కడప

భూసేకరణలో జాప్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మార్చి 25: జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణాలకు భూ సేకరణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. భూ సేకరణలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు. అటవీశాఖ అనుమతులు వచ్చినా మరో 10వేల ఎకరాలు భూ సేకరణ చేయాల్సివుంది. జలయజ్ఞం కింద ఎంతో అట్టహాసంగా ప్రవేశపెట్టిన ప్రాజెక్టుల నిర్మాణాలకు 42వ ప్యాకేజి పనులు కొనసాగుతున్నాయి. 26 ప్యాకేజిలకు అటవీశాఖ అనుమతులు ఇచ్చింది. మిగిలిన వాటికి అనుమతులు ఇవ్వడానికి రాష్ట్రప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి సర్వం సిద్ధం చేసింది. ఇప్పటివరకు గాలేరు-నగరి, సుజల స్రవంతి పథకం ,వామికొండ జలాశయం, పులివెందుల బ్రాంచి కాలువ, జిఎన్‌ఎస్‌ఎస్ రెండవ దశ, వత్తలూరు జలాశయం, లింగాల కుడికాలువ, తెలుగుగంగ -2, తెలుగుగంగ -3, గండికోట ఎత్తిపోతల పథకం, జికెఎల్‌ఐ 1,2,3, సిబిఆర్ 1,2 తరహాలో ప్రాజెక్టుల నిర్మాణాలకు దాదాపు 58200 ఎకరాలు భూసేకరణ అవసరం ఉంది. ప్రభుత్వం సేకరించింది 49వేల ఎకరాలు పైబడివుంది. మరో 10వేల ఎకరాలు భూసేకరణ చేయాల్సివుంది. కేవలం కొంతమంది నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం అభివృద్ధి పనులు ముందుకు సాగనివ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే జలయజ్ఞానికి పెద్దపీట వేసి అట్టహాసంగా జిల్లాలో ప్రాజెక్టులకు ఇబ్బడి ముబ్బడిగా పునాదిరాళ్లు వేశారు. అయితే కొంతమంది కాంట్రాక్టర్లు, అప్పట్లో అధికారపార్టీ నేతలు, కొంతమంది అధికారులు వందలకోట్లరూపాయల్లో ప్రభుత్వ నిధులు ధనయజ్ఞంగా మార్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో 42 ప్యాకేజిల కింద రూ.5881కోట్లు పైబడి కేటాయింపులు జరగ్గా ఇప్పటివరకు రూ.440కోట్లు ఖర్చుపెట్టారు. మరో రూ.11కోట్లు పైబడి నిధులు అవసరం ఉంది. జిఎన్‌ఎస్‌ఎస్ 2వ ఫేస్‌కింద జిల్లాలో లక్షా 20వేల ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 1500 ఎకరాలు, చిత్తూరు లక్షా 3500 ఎకరాలు ఈపథకం కింద భూ సేకరణ చేయాల్సివుం డగా వత్తలూరు జలాశయం, గంగనపల్లి తదితర ప్రాంతాలతోపాటు అటవీశాఖల భూములకు అనుమతులు రావాల్సివుంది. అటవీశాఖ నుంచి పలు అనుమతులు లభించినా స్థానికంగా రైతులు అరకొర భూములను ప్రాజెక్టునిర్మాణాలకు ఇవ్వాల్సివుండగా ససేమిరా అంటున్నారు. అధికారపార్టీ నేతలు పొలాలు వేగవంతంగా సేకరించాలని అధికారులపై వత్తిడి తెస్తుంటే ప్రతిపక్షపార్టీ నేతలు రైతులను పొలాలు ఇవ్వరాదని రెచ్చగొడుతున్నట్లు తెలుస్తోంది. పలువురు కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు కుమ్మక్కై పనులు ముందుకు సాగనివ్వకుండా జాప్యం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన పనులు దశాబ్దాల కాలమైన నత్తనడక కారణంగా నిర్మాణానికి నోచుకోలేదు. ప్రభుత్వం ఈ ఏడాది రూ.700 కోట్లు పైబడి నిధులు కేటాయించింది. కేంద్రం త్వరలో మరో వెయ్యికోట్లరూపాయలు జిల్లాకు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద భూ సేకరణ ప్రక్రియ అధికారులకు ప్రహసనంగా మారి, ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయ్యే వరకు అనుమానమేనని ప్రత్యక్షంగా ఇంజనీర్లు అంటున్నారు. ఇప్పటికైనా రైతుల నుంచి భూసేకరణకు అధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
టిడిపి నేతల
నిర్లక్ష్యంతోనే ఓడాం..

