కడప

ఎపిఎండిసి సంస్థ దౌర్జన్యం ఆపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓబులవారిపల్లె, ఏప్రిల్ 15:మంగంపేట ఎపిఎండిసి సంస్థ దౌర్జన్యం ఆపాలని, డేంజర్‌జోన్‌లో ఉన్న కాపుపల్లె, హరిజన, అరుంధతీ వాడల ప్రజలకు అన్ని విధాల న్యాయం చేకూర్చాలని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగంపేట సమస్యలపై న్యాయం చేకూర్చాలని శనివారం కలెక్టర్‌కు అర్జీ అందజేసినట్లు ఆయన చెప్పారు. మంగంపేటలో సంస్థ ఏర్పడినప్పటి నుండి తమ పంట పొలాలను సంస్థ అభివృద్ధి కోసం అప్పగించిన ప్రజలు పడుతున్న ఇక్కట్లను గుర్తించడం లేదన్నారు. విడత వారిగా భూములు స్వాధీనం చేసుకొంటున్నారే కాని పరిహరం చెల్లించడం లేదన్నారు. సర్వేనెంబర్ 46/2 కాపుపల్లెలో 180 ఇళ్లు, 700 మంది జనాభా, హరిజన, అరుంధతీవాడలో 250 ఇళ్లు, వెయ్యి మంది జనాభా కలరని, వీరికి సంస్థ నుండి ఎలాంటి సదుపాయాలు కల్పించలేదని, వౌలిక సదుపాయాలు కల్పించ లేదన్నారు. నిత్యం మైనింగ్ బ్లాస్టింగ్‌తో శబ్ద కాలుష్యంతో గృహాలు బీటలు బారాయని, గ్రామాల్లో వింత వ్యాధులతో ప్రజలు సతమతమవుతున్నారని, పరిహారం చెల్లించకుండానే భూములను రెవెన్యూ సర్వే చేయించి తీసుకోవడం జరుగుతుందన్నారు. రెవెన్యూ అధికారులు న్యాయ విచారణ జరిపి భూములు కొనుగోలు చేయాలని, ప్రభుత్వ భూములని తీసుకోవడం ఎంత వరకు సమంజసమన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్‌లు ఇవ్వలేదన్నారు. విద్యార్థులకు ఉన్న పాఠశాలను తీసేశారని, రహదారుల సౌకర్యం పూర్తిగా లేవన్నారు. ప్రజల సమస్యలపై న్యాయం చేకూర్చాలని ఆయన కోరారు. లేకుంటే ప్రజల పక్షాన పోరాటాలు జరుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి, రమణారెడ్డి, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి పనుల అవకతవకలపై విచారణ

కమలాపురం, ఏఫ్రిల్ 15: 2016-17 సంవత్సరానికి గాను మండలంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో ప్రజల నుంచి వచ్చిన ఆరోపణల్లో అవకతవకలు జరిగినట్లు రుజువైతే శాఖాపరమైన చర్యలు తప్పవని డిఆర్‌డిఏ అడిషనల్ పిడి గోపినాయక్ హెచ్చరించారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ అవరణలో సామాజిక తనిఖీఖి అనంతరం ఓపెన్‌ఫోరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎంపిపి సులేఖ మాట్లాడుతూ ఈ ఏడాది వేసవిలో ఎండలు తీవ్రంగా మండిపోతుండడం వల్ల ఉపాధి కూలీల సమయాన్ని కుదించడమే కాక వారికి నీడ కల్పించడం, పండ్లరసాన్ని, మజ్జిగను అందచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. స్టేట్ రీసోర్స్‌పర్సన్ వేంకటేశ్వరనాయక్ మాట్లాడుతూ మండలంలో ఈ ఏడాది 19పంచాయతీల్లో రూ.4.30కోట్ల వ్యయంతో 2వేల పనులకు పైగా ఇంకుడుగుంతలు, వర్మీకంపోస్టు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పండ్లతోటల పెంపకాలు చేపట్టినట్లు చెప్పారు. వీటిపై గత 10రోజులుగా తమ సామాజిక బృందం డిఆర్‌పిల పర్యవేక్షణలో తనిఖిలు చేపట్టినట్లు చెప్పారు. కాగా పందిళ్లపల్లె, యర్రగుడిపాడు గ్రామాల్లో జరిగిన ఉపాధిపనుల్లో అవకతకవలు జరిగినట్లు అధికారపక్షానికి చెందిన కొందరు సభలో ఫిర్యాదు చేశారు. వీటిపై విచారించి అవసరమైతే బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. కాగా ఇదే విషయానికి సంబంధించి ఆ గ్రామస్థులు ఓపెన్‌ఫోరం బయట గ్రామ ప్రజాప్రతినిధి భర్తతో వాగ్వివాదానికి దిగారు. దీంతో కొందరు జోక్యం చేసుకుని పరిస్థితి సరిదిద్దారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఎంపిడివో త్రిమూర్తిరెడ్డి, ఏపిడి గరుడాచలం పాల్గొన్నారు.