కడప

కడపకు చేరకనే ఆగిన నీరు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాపాడు, మార్చి 25: కర్నూలు జిల్లాలోని బనకచర్ల నుంచి కడప జిల్లాలోని కడప చెరువుకు తాగునీటి కోసం కుందూనది ద్వారా అధికారులు నీటి సరఫరా చేసినప్పటికీ ఆ నీరు కడపకు చేరకనే ఆగిపోయింది. మార్చి మొదటివారంలో బనకచర్ల ప్రాజెక్టు నుంచి రోజుకు 400 క్యూసెక్కుల నీటిని కుందూనది ద్వారా విడుదలచేశారు. ఆ నీరు కడప చెరువుకు చేరాల్సి వుండగా 15రోజులైనా నీరు కడపకు చేరకుండానే ఆగిపోయింది. దీంతో నదీ తీరం వెంబడి గల పంటపొలాలకు సాగునీరు, తాగునీటి వనరులకు నీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. జిల్లాలోని పెద్దముడియం, రాజుపాళెం, దువ్వూరు, ప్రొద్దుటూరు, చాపాడు, ఖాజీపేట, వల్లూరు, కమలాపురం మండలాల పరిదిలోని వేలాది ఎకరాల పంటభూములకు సాగునీటి అవసరాలతోపాటు నదీ తీరం వెంబడి గల గ్రామాల్లో తాగునీటి వనరుల్లో నీరు పెంపొందే అవకాశముంది. అయితే నీరు సక్రమంగా సరఫరా కాక కడపకు చేరకుండానే మధ్యలో ఆగిపోవడంతో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంలో కెసికెనాల్, తెలుగుగంగ ప్రాజెక్టులతోపాటు మైలవరం జలాశయానికి కర్నూలుజిల్లా నుంచి ఏప్రిల్ చివరి వరకు నీటి సరఫరా అయ్యేది. గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఫిబ్రవరి వరకు నీటి సరఫరా కొనసాగి నిలిచిపోయింది. ఈ ఏడాది జనవరి 31వ తేదీనే జలాశయాలకు నీటి సరఫరా ఆగిపోవడంతో కుందూనదిలో నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోయింది. నదిలో అక్కడక్కడా ఉన్న గుంతల్లో కొద్దిమేరకు నీరు నిలిచినా ఆ నీరు వారం పదిరోజుల్లోనే ఇంకిపోవడం జరుగుతూ వస్తోంది. ఈ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం కర్నూలుజిల్లాలోని బనకచర్ల నుంచి కడప చెరువుకు తాగునీటి అవసరాల కోసం రోజుకు 400 క్యూసెక్కుల నీరు విడుదల చేసినా ఆ నీరు అనుకున్నమేరకు సరఫరా కాకుండానే ఆగిపోవడంతో ప్రజల్లో అలజడి నెలకొంది. వేసవికాలం ఆరంభంలోనే పరిస్థితులు ఈ విధంగా ఉంటే వచ్చే ఏప్రిల్, మే మాసాల్లో తాగునీటికి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతే కాకుండా జిల్లాలో వర్షాల జాడ లేకపోవడంతో ఇప్పట్లో వర్షాలు కురిసే సూచనలు కనిపించడం లేదు.
వాతావరణశాఖ అధికారుల సూచనల మేరకు మరో పదిరోజులపాటు వేసవి తాపం తీవ్రంగా ఉంటుందని, గత రెండురోజులుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరుకుందని, ఈ ఉష్ణోగ్రత 45,46 డిగ్రీల వరకు ఉండబోతోందని హెచ్చరికలతో రాబోవుకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నీటి ఎద్దడి ఏ విధంగా ఎదుర్కోవాలనే ఆలోచనలో ప్రజలు నిండా మునిగారు. ఏది ఏమైనా ఇలాంటి ఎండలు ఎప్పుడూ చూడలేదని ఈ ఎండలు ఇలాగే కొనసాగుతే రాబోవురోజుల్లో సాగునీరు దేవుడెరుగు తాగునీటికి అవస్థలు తప్పవని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.