఎఫ్ దళాలు, ఆరు ప్లాటూన్ల ఏపి ఎస్పీ పోలీసులు, 20 స్పెషల్‌పార్టీలు, 10 ప్లాటూన్ల ఏఆర్ బలగాలు, ఒక అదనపు ఎస్పీ , ఏడుగురు డిఎస్పీలతోపాటు మొత్తం 2వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేసినట్లు వివరించారు. ఎమ్మెల్సీ బరిలో ఉన్న అభ్యర్థులకు చెందిన బయటిప్రాంతాల వ్యక్తులు, అనుచరులు జమ్మలమడుగు పట్టణంలో ఉండకూడదని, పోలింగ్ జరిగే కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలసి సూచించారు. పట్టణంలో అనవసరంగా రోడ్లపై తిరగవద్దని జమ్మలమడుగులో వెయ్యిమంది సిబ్బందితో గురువారం సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే 352 మంది ట్రబుల్ మ్యాంగర్స్‌ను బైండోవర్ చేశామని, ఏ రకమైన విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించామన్నారు. జమ్మలమడుగులో చెక్‌పోస్టులు, పికెట్‌లు, ముఖ్యమైన కూడళ్లవద్ద సిసి కెమెరాలు ఏర్పాటుచేయడంతోపాటు ప్రత్యేక నిఘా సిబ్బందిని ఏర్పాటుచేశామని ఓటర్లు బూత్‌లకు వచ్చి నిర్భయంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు.

అధికారుల దృష్టికి రన్నింగ్ స్ట్ఫా సమస్యలు

నందలూరు, మార్చి 16:నందలూరు రైల్వేకేంద్రానికి గురువారం విచ్చేసిన సికింద్రాబాద్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రాథోడ్ దృష్టికి ఎస్‌సిఆర్‌ఇఎస్ సెక్రటరీ రవిశంకర్, మజ్దూర్ సెక్రటరీ కమలాకర్, ఎల్‌ఆర్‌ఎస్‌ఏ సెక్రటరీ ఎస్‌జె రావ్ రన్నింగ్ స్ట్ఫా కార్మికుల పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ నందలూరు నుండి రన్నింగ్ స్ట్ఫా కృష్ణపట్నం, బిట్రగుంట నుండి వస్తున్న గూడ్స్ బండ్లను రాచగనే్నరులో పని గంటలు ముగియక ముందే రిలీఫ్ ఇచ్చి వారిని రేణిగుంటకు తీసుకెళుతున్నారన్నారు. రాచగనే్నరులోనే రిలీఫ్ ఇవ్వకుండా నేరుగా నందలూరు వరకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలన్నారు. వేసవి కాలంలో వేడి అధికంగా ఉన్నందున ముద్దనూరులోని సిడిఆర్‌కు చాలా ఇబ్బందికరంగా ఉందని, కావున పది గంటల సమయం తక్కువగా ఉన్నందున ముద్దనూరులో రిలీఫ్ ఇవ్వకుండా చేయాలన్నారు. నందలూరు లాబీలో బాత్‌రూమ్, క్రూ రెస్ట్‌రూం ఏర్పాటు చేయాలన్నారు. పుట్ ఓవర్ బ్రిడ్జిని చివరి లైన్ వరకు పొడిగించి నిర్మాణం చేపట్టాలని, అటు ప్రక్క ఉన్న రైల్వే ఆసుపత్రి, రన్నింగ్ రూంకు, రైల్వేకాలనీకి వెళ్లేందుకు సదుపాయం ఉంటుందన్నారు. కార్మిక సంఘ నాయకులపై స్పందించిన రాథోడ్ వెంటనే సమస్యల పరిష్కారంకు చర్యలు తీసుకొంటామని హమీ ఇచ్చారు. అనంతరం ఆయన రైల్వేకేంద్రంలోని లాబీ, రన్నింగ్ రూం, పలు కార్యాలయాలను తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గుంతకల్ సీనియర్ డిఇఇ విజయేంద్రకుమార్, డిఇఇ శ్రీతేజ, డిఎల్‌ఐ వైఎస్ బాబులతో పాటు కార్మిక నాయకులు ప్రభాకర్‌రెడ్డి, కృష్ణమూర్తి, శ్రీనివాసరావు, వివికె రెడ్డి, రవిప్రకాష్, ఆర్‌పి మీనా, రెడ్డయ్య, శివయ్య తదితరులు పాల్గొన్నారు.
