కడప

అమ్మ ఒడి... ప్రభుత్వ బడి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మలమడుగు, ఏప్రిల్ 15: సర్వ శిక్షాఅభియాన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు ప్రభుత్వ అధికారులు ప్రత్యేక కార్యాచరణ అమలుకు శ్రీకారం చుట్టారు. ఐదేళ్లు నిండిన బాలబాలికలకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి సర్కారు బడుల్లో చేర్పించేందుకు 3అమ్మ ఒడి... ప్రభుత్వ ఒడి2 పేరుతో ప్రత్యేక కార్యక్రమం రూపొందించారు. ఈ మేరకు సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర పథక సంచాలకులు ఆదేశాలు శ్రీనివాసులు జారీ చేశారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా శనివారం నుండి అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభం అయింది. కార్పొరేట్ మోజులో పడి మోసపోతున్న అమాయక మధ్యతరగతి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక అమ్మ ఒడి ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. గత ఏడాది సెలవుల తరువాత బడిబాట పేరుతో విద్యాసంవత్సరం ముందుగానే విద్యార్థులకు ప్రవేశ దరఖాస్తులు ఇచ్చి పాఠశాలల్లో చేర్పించారు.
* అంగన్‌వాడీ, స్వచ్చంధ సంస్థల సహకారంతో:
అంగన్‌వాడీ కార్యకర్తలు, ఎఎన్‌ఎంలు, పూర్వవిద్యార్థులు, స్వచ్చంధ సంస్థలు, ప్రభుత్వ బడుల్లో చదివి ఉన్నత స్థానాల్లో నిలబడిన వారి సహాయ సహకారాలతో ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాల గురించి వివరించి విద్యార్థులను ఆకర్షించాలన్నది ప్రభుత్వ యోచన.
* అమ్మ ఒడి షెడ్యూలు ఇలా...
ఈ నెల 15వ తేదీన అంగన్‌వాడీ కార్యకర్తల నుండి ఐదేళ్లు నిండిన చిన్నారుల వివరాలను సేకరించడం, ప్రస్తుతం చదువుతున్న వారి సాయంతో వారి చిరునామాలు తెలుసుకోవడం. 17వ తేదీన పాఠశాల యాజమాన్య కమిటి, తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి, ఐదేళ్లు నిండిన చిన్నారుల తల్లిదండ్రులను ప్రత్యేకంగా ఆహ్వానించడం. ప్రభుత్వ బడుల్లో చదివి ఉన్నత స్థాయిలో ఉన్నవారితో ముఖాముఖి, ప్రభుత్వ బడుల ప్రయోజనాలైన ఉచిత విద్య, పుస్తకాలు, లాబ్, గ్రంథాలయం, ఉచిత ఏకరూప దుస్తులు, ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో సమాంతరంగా ఆంగ్లమాధ్యమ బోధనలు, ఆరోగ్యం, నైతిక, భవిత విద్య, ప్రతిభావంతులకు ఉపకార వేతనాలు, ప్రతిభా అవార్డులు, ఒత్తిడి లేని విధంగా విద్యను అభ్యసించడం వంటి ప్రయోజనాల గురించి సమావేశాల్లో తెలియజేస్తారు. 18నుండి 20వ తేదీ వరకు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించడం, ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి పిల్లాడి ఇంటికి వెళ్లి వారిని అభినందించి ప్రవేశ దరఖాస్తులు ఇవ్వడం, తక్షణ ప్రవేశాలు కల్పించి పాఠశాలల్లో చేర్పించే విధంగా అమ్మ ఒడి... ప్రభుత్వ బడి కార్యక్రమాన్ని చేపట్టారు.
మంచి ఫలితాల కోసం
ప్రతి ఒక్కరూ కృషిచేయాలి
- కె.చిన్నయ్య, ఎంఈవో, జమ్మలమడుగు
ప్రాథమిక విద్య కోసం ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వ బడుల్లో కల్పించే సౌకర్యాలను విధిగా వివరించడం, పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించడం 3 అమ్మ ఒడి... ప్రభుత్వ బడి 1 ప్రధాన ఉద్దేశ్యం. మంచి ఫలితాల సాధనకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలి.

గరికపాటికి సన్మానం
కమలాపురం, ఏప్రిల్ 15: ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన బ్రహ్మ గరికపాటి నరసింహారావును శనివారం మోక్షనారాయణ స్వామి ఆలయ వ్యవస్థాపకుడు కాశీభట్ల సాయినాధశర్మ శనివారం ఘనంగా సన్మానించారు. ఆయనతో పాటు మానసాపీఠ వ్యవస్థాపకుడు గిరిస్వామి, ట్రస్ట్‌సభ్యులు శివరామశర్మ, మాధవీలత, వెంకటేశ్వరరెడ్డి, జిల్లా శివసేనపార్టీ ఉపాధ్యక్షుడు ప్రవీణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామాపురం పుణ్యక్షేత్ర విశిష్టతను వివరించడమే కాక ఇందుకు సంబందించిన పుస్తకాలను ఆయనకు బహుకరించారు. ఆయనకు ఈ సందర్భంగా దుశ్శాలువ కప్పి పూలమాలలతో,జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.