కడప

టెన్త్ సైన్స్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మార్చి 25: జిల్లాలో టెన్త్ ప్రశ్నాపత్రాలు ఏ విధంగా లీకు అవుతున్నాయోకానీ ఈ ఏడాది ప్రశ్నాపత్రాల లీకేజుపై పుకార్లు షికార్లు చేసి విద్యార్థుల తల్లిదండ్రులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. శనివారం జరిగిన టెన్త్ సైన్స్ పేపర్ -1 జిల్లాలోని బద్వేలు నుంచి వాట్సాఫ్ ద్వారా నెల్లూరు జిల్లాలో పలుప్రాంతాలకు చేరినట్లు పుకార్లు షికార్లు అయ్యాయి. జిల్లా విద్యాశాఖాధికారిణి శైలజ, నెల్లూరు జిల్లా విద్యాశాఖాధికారి, కడప ఆర్జెడి బి.ప్రతాప్‌రెడ్డిలు రంగంలో దిగి విచారణ చేపట్టారు. నెల్లూరు జిల్లా అధికారులు కడప జిల్లా వాట్సాఫ్ నుంచి పేపర్ పలువురికి అందిందని ఆరోపిస్తున్నారు. జిల్లాలో విద్యాశాఖాధికారులు మాత్రం జిల్లాలో ప్రశ్నాపత్రం వాట్సాఫ్ ద్వారా వెళ్లే ప్రసక్తేలేదని కేవలం నెల్లూరు జిల్లా అధికారులు కట్టుకథలు అల్లుతూ జిల్లాకు చెడ్డపేరు తెచ్చి విద్యార్థులను, తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నారు. మొత్తం మీద జిల్లాలో ఏ పరీక్ష తీసుకున్నా అధికారులకు కత్తిమీద సాము అని చెప్పవచ్చు. జిల్లాలో మేధావులు అధికంగా ఉండి అతి తెలివి ఉపయోగించి జిల్లాకు చెడ్డపేరు తేవడం షరామామూలుగా మారింది.

రోళ్లమడుగు నుండి సుండుపల్లెకు తాగునీరు
సుండుపల్లె, మార్చి 25: రోళ్లమడుగు జలాశయం నుండి సుండుపల్లె మండలానికి తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ కెవి సత్యనారాయణ తెలియజేశారు. శనివారం శాశ్వత మంచినీటి పథకం ఏర్పాటుకు సుండుపల్లెకు సమీపంలోని భైరాగిగుట్టలో భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ చేసిన హామీని నెరవేర్చి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో రోళ్లమడుగు నుండి మండలానికి శాశ్వత మంచినీటిని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మండల ప్రజల సమక్షంలో ఆయన మాట్లాడుతూ రూ.500 కోట్ల నిధులతో రోళ్లమడుగు నుండి శాశ్వత మంచినీటిని అందించే ఏర్పాట్లను చేయిస్తున్నట్లు చెప్పారు. మొదటి విడతగా మంజూరైన నిధులతో మండలానికి పైపులైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నీటి ఎద్దడి జిల్లాలో అధికంగా ఉందని ఇప్పటికే 32 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించామన్నారు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయని నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు. జిల్లాలో తాగు, సాగునీటి సమస్యలు లేకుండా చేసేందుకు ఇప్పటికే రూ.500 కోట్లతో నీరు-చెట్టు పనులు చేయిస్తున్నామని, 45 వేల పంట సంజీవని కుంటలు పూర్తయ్యాయని లక్ష కుంటల తవ్వకం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ విధంగా కుంటల తవ్వకం పూర్తయి వర్షాలు పడితే కుంటలు నిండి భూగర్భజలాలు మరిన్ని పెరుగుతాయని ప్రతి రైతు పొలాల దగ్గర గుంతలు తవ్వాలని తెలియజేశారు. ప్రజలు ప్రతి సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం, అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పట్టిసీమను అతి తక్కువ కాలంలో పూర్తి చేసి ముఖ్యమంత్రి చరిత్ర సృష్టించారని తెలిపారు. దీని వలన వివిధ ప్రాజెక్టుల ద్వారా 45 టీఎంసీల నీరు మన రాష్ట్రానికి వస్తుందన్నారు.
ఝరికోన నీటితో రైతులను
ఆదుకుంటాం: విప్ మేడా
ఝరికోన నుండి సుండుపల్లె మండలానికి కాలువలు ఏర్పాటు చేసి ఆ నీటితో రైతులను ఆదుకుంటానని విప్ మేడా మల్లిఖార్జునరెడ్డి తెలిపారు. మండలంలోని ఐదు వేల ఎకరాలకు నీటిని అందించి ప్రతి చెరువులో ఝరికోన నీటిని నిలువ చేస్తామన్నారు. తూతూమంత్రంగా ఆనాటి ముఖ్యమంత్రి పాలన సాగిందని అందుకు నిదర్శనంగా మండలంలోని బెస్తపల్లె బ్రిడ్జి, తిమ్మసముద్రం కాజ్‌వేలు అలాగే ఉండిపోయాయని ఆ పనులు సైతం టీడీపీ పాలనలో 80 శాతం పూర్తయ్యాయని తెలియజేశారు. అదే విధంగా ప్రజల నుండి వచ్చిన సుమారు 45 వినతిపత్రాలను కలెక్టర్ కెవి సత్యనారాయణ రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి, తహసిల్దార్ సుబ్రమణ్యంరెడ్డిలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అన్బురాజన్, మేడా విజయశేఖర్‌రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు రాజకుమార్‌రాజు, శివారెడ్డి, మహేశ్వర్‌రాజు, మహేష్‌నాయుడు, మహబూబ్‌బాష, శివరామిరెడ్డి, శివరామనాయుడు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆధునిక పద్ధతుల్లో
పంటలు సాగు చేయాలి

