కడప

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మార్చి 19: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం కలెక్టరేట్‌లోని మీ కోసం భవనంలో ఉదయం 8గంటల నుంచి లెక్కింపుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. కడప, రాజంపేట, జమ్మలమడుగు రెవెన్యూ సబ్ డివిజన్లకు సంబంధించిన ఎంపిటిసిలు, జడ్పిటిసిలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎక్స్ ఆపిషియో సభ్యుల బ్యాలెట్ పత్రాలన్నీ కలిపి లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా స్ట్రాంగ్ రూమ్‌లు ప్రారంభం నుంచి బ్యాలెట్ బాక్సుల సీళ్లు తీసే కార్యక్రమం, మూడు డివిజన్ల బ్యాలెట్ పత్రాలను కలిపి అనంతరం ఓట్ల లెక్కింపు పూర్తయి వాటిని సీజ్ చేసే వరకు సిసి కెమెరాలు, సిసి టివిలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా కళ్లకు అద్దంకట్టినట్లుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. 200 మీటర్ల దూరంలో నేతలందరికీ ఆంక్షలు విధించారు. చివరకు మీడియాప్రతినిధులను కేవలం మీడియా సెంటర్‌కే పరిమితం చేశారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమం 25 ఓట్లు చొప్పున ఒక బండిల్ కట్టి, 839 ఓట్లకు 34 బండిల్స్‌ను కట్టి లెక్కించనున్నారు. 10మంది ఎమ్మెల్సీ అభ్యర్థులు బరిలో ఉండగా వారి తరపున హాజరయ్యే ఏజెంట్లు, జనరల్ ఏజెంట్లు, అభ్యర్థులు కూడా ఏదైనా సందేహం వస్తే నివృత్తి చేసేందుకు సంబంధిత అధికారులను నియామకం చేసింది. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కెవి సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్, ఎలక్ట్రోరల్ అధికారి శే్వత భారీ ఏర్పాట్లుచేసి ఆదివారం సాయంత్రం కౌంటింగ్‌హాల్‌ను సీజ్‌చేసిన సీళ్లను పరిశీలించారు. సోమవారం కౌంటింగ్ సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశామని వారిని కలిసిన విలేఖర్లకు స్పష్టం చేశారు. ఎన్నికల పర్యవేక్షణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర శిశుసంక్షేమ కమిషనర్ చక్రవర్తిని నియామకం చేశారు. ఆయనతోపాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు క్వారిన్, కెఎస్ జవహర్‌రెడ్డిలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ నేతృత్వంలో ముగ్గురు ఐపిఎస్ అధికారులు, జిల్లాలోని అన్ని పోలీసు సబ్ డివిజన్ల డిఎస్పీలు, 2వేల మంది పోలీసు సిబ్బందిని కలెక్టరేట్‌కు బందోబస్తు నియమించారు. అలాగే 144సెక్షన్ , 30 పోలీసు యాక్టును ప్రకటించారు. రిమ్స్‌కు వెళ్లే వాహనాల దారి మళ్లించారు. కడప శివారుప్రాంతంలో చెక్‌పోస్టు ఏర్పాటుచేసి బయటి వ్యక్తులను అనుమతించకుండా నిషేధించారు. అయితే ఇరుపార్టీలకు చెందిన నేతలు బ్యాలెట్ బాక్సులు ఉన్న పరిసర ప్రాంతాల్లోని నివాసాల్లో గత మూడురోజులుగా కాపు కాచివున్నారు. డేగ కన్ను కలిగిన ఏజెంట్లను నియామకం చేసి ఓట్ల లెక్కింపు ప్రక్రియపై దృష్టిసారించారు. అధికార, ప్రతిపక్షనేతలు జిల్లా వ్యాప్తంగా నేతలంతా ఆదివారం రాత్రి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. టిడిపి అభ్యర్థి బిటెక్ రవి, వైకాపా అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి తమ అనుచరగణాలతో వారు సైతం జిల్లా కేంద్రంలో మకాం వేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. పోలింగ్ బాక్సులు స్టాంగ్‌రూమ్‌ల చేరినప్పుడే సిసి కెమెరాలు, వెబ్ కాస్టింగ్‌ను ఇరువురు అభ్యర్థుల సెల్స్‌కు అనుసంధానం చేశారు. దీంతో అభ్యర్థులకు ఉన్న అనుమానాలు తొలగాయి. మొత్తంమీద ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫలితాలు అనంతరం ఎలాంటి ఊరేగింపులు, సభలు, సమావేశాలు, బాణసంచా నిర్వహించకుండా పోలీసు యంత్రాంగం ముందస్తుచర్యలు చేపట్టి ఇప్పటికే ఇరుపార్టీల నేతలకు చెప్పడం, అసాంఘిక శక్తులను హెచ్చరించారు.
కలెక్టరేట్ సిడిఓ బ్లాక్ కార్యాలయాలకు హాఫ్‌డే సెలవు
కడప,(కల్చరల్)మార్చి 19: ఈనెల 20వ తేదీన (సోమవారం) శాసన మండలి స్థానిక సంస్థల నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కలెక్టరేట్‌లోని మీకోసం హాలులో చేపడుతున్నందున కలెక్టరేట్‌లోని సిడిఓ బ్లాక్‌ల్లో ఉన్న కార్యాలయాలకు ఉదయం నుండి అర్ధరోజు సెలవును ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ కెవి సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో శాసన మండలి స్థానికసంస్థల నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కలెక్టరేట్ మొత్తం పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసి ఉన్నందున కలెక్టరేట్‌లోని సిడిఓ బ్లాక్‌ల్లో ఉన్న కార్యాలయాలకు ఉదయం నుండి అర్ధరోజు సెలవు ప్రకటించడమైనదన్నారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తదుపరి నుండి అనగా సోమవారం మధ్యాహ్నం నుంచి యథావిధిగా కార్యాలయ విధులకు హాజరుకావాల్సిందిగా కలెక్టర్ తెలియజేశారు.

