కడప

వినియోగదారుల పరిరక్షణే ఫోరం ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(లీగల్)మార్చి 25: రాష్ట్రంలోని వస్తువుల సేవలను వినియోగించుకుని తద్వారా వారి యొక్క హక్కులను పరిరక్షించడమే ఫోరం ధ్యేయమని రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ జస్టిస్ నౌషద్ అలీ పేర్కొన్నారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి మద్యాహ్నం 2గంటలవరకు వినియోగదారుల ఫోరంలోని అన్ని గదులను కోర్టుహాల్‌ను, సిబ్బంది హాజరుపట్టి , కేసుల పూర్వాపరాలు వాటి పనితీరును జిల్లావ్యాప్తంగా ఎన్ని కేసులు నమోదు అవుతున్నాయని , అలాగే తీర్పులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1986లో వినియోగదారుల రక్షణ చట్టం ఏర్పడిందని, తద్వారా వినియోగదారులు వస్తువులు కొనుగోలు, ఇన్సురెన్స్ క్లైయిమ్‌లు, బ్యాంకు, బీమా లావాదేవీలు, విద్యుత్, గృహనిర్మాణం, వినోదం, రియల్ ఎస్టేట్, నకిలీ వస్తువులు పబ్లిక్, ప్రైవేట్ సంస్థల వల్ల సేవాలోపం నాసిరకం విత్తనాల కొనుగోళ్లు తదితర కేసులను పరిగణలోకి తీసుకుని వినియోగదారులకు న్యాయం చేస్తామని, అలాగే తెల్లరేషన్‌కార్డు ఉన్న వినియోగదారుడికి ఉచితంగా న్యాయసేవా అందించగలమని జిల్లా ఫోరం పరిధిలోకి రూ.లక్ష నుంచి రూ.20 లక్షల వరకు నష్టమున్న వినియోగదారులకు సేవలోపమున్న కేసులను దాఖలు చేసుకోవచ్చునని అలాగే రాష్ట్ర వినియోగదారుల ఫోరంలో రూ.కోటి వరకు వస్తువులోపం ఉన్న కేసులను దాఖలు చేసుకోవచ్చునని ఇలాంటి కేసులను మూడునెలలలోపు తీర్పు ఇవ్వడం జరుగుతుందని అలాగే ప్రతివాదులు అప్పీలు కోసం నెలలోపల చేసుకోవచ్చునని , అలాంటి సమయంలో జిల్లా ఫోరం ఇచ్చిన తీర్పులో నష్టపరిహారంలోని 50శాతం వరకు లేదా రూ.25వేలు చెల్లించి ప్రతివాదులు పైకోర్టుకు వెళ్లవచ్చునని , అలాగే సివిల్ కోర్టులో ఉన్నటువంటి వెసులుబాటులన్నీ ఈ ఫోరం పరిధిలో ఉన్నాయన్నారు. జడ్జివెంట జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు గున్నయ్య, మహిళా సభ్యురాలు శిరీషారెడ్డి, సిబ్బంది ఉన్నారు.

విధి నిర్వహణలో రాజీ వద్దు

కడప,మార్చి 25: విధినిర్వహణలో ఏ ఒక్కరిని లెక్కపెట్టకుండా శాంతిభద్రతలు కాపాడటంలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది ముందుండి నిబంధనల మేరకు పనిచేసి ప్రజల్లో మంచి పేరు తేవాలని రాయలసీమ ఐజి శ్రీ్ధర్‌రావు పిలుపునిచ్చారు. శనివారం ఆయన స్థానిక డిపిఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ ఐజికి కావాల్సినంత సమాచారం ఇచ్చి, రికార్డులు పరిశీలనకు సహకరించారు. జిల్లా ఎస్పీ అంటే జిల్లాలో పౌరుల్లోను, మేధావుల్లో, అధికార యంత్రాంగం, రాజకీయ నాయకుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇటీవల జరిగిన టీచర్స్, గ్రాడ్యుయేట్స్,స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలోను, కౌంటింగ్‌లోను ఎస్పీ రామకృష్ణ సమయస్పూర్తిగా వ్యవహరించి శాంతిభద్రతలు కాపాడి శభాష్ అనిపించుకున్నారు. ఆయనతోపాటు ఓఎస్‌డి సత్యయేసుబాబు, స్థానిక డిఎస్పీలు, సిఐలు ఎస్పీ రామకృష్ణను అనుసరించి రాయలసీమ జోన్ ఐజి తనిఖీల కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.