చింతకొమ్మదినె్న,మార్చి 25: రైతులు ఆధునిక పద్ధతుల్లో శాస్తవ్రేత్తల సూచనలు, సలహాల మేరకు పంటలు సాగుచేసి అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ ఠాగూర్ నాయక్ పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రంలో ‘పంటల ఉత్పాధకత పెంపునకు సాంకేతిక సూచనలు’ అనే అంశంపై ఖాజీపేట, చెన్నూరు రైతులకు, ఆదర్శరైతులకు, సర్పంచ్‌లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి జెడిఏ మాట్లాడుతూ శాస్తవ్రేత్తలు సూచనల మేరకు వ్యవసాయాన్ని రైతులు చేపట్టాలని ప్రభుత్వం రైతులకు అందించే సబ్సిడీ, వ్యవసాయ పనిముట్లు, వర్మీకంపోస్టు తదితర వాటిపై రైతుల్లో అవగాహన కలిగి వుండాలవన్నారు. రైతులకు సకాలంలో వర్షాలు రాకపోవడంతో పంటలు సక్రమంగా చేతికి అందక నష్టాలపాలౌతున్నారన్నారు. ప్రభుత్వం రైతులకు 90శాతం సబ్సిడీతో డ్రిప్ పద్ధతి ద్వారా నీటి అందించేందుకు తోడ్పాటు ఇస్తున్నారని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డా.వీరయ్య మాట్లాడుతూ తమ కేంద్రం ఆధ్వర్యంలో మహిళ రైతులకు ,జిల్లా పరిధిలోని రైతులకు పంటలపై శిక్షణ కార్యక్రమాలు నిరంతరం అందించడం జరుగుతుందన్నారు. డ్వాక్రా మహిళలకు కుట్టుశిక్షణ కార్యక్రమాలు , పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలు తయారుచేయడంపై శిక్షణ ఇవ్వడం జరిగిందని డాక్టర్ స్వర్ణలత తెలిపారు. వ్యవసాయ ప్రిన్సిపల్ డా.కరుణాసాగర్ మాట్లాడుతూ రైతులకు తమ కేంద్రం ద్వారా కొంతమందికి సబ్సిడీతో కూడిన విత్తనాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో వ్యవసాయశాస్తవ్రేత్తలు సునీల్‌కుమార్, రంజిత, రాములమ్మ, సర్పంచ్‌లు, అభ్యుదయ రైతులు, ఏడిఏలు, ఏఓలు, కడప డివిజనల్ ఏడిఏ నరసింహారెడ్డి, రైతులు పాల్గొన్నారు.
వైఎస్ జగన్
సీమ అభివృద్ధి నిరోధకుడు