సీఎం చంద్రబాబును ఆదర్శంగా
తీసుకోవాలి

ప్రొద్దుటూరు టౌన్, మార్చి 19: ప్రజల సంక్షేమానికై, రాష్ట్భ్రావృద్ధికై నిబద్ధతతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఛైర్మన్ మల్లెల లింగారెడ్డి అన్నారు. పట్టణంలోని తన స్వగృహంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేకహోదా విషయంపై కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య టిడిపిని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని అడ్డంగా చీల్చి, అప్పులు మిగిల్చినటువంటి కాంగ్రెస్‌పార్టీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం హాస్యస్పదమన్నారు. దేశంలో ప్రస్తుతం ప్రత్యేకహోదా ఉన్నటువంటి రాష్ట్రాలు కాలపరమితి ముగిసినా మళ్లీహోదా కావాలని కోరడం లేదని, హోదా ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉందని లింగారెడ్డి అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ పేరుతో వేల కోట్లరూపాయలు కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే అవకాశాలున్నాయని, ఇప్పటికే రూ.48 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని, తద్వారా రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు, కారిడార్లు, సాగు, తాగునీటి ప్రాజెక్టులు తదితర వాటికి ఖర్చుచేసి ప్రజలకు లబ్ది చేకూర్చే అవకాశాలున్నాయన్నారు. కొత్తగా రేషన్‌కార్డులు, పక్కాగృహాలు మంజూరుచేశారని, అలాగే నిరుద్యోగభృతిని కూడా అందించనున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా ద్వారా రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని, ప్యాకేజీయే అన్నివిధాలా సరైందని తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని సగం ప్రాంతానికి కృష్ణా జలాలను తీసుకొచ్చి వ్యవసాయానికి, తాగునీటికి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించడం జరిగిందన్నారు. కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని, వైకాపా గొంతు వరకు పూడిపోయిందని, మరికొన్నిరోజుల్లో తల కూడా కనబడకుండా పూర్తిగా భూమిలో కూరుకుపోతుందని లింగారెడ్డి జోస్యం చెప్పారు. తన చిన్నాన్న గెలుపు ఖాయమని ప్రగల్బాలు పలికిన జగన్‌మోహన్‌రెడ్డికి నేడు వెలువడబోవు ఫలితాల్లో టిడిపి అభ్యర్థి గెలుపుతో జిల్లాలో వైకాపాకు కాలం చెల్లుతుందన్నారు. కార్యక్రమంలో ఇవి. సుధాకర్‌రెడ్డి, బిసి సంక్షేమసంఘం నాయకులు గాండ్ల నారాయణ, కామిశెట్టిబాబు, కౌన్సిలర్లు రఫి, పిట్టా శ్రీను పాల్గొన్నారు.

