కడప

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మార్చి 22: రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం బడ్జెట్‌లో రూ.4500కోట్లు కేటాయించి ముస్లిమ్‌లు, క్రిస్టియన్లు, జైనులు తదితర మైనార్టీలను ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చేస్తోందని కలెక్టర్ కెవి సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని సభాభవన్‌లో జాతీయ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కు పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో ముస్లిమ్ కమ్యూనిటీని బాలలకు విద్యాహక్కు చట్టంపై అవగాహన కల్పించేందుకు ఒకరోజు సదస్సు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 46 నుండి 48 మదరసాలు రాష్ట్రప్రభుత్వ నిధులతో సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయని తక్కిన మదరసాలు కూడా వాటి పనితీరు మెరుగుపరచుకుంటే వారికి కూడా ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. జిల్లాలో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఉర్దూ మీడియం ప్రభుత్వపాఠశాలలు కూడా పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో 67శాతం అక్షరాస్యత ఉందని ఇంకా విద్యాపరంగా అభివృద్ధి చెందాలన్నారు. కడప జిల్లాలో 67శాతం అక్షరాస్యత ఉన్నా, బాలికలలో అక్షరాస్యత 53శాతం మాత్రమే ఉందన్నారు. ఇతర రాష్ట్రాల కంటే వృద్ధిరేటులో ఆంద్రప్రదేశ్ 11.5శాతం తో దేశంలోనే ప్రధమంగా ఉందని, వచ్చే ఏడాది 15శాతం వృద్ధి లక్ష్యంగా నిర్ణయించి, ఆ ఫలాలు అందుకోవడానికి ప్రతి ఒక్కరూ అక్షరాస్యులు కావాలన్నారు. కడప జిల్లాలోని మదరసాలలో సైన్స్‌ఫేర్ నిర్వహించామని తల్లిదండ్రులు పిల్లలకు చదువుపట్ల ఆసక్తి, సైన్స్‌పట్ల అవగాహన పెంచాలని సూచించారు. అలాగే రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ మనదేశంలో ముస్లిం మైనార్టీవర్గానికి చెందిన పిల్లలలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉందని, ఇందుకు ప్రధాన కారణం ముస్లిం కుటుంబాలలో పేదరికమే అన్నారు. విద్యాహక్కుల చట్టం 2009లో ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఉచిత నిర్బంద విద్య అందించాలని చట్టంపై కమిషన్ అవగాహన కల్పిస్తోందన్నారు. 6 నుంచి 14సంవత్సరాలు వరకు ఉన్న బాలలను తప్పనిసరిగా అక్షరాస్యులను చేసే విధంగా చట్టం ఏర్పడిందన్నారు. ఇంకా కార్యక్రమంలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిటి సభ్యులు ప్రియాంక్ కనూన్‌గో, అండమాన్ నికోబార్ ఐలాండ్‌కు చెందిన రుబీనా సిద్దిక్, జెసి -2 నాగేశ్వరరావు, జిల్లామైనార్టీశాఖ అధికారి ఖాదర్‌బాషా, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి వెంకటసుబ్బయ్య, మున్సిపల్ కమిషనర్ చంద్రవౌళీశ్వరరెడ్డి, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ లయబస్ ఆఫీసర్ చిట్టిబాబు తదితర అధికారులు బాలల హక్కులపై అవగాహన కల్పించారు. అనంతరం ఆరోగ్యరక్ష -అందరికి ఆరోగ్యం అనే పోస్టర్‌ను కలెక్టర్ సత్యనారాయణ ఆవిష్కరించారు.