కడప

ఆర్‌బిఐ నుంచి జిల్లాకు రూ.200 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేంపల్లె, మార్చి 22: వచ్చే వారంలో జిల్లాకు ఆర్‌బిఐ నుంచి రూ.200 కోట్లు డబ్బు రానున్నదని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు రీజనల్ మేనేజర్ రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో ఆయన విలేఖరులతో మాట్లాడారు. జిల్లాకు ఆర్‌బిఐ నుంచి రానున్న రూ.200 కోట్లతో కొంత మేర కరెన్సీ కష్టాలు తీరనున్నాయని తెలిపారు. తమ ఆంధ్రప్రగతిగ్రామీణ బ్యాంకు శాఖల ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉన్న బ్రాంచ్‌లతో పాటు మరో మూడు బ్రాంచ్‌లు నూతనంగా ప్రారంభించనున్నామని తెలిపారు. అలాగే ఇప్పటి వరకు ఉన్న 15 ఎటిఎంతోపాటు మరో 10 ఎటిఎంలను త్వరలో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. డిపాజిట్ రూపంలో రూ.1525 కోట్లు సేకరించామని తెలిపారు. అలాగే ప్రజలకు రూ.1445 కోట్ల వరకు అప్పులు ఇచ్చామన్నారు. రబీ సీజన్‌లో రూ.200 కోట్లు రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అలాగే ప్రస్తుతం ఉన్న నగదు కష్టాలను తీరేందుకు ఖాతాదారుల్లో నగదు రహితా లావాదేవీలపై తమ శాఖలు అవగాహన కల్పిస్తున్నాయని ఆయన తెలిపారు.
ఇందుకు సంబంధించిన ఎటిఎం, చెక్ బుక్కులను ఖాతాదారులను విరివిగా పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె మొయిన్ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ సుబ్బారెడ్డి, మేనేజర్ మంజూలా దేవి, బ్యాంకు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో
మిస్టర్ ఫిట్ జిమ్‌కు ప్రత్యేక స్థానం

కడప,(కల్చరల్)మార్చి 22: కడప జిల్లాలో మిస్టర్ ఫిట్ జిమ్‌కు ప్రత్యేకస్థానం ఉందని నగర మేయర్ కె.సురేష్‌బాబు అన్నారు. స్థానిక మిస్టిర్ ఫిట్ జిమ్‌లో బుధవారం మిస్టర్ ఫిట్ జిమ్‌కు చెందిన బాడీబిల్డర్లను ఆయన అభినందించారు. ఇటీవల కడప జిల్లా బాడీ బిల్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో రాణించి భీమవరంలో ఈనెల 26న జరిగే రాష్టస్థ్రాయి పోటీలకు ఎంపిక కావడం సంతోషకరమన్నారు. రాష్టస్థ్రాయి పోటీల్లో ప్రతిభ చూపి పతకాలతో తిరిగి రావాలని ఆయన ఆకాంక్షించారు. అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నూనె నగేష్, యూనుస్ బాషా, మిస్టర్ కడప 2017గా ఎంపికైన జాన్ జయంత్‌తోపాటు వివిధ క్యాటగిరిల్లో ప్రతిభ చూపిన రాష్టస్థ్రాయి పోటీలకు ఎంపికైన నరుూమ్, శ్రావణ్, రియాజ్‌లను మేయర్ పరిచయం చేసుకుని వారిని అభినందించారు.
కార్యక్రమంలో వైకాపా గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్, కడప నగర వైఎస్సార్ సిపి మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ షఫి, జిల్లా బాడి బిల్డర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ తాహీర్, జిమ్ ట్రైనర్లు విజయకుమార్, రాజు ప్యాండన్, సాయి కుమార్, జిమ్ సభ్యులు పాల్గొన్నారు.