గండి క్షేత్రంలో వాటర్ ట్యాంకర్
ఏర్పాటుకు కృషి

చక్రాయపేట, మార్చి 19: జిల్లాలో ప్రసిద్ది చెందిన గండి క్షేత్రంలో భక్తుల కొరకు లక్ష లీటర్ల నీటి ట్యాంకు ఏర్పాటు చేస్తానని కడప ఎంపి అవినాష్‌రెడ్డి తెలిపారు. ఆదివారం గండి క్షేత్రానికి ఎంపి విచ్చేశారు. తొలుత అర్చకులు ఆలయ మర్యాదలతో ఎంపి అవినాష్‌రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం అంజన్న గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం గండి దేవస్థాన ప్రధాన అర్చకుడు కన్నయ్య స్వామి కడప ఎంపికి సన్మానం చేశారు. తదుపరి గండిలో భక్తుల కోసం లక్ష లీటర్ల ట్యాంకును ఏర్పాటు చేయాలని భక్తులు కోరడంతో అందుకు ఆయన తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కసిరెడ్డి ఆదికేశవ రెడ్డి కుమారిని తలనీలాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి ప్రవీణ్ కుమార్ రెడ్డి, వేంపల్లె మండలాధ్యక్షుడు రవికుమార్ రెడ్డి, ఎంపిటిసి టోపి వలి, అద్దాలమర్రి సర్పంచ్ సంజీవ రెడ్డి, వైఎస్‌ఆర్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అనాథ పిల్లల దత్తతకు చర్యలు

కడప,మార్చి 19: తల్లిదండ్రుల చేత వదిలివేయబడిన, అనాథ పిల్లలను కారా సంస్థ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదుచేసి బాలల అత్యుత్తమ ప్రయోజనాలకు దత్తత చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) జాతీయ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ మాండ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లోని స్ర్తి, శిశు అభివృద్ధి కార్యాలయంలో అనాథ పిల్లల దత్తతకు సంబంధించి విలేఖర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కారా చైర్మన్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటి న్యూఢిల్లీ వారు నిర్ధేశించిన మార్గదర్శకాల ప్రకారం వదిలివేయబడిన పిల్లలు, తల్లిదండ్రుల చేత అప్పగించబడిన పిల్లల వివరాలు కారా సంస్థ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసే పిల్లలను దత్తత చేసుకునేందుకు గ్రామస్థాయి నుంచి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఐసిడిఎస్ శాఖ ద్వారా చర్యలు తీసుకుని అనాథ పిల్లలకు ఒక మంచి కుటుంబాన్ని అందించడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. పిల్లల దత్తత పద్ధతి దేశం మొత్తంపై కారా సంస్థ ద్వారానే ఆన్‌లైన్ ద్వారా జరుగుతుందన్నారు. 2012-13 సంవత్సరాల్లో 5వేల మంది, 2013-14 సంవత్సరాల్లో 4వేల మంది, 2014-15 సంవత్సరాల్లో 4వేల మంది, 2015-16 సంవత్సరాల్లో గణనీయంగా తగ్గి కేవలం 3వేల మంది మాత్రమే దత్తతకు ఆన్‌లైన్ నమోదు చేయడం జరిగిందన్నారు. పిల్లల దత్తత పై అన్ని జిల్లాల్లో తాము పర్యటించడం జరుగుతుందన్నారు. సంబంధిత సిబ్బందికి సూచనలు, ఆదేశాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. తొలుత కడప నగరం చిన్నచౌకు ప్రాంతంలోని కొండాయపల్లిలోని బాలసదనం కారా చైర్మన్ రామచంద్రారెడ్డి సందర్శించి అక్కడి పిల్లల క్షేమ సమాచారాన్ని డిసిపిఓ శివప్రసాద్ రెడ్డి ద్వారా అడిగి తెలుసుకున్నారు. అలాగే బాలసదనం అభివృద్ధికి కృషి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా ఎన్‌జిఓ ఆర్గనైజేషన్ కార్యదర్శి ఎం.శ్రీనివాసరెడ్డి, ఓఎస్‌డి డా.గాండ్లపల్లి శ్రీను, ఐసిడిఎస్ ఏపిఓ శ్రీదేవి, శిశుగృహ మేనేజర్ శారద, సిడబ్లుసి చైర్ పర్సన్ శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.