కడప

సజావుగా జడ్పీ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఏప్రిల్ 15: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజల సమస్యలపై పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు సమావేశానికి గైర్హాజరుకావడంతో 10వ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చప్పిడిగా కొనసాగింది. శనివారం సమావేశంలో వేసవికాలం ఆరంభమై నెలగడుస్తున్నా మంచినీటి సమస్యతో ప్రజలు అల్లాడుతుంటే ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుగాక పోవడంతోప్రజలపై ఎమ్మెల్యేలకు ఎంతప్రేమ ఉందో తేటతెల్లవౌతోంది. జడ్పీ చైర్మన్ గూడూరు రవి అధ్యక్షతన జరిగిన సమావేశానికి కలెక్టర్ కెవి సత్యనారాయణతోపాటు ఇన్‌చార్జ్ సిఇఓ శే్వతతెవతియ హాజరై సభను ప్రారంభించారు. తొలుత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ సభ్యులను సభకు పరిచయం చేసుకుని అనంతరం సభను ప్రారంభించారు. అనంతరం రాష్టమ్రార్కెటింగ్, పశుసంవర్థక, డైరీ డెవలప్‌మెంట్, మత్స్యసహకార శాఖ మంత్రి సి.ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ స్థాయి విద్యాప్రమాణాలు జిల్లాలో పెంచేందుకు విద్యాశాఖాధికారులు కృషి చేయాలని, గత రెండు సంవత్సలుగా 10వ తరగతిలో రాష్టస్థ్రాయిలో మొదటి స్థానం కైవసం చేసుకున్న జిల్లా ఇంటర్మీడియట్ విద్యలో కూడా ముందంజలో ఉండాలన్నారు. జిల్లాలో తాగునీటి సమస్య ఉన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని సూచించారు. ప్రభుత్వం తాగునీటి సమస్య నివారించేందుకు నిధులు కేటాయింపులో అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కాగా మంత్రి సభకు మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో ఆలస్యంగా సభకు హాజరయ్యారు. అలాగే జడ్పీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా జిల్లా పరిషత్‌కు రాష్ట్రప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని, జివో నెం.129 ప్రకారం ఎన్‌ఆర్‌జిఎస్ నిధులను జడ్పీకి మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరగా కలెక్టర్ రెజ్యులేషన్ పాస్ చేయాలన్నారు. అనంతరం ఓడిపోయిన ప్రజాప్రతినిధులకు ఎన్‌ఆర్‌జిఎస్ నిధులను ఏ అంశం పరిగణలోకి తీసుకుని మంజూరు చేశారో సంబంధిత అధికారి సమాధానం ఇవ్వాలని వైస్ చైర్మన్ సభ దృష్టికి తెచ్చారు. అలాగే ఒంటిమిట్టలోని పిహెచ్‌సిలో ఆసుపత్రి కమిటీ చైర్మన్‌కు ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటుచేశారా అని సభ దృష్టికి తేగా డిఎంహెచ్‌ఓ రామిరెడ్డి కమిటీ చైర్మన్‌కు అలాంటి వసతులు కల్పించలేదని అధికారులు సమావేశం ఏర్పాటుచేసుకునేందుకు, జిల్లా అధికారులు వచ్చినప్పుడు సిబ్బందితో సమస్యను పరిష్కరించుకునేందుకు మాత్రమే రూమ్‌లాంటిది ఏర్పాటు చేశామన్నారు. కానీ కమిటీ చైర్మన్ టిడిపి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని వైస్ చైర్మన్ కలెక్టర్‌కు తెలపగా కలెక్టర్ తక్షణమే ఆ గదికి తాళం వేసి ఆసుపత్రి అధికారులకు మాత్రమే తెరచుకునే అధికారం కల్పించాలని డిఎంహెచ్‌ఓకు ఆదేశించారు. నూతనంగా ఎన్నికైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తినరసింహారెడ్డి సుండుపల్లె ప్రభుత్వాసుపత్రిని 30పడకల ఆసుపత్రిగా మార్చాలని, ఇక్కడి నుంచి ప్రజలు రాయచోటికి, పీలేరుకు వెళ్ళాలంటే 40కి.మీ.దూరం ఉంటుందని సభ దృష్టికి తేగా ఈవిషయంపై ప్రిన్సిపల్ సెక్రటరీకి నివేదికలు పంపిస్తామని డిఎంహెచ్‌ఓ రామిరెడ్డి తెలియజేశారు. కడప ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్‌బాషా మాట్లాడుతూ నీరు-చెట్టులో భాగంగా బుగ్గవంకలో రూ.80లక్షలతో పనులు చేసినా అవి నిరుపయోగంగా మారాయని, అలాగే నీరు-చెట్టు పనుల్లో గతంలో నగర శివారులోని రామాంజనేయపురం పరిసర ప్రాంతాల్లో ఎన్‌జిఓలకు చెందిన స్థలాల మధ్యలో నీరు-చెట్టు పనులు చేయడం వల్ల వందలాది మంది ఇళ్లస్థలాలు కోల్పోయారని సభ దృష్టికి తెచ్చారు. అనంతరంపంచాయతీరాజ్ ఎస్‌ఇ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వైసిపి జడ్పీటిసిలు, ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. ఉపాధికూలీలకు నెలల తరబడి కూలి డబ్బులు ఇవ్వకపోవడంతో వారు వలసలు వెళ్లేందుకు అధికారులే మార్గం సుగమం చేస్తున్నారని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాధరెడ్డి సభ దృష్టికి తేగా గత ఫిబ్రవరి మాసం నుంచి కూలి డబ్బులు ఇవ్వడం లేదని త్వరలోనే డబ్బులు ఆన్‌లైన్ విధానం ద్వారా బయోమెట్రిక్‌తో పంపిణీ చేస్తామని డిఆర్‌డిఏ పిడి అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అలాగే రాయచోటి ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి నీరు-చెట్టు పనులపై దాదాపు రూ.3కోట్లు ప్రజలధనం దుర్వినియోగం అయ్యిందని దీనిపై విచారణ జరిపించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని సభ ద్వారా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. నీరు-చెట్టు వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని ఈకార్యక్రమం ద్వారా టిడిపి నాయకులు, కార్యకర్తలకు వరాల జల్లులు కురిపించినట్లుగా ఉందని పేర్కొన్నారు. వైకాపా ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి, బి.కోడూరు మండలంలోని కస్తూరిబా పాఠశాలలో నీటికొరతతో బాలికలు బయటప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకుని కాలకృత్యాలు తీర్చుకుంటున్నారని కలెక్టర్ దృష్టికి తేగా కలెక్టర్ స్పందిస్తూ 24 గంటల్లో నీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో వైకాపా ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, కె.శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు డిసి గోవిందరెడ్డి, బిటెక్ రవి (రవీంద్రనాధరెడ్డి), రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్‌నాయుడు, జిల్లా అధికారులు, జడ్పీటిసిలు, ఎంపిపిలు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.