మాల్‌ప్రాక్టీస్ బాధ్యత ఇన్విజిలేటర్లదే
* ఎంఇఓ జాఫర్‌సాధిక్
కమలాపురం, మార్చి 16: పదవ తరగతి పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇన్విజిలేటర్లదేనని ఎమీవో జాఫర్‌సాదిక్ స్పష్టం చేసారు. ఆయన గురువారం విలేఖర్లతో మాట్లాడుతూ ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసిందని చెప్పారు. పరీక్షాకేంద్రంలోకి వెళ్లేసమయంలో చీఫ్‌లు, డిపార్డుమెంటల్ అధికారులు ఇన్విజిలేటర్లను, విద్యార్థులను తనిఖిచేసి లోనకు పంపడం జరుగుతుందన్నారు. పరీక్షాకేంద్రంలోనికి సెల్‌ఫోన్లను అనుమతించపోమని తెలిపారు. పరీక్షావిధుల్లో పాల్గొనే ఇన్విజిలేటర్లందరికి ఐడి కార్డు కలిగి ఉండాలన్నారు. బాలికలకు సంబందించి ప్రతికేంద్రంలో కూడా ఇద్దరు మహిళా ఇన్విజిలేటర్లను ప్రభుత్వం నియమించిందన్నారు. పరీక్షాగదిలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బల్లలు ఏర్పాటు చేయడమే కాక మంచినీరు, ప్రథమచికిత్స ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు అందించే అడిషనల్‌షీట్లపై ఇన్విజిలేటర్లు తగు జాగ్రత్త వహించాలన్నారు. ఎటువంటి అవకతవకలు జరిగినా పూర్తి బాద్యత ఇన్విజిలేటర్లదేనన్నారు. పరీక్షాకేంద్రంలో మాస్‌కాపియింగ్‌కు పాల్పడితే ప్రభుత్వచట్టం 25మేరకు ఇన్విజిలేటర్లను విధుల్లోనుంచి సస్పెండ్ చేయడమేకాక లక్షరూపాయల జరిమానా విధిస్తారన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ పద్ధతిలో నియమించారన్నారు. వీరికి ముందురోజు మధ్యాహ్నం 4గంటలకు సెల్‌ఫోన్ మెసేజ్ వస్తుందని, నియమించబడ్డ కేంద్రంలో 7.30గంటలకు రిపోర్టుచేయాల్సి ఉంటుందన్నారు. సమస్యాత్మక కేంద్రమైన బాలుర హైస్కూల్లో రెండు గదుల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. కమలాపురం పట్టణంలో బాలుర, బాలికల జడ్పీహైస్కూల్లో, ఎస్సీ బాలికల గురుకుల కేంద్రంలో మూడుపరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు. ఈ కేంద్రాల్లో ముగ్గురు చీఫ్‌లు, ముగ్గురు డిపార్టుమెంటల్ అధికారులు, 32మంది ఇన్విజిలేటర్లను విద్యాశాఖ నియమించిందన్నారు. ఈ కేంద్రాల్లో 655మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారన్నారు. అలాగే పరీక్షాకేంద్రాల్లో ప్రారంభంరోజు విద్యార్థులు ఉదయం 8.30 గంటలకు చేరుకోవాలని మిగిలిన రోజుల్లో ఉదయం 9.00గంటలకు చేరుకునేందుకు అనుమతి ఉందన్నారు. విద్యార్థులు ఎలాంటి వత్తిళ్లకు లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆయన సూచించారు. పరీక్షాకేంద్రాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు కాపీలు అందించేందుకు ప్రయత్నించకుండా ప్రతిభతో విద్యార్థులు పరీక్షలు రాసేలా వారిని ప్రోత్సహించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు.
అనంతపురం సభను
విజయవంతం చేయండి
కమలాపురం, మార్చి 16: అనంతపురం పట్టణంలో ఈనెల 18న జరుగ నున్న జనచైతన్యయాత్ర సభను విజయవంతం చేయాలని సిపిఐ ఏరియా కార్యదర్శి చంద్రశేఖర్, మండల కార్యదర్శి ఆర్ సుబ్బరాయుడు విజ్ఞప్తి చేసారు. వారు గురువారం ఈసభకు సంబందించిన గోడపత్రాలను విడుదల చేసారు. ఈసందర్బంగా మాట్లాడుతూ అణగారిన వర్గాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వాలపై వత్తిడి తెచ్చేందుకు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి అనంతపురం జిల్లా హిందూపురం వరకు నిర్వహించిన జనచైతన్యయాత్రపై అనంతపురంలో భారీ బహిరంగసభ జరుగనున్నట్లు చెప్పారు. ఈసభకు వామపక్షాలనేతలు సురవరం సుదాకరరెడ్డి, ఏచూరి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామకృష్ణ తదితర నేతలు హాజరవుతున్నారన్నారు. ఇందుకోసం పెద్దసంఖ్యలో తరలివెళుతున్నట్లు వివరించారు.

శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు ప్రారంభం
చక్రాయపేట, మార్చి 16:మండలంలోని మహదేవపల్లె గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు గురువారం ఆలయ కార్యనిర్వాహకుడు లక్ష్మీనరసింహులు ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుతగా పురోహితులు ఆలూరి రాంప్రసాద్, ఆచూరు రవిశర్మ పురోహితులచే తొలుతగా గణపతిపూజ, స్వస్తివాచనం, రక్షాబంధనము, ప్రధాన కలశస్థాపనం, అఖండదీప ప్రతిష్ట, నవగ్రహారాధన, నివేదనం, మహా మంగళహారతి, తీర్థప్రసాదాలు ఘనంగా నిర్వహించారు. అలాగే గుండు రామాంజనేయులు వారు అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మహదేవపల్లె చుట్టుపక్కల గ్రామాలైన బొజ్జువాండ్లపల్లె, గంగారపువాండ్లపల్లె, బాటలోపల్లె, నెరుసుపల్లె, బొందిరిమేకల, అక్కిరెడ్డిగారిపల్లె, కుప్పం, బురుజుపల్లె తదితర గ్రామాల నుండి ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. అదే విధంగా 18, 19వ తేదీలలో కూడా లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి లక్ష్మినరసింహులు పేర్కొన్నారు. కావున శుక్ర, శనివారాలలో జరిగే నరసింహస్వామి ఉత్సవాలలో భక్తులు పాల్గొనాలని వారు కోరారు.

ఎమ్మెల్సీ పోలింగ్‌కు సర్వం సన్నద్ధం

జమ్మలమడుగు, మార్చి16:స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సన్నద్ధం చేశారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా పట్టణంలోని ఆర్డీవో కార్యాలయ సభాభవనంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రం పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. గతంలో ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు పటిష్ఠమైన చర్యలు చేపట్టారు. ఎన్నికల నేపథ్యంలో ఐజి ఎన్.శ్రీ్ధర్‌రావు, డిఐజి బి.వి.రమణకుమార్, ఎస్పీ పి.హెచ్.డి. రామక్రిష్ణ స్వయంగా గురువారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి పట్టణంలో శుక్రవారం 144 సెక్షన్, పోలీసు యాక్టు 30 అమలు చేస్తున్నారు. ఎన్నికల పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిసర ప్రాంతాలన్నీ అత్యాధునిక డ్రోన్ కెమెరాలు, సిసి కెమెరాలు, బాడీవోర్న్ కెమెరాలతో అనువణునా నిఘా ఉంచారు. బయటిప్రాంతాలకు చెందిన అభ్యర్థులు పట్టణంలో 17వ తేదీ ఉండకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. ఎన్నికల బందోబస్తుకు ఇతర జిల్లాల నుండి 2 ప్లాటూన్ల సిఆర్‌పిఎఫ్, 6 ప్లాటూన్ల ఎపిఎస్‌పి, 10 ప్లాటూన్ల ఎఆర్ బలగాలతో పాటు, 20 స్పెషల్ పార్టీలు, అదనపు ఎస్పీ, ఏడుగురు డియస్పీలతో మొత్తంగా రెండు వేల మందితో భారీబందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ రామక్రిష్ణ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ఎవరైన విఘా తం కలిగించే చర్యలకు పూనుకుంటే కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ రామక్రిష్ణ హెచ్చరించారు.