కడప,మార్చి 25: జిల్లాలో తెలుగుదేశంపార్టీకి చెందిన అగ్రనేతలు, నియోజకవర్గ నేతలు ఎన్నికల్లో అంకితభావంతో పనిచేయని కారణంగా తాము ఓటమికి గురికావాల్సివచ్చిందని గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు కెజె రెడ్డి, బచ్చల పుల్లయ్యలు అధిష్టానానికి ఫిర్యాదుచేసినట్లు తెలిసింది. తాము పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తు పార్టీ కష్టకాలంలో ఉన్నా తాము పార్టీని నమ్ముకుని ఉన్నామన్నారు. సొంత పార్టీనేతల్లో కొంతమంది వ్యవహరమే తమ ఓటమికి కారణమని హైకమాండ్ వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. జిల్లాలోని పలువురు నేతలు కేవలం తమకు రావాల్సిన నిధులు ముట్టచెబితే గెలిపిస్తామని ఏ ఒక్కరు ఆందోళన చెందాల్సిన పనిలేదని నమ్మబలికారని దీంతో తాము కొంతమేరకు నిధులు కూడా సమకూర్చామన్నారు. కేవలం పనిగట్టుకుని తమ ప్రత్యర్థులను గెలిపించి తమ పరువును తీశారని వారు అధిష్ఠానానికి ఫిర్యాదుచేసినట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి బిటెక్వ్రి గెలుపుతో జిల్లాకు ఒరిగింది ఏమీలేదని, కేవలం స్థానిక సంస్థల ఓటర్లకంటే గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఓటర్లు పార్టీపై భారీగా ప్రభావం చూపిస్తుందని, దీనిపైనే పార్టీ రాజకీయ భవిష్యత్ ఉంటుందని పలువురు రాజకీయ పరిశీలకులు కూడా వ్యాఖ్యానిస్తున్నట్లు ఫిర్యాదుచేసినట్లు తెలిసింది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపులో టిడిపి అభ్యర్థి రెండవ స్థానానికి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మూడవస్థానం చేరుకోవడంపై తెలుగుదేశంపార్టీలోని సీనియర్ నేతలు, పార్టీని అంటిపెట్టుకున్న నేతలంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తు సమాలోచనలో పడ్డారు. కొంతమంది జిల్లాకు చెందిన నేతలు గ్రాడ్యుయేట్స్, టీచర్స్ అభ్యర్థులను ప్రత్యర్థులతో చేతులుకలిపి లక్షలాది రూపాయలు దోపిడీ చేసుకుని తమను ఓటమికి గురిచేసినట్లు ఆరోపించారు. ఏది ఏమైనా 2019 ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ బాబులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పేదలకు మెరుగైన వైద్యం
ప్రభుత్వ లక్ష్యం

సుండుపల్లె, మార్చి 25: పేదలకు మెరుగైన వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాజంపేట శాసనసభ్యులు, విప్ మేడా మల్లిఖార్జునరెడ్డి తెలిపారు. అనంతరం సుండుపల్లె వైద్యశాల డెవలప్‌మెంట్ సొసైటీ ఛైర్మన్‌గా మండల టీడీపీ నాయకుడు శివరామిరెడ్డిని నియమించారు. మండల ప్రజల ఆరోగ్యాన్ని వైద్యశాల అభివృద్ధికి కృషి చేయాలని తెలియజేశారు. అదే విధంగా స్థానికులు తెలిపిన వినతుల మేరకు వైద్యశాలలో మహిళా వైద్యురాలిని నియమించేందుకు 24 గంటలు వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వేలకు వేల రూపాయలు తీసుకొని ప్రజలకు సరైన వైద్య వసతులు కల్పించకపోగా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రభుత్వ వైద్యశాలల్లో అన్ని రకాల వసతులతో పాటు మెరుగైన వైద్యం అందిస్తున్నా ప్రజలు ప్రభుత్వ వైద్యం పొందడం లేదని తెలియజేశారు. ప్రభుత్వం అన్ని వసతులు సమకూర్చి పేదల ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేస్తున్నదన్నారు. తక్కువ ఖర్చుతో కూడిన మందులను జనరిక్ ఆసుపత్రులలో అందిస్తున్నారని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసుపత్రికి వైద్యులు సమయపాలన పాటించి రోగులు ఇక్కడే వైద్యం పొందేలా చర్యలు చేపట్టాలని డాక్టర్లను ఆదేశించారు. అదే విధంగా కమిటీ సభ్యులుగా రవీంద్ర, వెంకటేశ్వర్లునాయుడు, నసీమాలను నియమించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజకుమార్‌రాజు, మేడా విజయశేఖర్‌రెడ్డి, మహేశ్వర్‌రాజు, సింగిల్ విండో అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, గ్రామ అధ్యక్షుడు రమణ, చంద్రశేఖర్‌రాజు, వెంకటరమణరాజు, డాక్టర్ భానుమతి తదితరులు పాల్గొన్నారు.