నందలూరు, మార్చి 25:తెలుగుదేశం ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని చూస్తుంది వైకాపా అధ్యక్షులు వైఎస్ జగన్మోహనరెడ్డేనని, అందుకు ఆయన సీమ ప్రజలకు క్షమాపణ చెప్పాలని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి అన్నారు. శనివారం నందలూరుకు విచ్చేసిన ఆయన సౌమ్యనాథాలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన ట్రస్టులో విలేఖరులతో మాట్లాడుతూ కడప, కర్నూల్, అనంతపురం జిల్లాలకు తాగునీరు, సాగునీరు ఇవ్వాలనే ముఖ్య ఉద్ధేశ్యంతో సిఎం చంద్రబాబునాయుడు పట్టిసీమ ప్రాజెక్టు పనులు చేపడితే సీమ ప్రజల ఓట్లు గెలుచుకున్న జగన్ ఈ ప్రాజెక్టును అడ్డుకోవడం ప్రజలకు తీరని ద్రోహం చేయడమేనన్నారు. ఇది మరీ దారుణమన్నారు. సిఎం ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా దానిని విమర్శించి అడ్డుకోవడం జగన్ ప్రధాన లక్ష్యమని ఆయన విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికలో స్వంత చిన్నాయన ఓటమి చెందడంతో మతిభ్రమించి ఏదోదో మాట్లాడుతున్నాడన్నారు. సీఎం సీమ కేటాయించిన నిధులతో పట్టిసీమ పనులను త్వరితగతిన పూర్తి చేయడం లిమ్కా రికార్డులో నమోదు అయిందని అది సిఎం సామర్థ్యం, కార్యదక్షతకు నిదర్శనమన్నారు. ఓటుకు నోటు కేసులో బాబుకు సంబంధం లేకున్నా అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. సీమ ద్రోహిగా మారిన జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే చరిత్రహీనుడుగా మిగులుతాడని ఆయన అన్నారు. సమావేశంలో ఆర్టీసీ రీజనల్ మాజీ చైర్మన్ యెద్దల సుబ్బరాయుడు పాల్గొన్నారు.

చెక్కు చెదరని రాతి కట్టడాలు..!

రాజుపాళెం, మార్చి 25: చెక్కు చెదరని రాతి కట్టడాలు నాటి కాలంలోని సంస్కృతి, సంప్రదాయాలకు సజీవ సాక్ష్యాలు నిలుస్తున్నాయని చెప్పవచ్చు. బ్రిటీష్ కాలంలో నిర్మించిన కట్టడాలు పటిష్టంగా ఉండి ఇప్పటికీ విడుకలో ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా జిల్లా పరిధిలో పంటలకు సాగునీరందించే కెసికెనాల్ ప్రధాన కాలువ బ్రిటీష్ వారి హయాంలో వాణిజ్య పరంగా కూడా ఉపయోగపడేదని పెద్దలు చెబుతున్నారు. ఈ కాలువ ద్వారానే బ్రిటీష్ అధికారులు రాకపోకలు సాగించేవారని తెలుస్తోంది. అప్పట్లోనే రాజోలి ఆనకట్ట వద్ద పడవలు నిలుపుకొనేందుకు లంగర్‌హౌస్‌ను రాతితో నిర్మించారు. కట్ట పక్కనే్న విశ్రాంతి భవనం కూడా నిర్మించారు. కుందూనదిలో కాలువలోకి వెళ్లి నీరు తెచ్చుకొనేందుకు ఇబ్బందిగా వుంటుందనే ఉద్దేశ్యంతో విశ్రాంతి భవనం పక్కనే్న బావిని కూడా తవ్వించారు. ఇప్పటికీ ఆ కట్టడాలు చెక్కుచెదరకుండా నిలిచివున్నాయి. అప్పట్లో జలమార్గం గుండానే ప్రయాణించేవారని, రాజోలి కట్ట వద్ద ఈ లంగర్‌హౌస్ సజీవసాక్షంగా నిలిచివుంది. కుందూనదికి అడ్డంగా రాజోలి వద్ద ఆనకట్ట నిర్మించి అక్కడి నుంచి తవ్విన కాలువలో పడవల ద్వారా ప్రయాణించేవారు. రవాణా సరుకులతోపాటు కాలువ స్థితిగతులను తెలుసుకొనేందుకు కూడా పడవలతోనే వెళ్లేవారని తెలుస్తోంది. ఇక్కడి నుంచి గ్రామాలకు కూడా వెళ్లేందుకు పడవ సాయమే తీసుకొనేవారని పలువురు వృద్ధులు చెబుతున్నారు. రవాణా మార్గం లేని రోజుల్లో జల మార్గానే్న ఎన్నుకొనేవారు. లంగర్‌హౌస్‌ను ఎత్తుగా రాతి గోడలు నిర్మించి గోడలకు ఇరువైపులా ఇనుపచువ్వలు బిగించి నీటిలో పడవలు పక్కకు వెళ్లకుండా లంగర్‌హౌస్‌ను నిర్మించారు. ఒక్క రాయి కూడా ఊడకుండా చరిత్రకు సజీవ సాక్షంగా నిలిచివుంది. అప్పట్లో నిర్మించిన ఈ కట్టడాలు ఎంతో పటిష్టంగా నిర్మాణం చేపట్టడంపై బ్రిటీష్ అధికారులు నాణ్యతా పనుల వైపే మొగ్గు చూపేవారని తెలుస్తోంది. కుందూకు అడ్డంగా రాజోలి వద్ద బ్రిటీష్ హయాంలోనే ఆనకట్ట నిర్మించి అక్కడి నుంచి కాలువను ఏర్పాటుచేశారు. ఇక్కడి నుంచి నీటిని వదిలేందుకు, వాణిజ్యపరంగా సరుకులు రవాణా చేసేందుకు రాజోలి ఆనకట్ట వద్ద నిర్మించిన లంగర్‌హైస్ వద్ద పడవలు నిలిపివేసి పక్కనే వున్న విశ్రాంతి భవనంలో కొద్దిరోజులు బస చేసేందుకు వీలుగా ఏర్పాట్లు ఉన్నాయి. ఇలాంటి బ్రిటీష్ కట్టడాలు జిల్లాలో అక్కడక్కడా కనిపిస్తాయి. ఇప్పటికీ ఆ నిర్మాణాలు చెక్కుచెదరకుండా ఉండి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పవచ్చు.