పది పరీక్షలు అయ్యవార్లకు అగ్నిపరీక్ష
* మాస్‌కాపీయింగ్ ఇన్విజిలేటర్లదే బాధ్యత
* కట్టుదిట్టంగా ఏర్పాట్లు
సుండుపల్లె, మార్చి 16: పదో తరగతి పరీక్షలు అయ్యవార్లకు అగ్నిపరీక్షగా మారింది. నేటి నుండి ప్రారంభం కానున్న పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మండలంలోని మూడు పరీక్షా కేంద్రాలకు విద్యాశాఖ అనుమతినిచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన పది విద్యార్థులు 520 మంది పరీక్ష రాయనున్నారు. సుండుపల్లె, జికె రాచపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలతో పాటు లిటిల్ ఫ్లవర్ ప్రైవేటు పాఠశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అనుమతి లభించింది. అన్నీ సిద్ధంగా ఉన్న అయ్యవార్లు(ఇన్విజిలేటర్లు) భయపడుతున్నారు. పరీక్షా కేంద్రంలో మాస్‌కాపీయింగ్‌కు సహకరించినట్లు ఆధారాలు లభిస్తే సంబంధిత ఇన్విజిలేటర్లపై కఠినచర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 1997లో అప్పటి ప్రభుత్వం రూపొందించిన యాక్ట్ 25 విధి విధానాలను ప్రవేశపెట్టింది. పరీక్షలలో మాస్‌కాపీయింగ్ నిరోధించడమే లక్ష్యంగా విద్యాశాఖ సన్నద్దమైంది. అయితే సుండుపల్లె మండలంలో 50 మంది ఉపాధ్యాయులకు ఇన్విజిలేటర్లుగా పనిచేయాలని ఆదేశాలు అందాయి. వీరిలో 30 మంది మాత్రమే పరీక్షల బాధ్యత తీసుకుంటారు. మిగిలిన వారికి మరొక పరీక్షకు బాధ్యత వహించాల్సి ఉంటుందని మండల విద్యాశాఖాధికారి తెలియజేశారు. ఎవరైనా ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాస్ కాపీయింగ్‌లో సహకరిస్తే అంతే సంగతులు అన్న విషయాన్ని బుధవారం జరిగిన సమావేశంలో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది.
ట్రాక్టర్‌పై నుంచిపడి మహిళ మృతి
రాజుపాళెం, మార్చి 16: మండలపరిదిలోని కొర్రపాడు గ్రామానికి చెందిన జేష్టాది జయమ్మ (36) ట్రాక్టర్ ట్రాలీ నుంచి కిందపడి గురువారం మృతిచెందినట్లు రాజుపాళెం పోలీసు స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ మారుతీరావు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. రాజుపాళెం గ్రామానికి చెందిన సానె వెంకటసుబ్బారెడ్డి ట్రాక్టర్ ద్వారా కూలీలను తరలిస్తుండగా కొర్రపాడు - రాజుపాళెం గ్రామాల మధ్య అమ్మ ఇండేన్‌గ్యాస్ కార్యాలయంవద్ద ట్రాలీ నుంచి జారి జయమ్మ కిందపడడంతో అక్కడికక్కడే మృతిచెందిందన్నారు. ట్రాక్టర్ నడుపుతున్న వెంకటసుబ్బారెడ్డి నిర్లక్ష్యంవల్ల ట్రాక్టర్ ట్రాలీ లిఫ్ట్ పైకి లేయడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందన్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. మృతురాలి మరిది జేష్టాది యోహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ నడుపుతున్న వెంకటసుబ్బారెడ్డిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
రోడ్డు ప్రమాదంలో స్కూటరిస్టు మృతి
రాయచోటి, మార్చి16:వీరబల్లి మండలం సానిపాయి గ్రామంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని స్కూటరిస్టు కొండూరు సీతారామరాజు(52) మృతిచెందాడు. బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వీరబల్లి మండలం రోళ్లమడుగుకు చెందిన కొండూరు సీతారామరాజు తన ద్విచక్రవాహనంలో పాలెం నుండి సానిపాయికి బయలుదేరాడని, ఆ మార్గమధ్యలో గుర్తు తెలియని వాహనం ఢీకొనగా సీతారామరాజు కుప్పకూలాడన్నారు. విషయం తెలుసుకున్న బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించేలోగా చనిపోయాడన్నారు. మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం శవాన్ని బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బద్రిపల్లెలో గడ్డివామి దగ్ధం
చాపాడు, మార్చి 16: మండలంలోని బద్రిపల్లె ఎస్సీ కాలనీలో చిలమకూరు పెద్దబాలయ్య అనే రైతుకు చెందిన గడ్డివామి గురువారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో దగ్ధమైంది. సుమారు లక్షరూపాయల మేర నష్టం జరిగినట్లు బాధితరైతు పెద్ద బాలయ్య తెలిపారు. ఇటీవల కెసికెనాల్ పరిదిలో 15 ఎకరాల గడ్డిని ఎకరా పొలములోని గడ్డి రూ.7 వేలతో కొనుగోలుచేసి వామిని వేశామన్నారు. గురువారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడి గడ్డివామి పూర్తిగా కాలిపోయిందన్నారు. ఆ మేరకు మైదుకూరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారమిచ్చి ఫైర్ ఇంజిన్ వచ్చేలోపు గడ్డివామి పూర్తిగా కాలిపోయిందని బాధిత రైతు పేర్కొన్నారు. ప్రభుత్వం తగిన ఆర్థికసాయాన్ని అందివ్వాలని ఆయన కోరారు.