కడప

కోదండరామయ్య కల్యాణానికి భారీ ఏర్పాట్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఏప్రిల్ 4: జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామచంద్రునికి మూడవ ఏట ప్రభుత్వ, టిటిడి లాంఛనాలతో రామయ్య కల్యాణం ఈనెల 10న భారీ ఏర్పాట్లమధ్య జరగనుంది. ఒంటిమిట్ట దేవాలయం ఇటు తిరుమల తిరుపతి దేవస్థానంతోనూ, భారత ప్రభుత్వ ఆర్కాలజిశాఖ పరిధిలోకి రావడంతో ఆలయ అభివృద్ధికి టిటిడి ఇప్పటి వరకు అభివృద్ధికోసం రూ.14కోట్లు ఖర్చు చేసింది. భారత పురావస్తుశాఖ పరిధిలో ఉండటంతో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా ఆశాఖ అనుమతి తప్పనిసరి. ఈ నేపధ్యంలో టిటిడి ఇఓ డా.బి.సాంబశివరావు సోమవారం ఢిల్లీలో సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి చర్చించి కావాల్సిన అనుమతులు పొందినట్లు తెలిసింది. ఈ నేపధ్యంలో ఈనెల 10న కోదండరామచంద్ర కల్యాణోత్సవానికి ప్రభుత్వలాంఛనాలతో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడులు అధికారికంగా హాజరౌతున్నారు. కోదండరామ బ్రహ్మోత్సవాలకు రూ.5కోట్లు పైబడి టిటిడి ఖర్చు చేయనుంది. కల్యాణోత్సవం సందర్భంగా ముగ్గురు ఐపిఎస్ అధికారులు, ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం ప్రత్యేక దృష్టిపెట్టారు. కలెక్టర్ కెవి సత్యనారాయణ ఆన్ని శాఖల ఉన్నతాధికారులకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది తరహాలోనే సువిశాల ప్రాంతంలో సీతారామచంద్రుల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించేందుకు కల్యాణ వేదిక నిర్మాణం పూర్తికావస్తోంది. వేసవిలో ఎండలు ముదరడంతో టిటిడిచే మజ్జిగ, తాగునీరు గతంలో కంటే ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే భక్తులకు కల్యాణం సందర్భంగా పెద్ద ఎత్తున అక్షింతలు సిద్ధం చేస్తున్నారు. ప్రతి భక్తుడికి ప్రసాదాలు పంపిణీ చేసేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు. ఈ నేపధ్యంలో ఐదు లక్షల పైబడి లడ్డులను తిరుమలలో ప్రత్యేకించి తయారుచేస్తున్నట్లు తెలిసింది. ఈ ఉత్సవాలు భద్రాచలంలో ఏ తరహాలో నిర్వహిస్తారో ఆ తరహాలో ఒంటిమిట్ట రామయ్య కల్యాణాన్ని ఘనంగా నిర్వహించేందుకు గతంలో జరిగిన రెండు సీతారాముల కల్యాణోత్సవాలకంటే రెట్టింపులో ఈ కల్యాణ మహోత్సం నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.