రైతుల పెట్టుబడి రాయితీకి సర్కారు పాతర..

కమలాపురం, మార్చి 25: జిల్లాలో 2013-14 సంవత్సరానికి గాను రైతులకు రావాల్సిన పెట్టుబడిరాయితీ మంజూరు చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తోందని జిల్లా వైసిపి రైతు విభాగం కన్వీనర్ పుత్తా ప్రసాదరెడ్డి విమర్శించారు. ఆయన శనివారం విలేఖర్లతో మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం నుంచి వచ్చిన పెట్టుబడి రాయితీ రైతుల కివ్వకుండా దారి మళ్లించిందని ఈ విషయంపై అసెంబ్లీలో నిలదీస్తున్నారు. తమ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డిపై ఎదురుదాడికి తిరుగుతోందని తెలుగుదేశం ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 213-14నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వం చెల్లించాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ స్వల్పమేనని అన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీపై ప్రభుత్వం తప్పుడుప్రకటనలు చేస్తూ రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని రైతులకు 3340కోట్లు బకాయి పడిందని జిల్లాలో బుడ్డశనగ రైతులకు సంబందించి 20063మంది రైతులకు గాను 161కోట్ల రూపాయలు రావాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు ఇన్‌పుట్ సబ్సిడీ 218కోట్ల రూపాయలు రావాల్సి ఉందని ఉద్యానవన రైతులకు పెట్టుబడి రాయితీ 16కోట్ల రూపాయలు రావాల్సి ఉందని చెప్పారు. ఐతే ఈ డబ్బులు మంజూరు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. అంతేకాక జిల్లాలో గిట్టుబాటుధరలు లేక పసుపు, ఉల్లి, చామంతి, నువ్యుల రైతులు విలవిలలాడుతున్నారన్నారు. ఈ విషయంపై చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామి ధరల స్థిరీకరణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రైతులను పట్టించుకోని ఏ ప్రభుత్వాలకైనా పుట్టగతులుండవన్నారు. శాసనమండలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమమార్గంలో ప్రజాప్రతినిధులను కొని, గెలుపును గొప్పగా చెప్పుకున్న టిడిపి ప్రభుత్వానికి విద్యావంతులు పట్ట్భద్రుల ఎన్నికల్లో తగిన బుధ్ది చెప్పారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటిసిలు, వీరారెడ్డి, సురేశ్, రాజగోపాలరెడ్డి పాల్గొన్నారు.