కడప

హైదరాబాద్‌కు ట్రూజెట్ విమానం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఏప్రిల్ 27: ఉడాన్ పథకం కింద గురువారం ఉదయం కడప వి మానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు ట్రూజెట్ విమాన సర్వీసును ప్రారంభించారు. భారత ప్రధాని నరేంద్రమోడీ ఈ పథకాన్ని గురువారం సిమ్లాలో ప్రారంభించి ఆ సందర్భంగా విమానశ్రయానికి హాజరైన ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు. ప్రాంతీయ రూట్లలో అత్యంత చౌకగా విమానాలు నడపడం నిమిత్తం కనెక్టివిటీ కింద ఉడాన్ పథకాన్ని ఉదయం 10గంటలకు ప్రారంభించగా స్థానికంగా జిల్లా మంత్రి సి.ఆదినారాయణరెడ్డి , రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుడులు విమానపు టికెట్లను పంపిణీ చేశారు. ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యాలయం నుంచి సోషల్ నెట్‌వర్క్‌కింగ్ ట్విట్టర్‌లో టిట్ చేశారు. అనంతరం ప్రధాని ఉడాన పథకం గురించి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా తక్కువ ధరలకు ప్రాంతీ య కనెక్టివిటీ కింద అన్ని ప్రాంతాల్లో విమానయానం కల్పించేందుకు ఈపథకానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. ఉడాన్ సర్వీసుకింద ఒక గంట విమానప్రయాణం ఐదు కి.మీ.లోపు లేదా హెలికాప్టర్‌లో 30 నిమిషాల ప్రయాణానికి రూ.2,500లు టికెట్ ధరను నిర్ణయించినట్లు అన్ని వర్గాలకు విమానంలో ప్రయాణించేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిగా అవకాశం కల్పిస్తున్న నేపద్యంలో కడప నుంచి హైదరాబాద్‌క, మహారాష్టల్రోని నాందేడు నుంచి హైదరాబాద్‌కు సర్వీసులు ప్రారంభించినట్లు ప్రధాని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆయన ప్రసంగాన్ని విమానాశ్రయంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు విని అనంతరం జిల్లా మంత్రి సి.ఆదినారాయణరెడ్డి ప్రసంగిస్తూ కేంద్రప్రభుత్వం సబ్సిడీ కింద వయబులిటీ జాబ్ ఫండ్ ద్వారా విమానాలు నడిపే కంపెనీలకు సబ్సిడీ అందిస్తుందని రాష్ట్రప్రభుత్వం కూడా సబ్సిడీలో 20శాతం భరించాల్సివుందన్నారు. ఉడాన్ పథకం కింద ఐదు రాష్ట్రాలు విమానాలు నడిపి ఈప్రాంతీయ కనెక్టివిటీ పథకంలో భాగస్వాములు అవుతున్నారన్నారు. జిల్లా వ్యాపార పరంగా , పారిశ్రామిక ప రంగా అభివృద్ధి చెందేందుకు ఉడా న్ పథకం ద్వారా విమానసర్వీసుల్లో ప్రయాణించేందుకు అందరికీ అవకాశం కల్పించడం జరిగిందన్నారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుడు మాట్లాడుతూ కడప విమానాశ్రయం నుంచి నడిపే విమానాలకు నష్టం కలగకుండా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఉడాన్ సర్వీసులుగా దేశంలో అన్నిప్రాంతాలకు కనెక్టివిటీ ఉంటుందని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కృషి ఫలితంగా ఉడాన్ పథకం కింద విమానాలు ప్రారంభించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. సామాన్యులకు సైతం ఈ స్కీమ్ కింద తమ ప్రాంతాలకు చేరుకునే వీలుగా ఉడాన్ సర్వీసులు ప్రారంభించడం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల భాగస్వామ్యమని ఆయన గుర్తు చేశారు. ఈకార్యక్రమంలో రాష్టప్రౌరసరఫరాల సంస్థ చైర్మన్ ఎం. లింగారెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే టి. జయరాములు, ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, జిల్లాకలెక్టర్ టి.బాబురావు నాయుడు, జాయింట్ కలెక్టర్ శే్వత తెవతియ, టిడిపి జిల్లాప్రధానకార్యదర్శి బి.హరిప్రసాద్, ప్రొద్దుటూరు మున్సిపాలిటి మాజీ ఇన్‌ఛార్జ్ చైర్మన్ ముక్తియార్, ఎయిర్ పోర్టు అధికారులు శ్రీకుమార్, ముత్తు, ప్రభాకర్, ఏజి ఖయ్య, షబావర్గీస్, ఆర్డీవో చిన్నరాముడు తదితరులు పాల్గొన్నారు.
జైలు నుంచే
స్మగ్లర్ల కార్యకలాపాలు!

కడప,ఏప్రిల్ 27: కడప సెంట్రల్ జైల్లో సీమ జిల్లాలకు చెందిన అంతర్జాతీయ, అంతర్ రాష్ట్రాల బడా స్మగ్లర్లు కడప సెంట్రల్ జైల్లో ఉంటూ తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సెంట్రల్ జైల్లో తమకు కావాల్సిన వస్తువులు తెప్పించుకోవడం, కొంతమంది సి బ్బంది సహకారంతో జల్సాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విదేశాలకు చెం దిన అంతర్జాతీయ స్మగ్లర్లతోపాటు ఆంధ్ర, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అంతర్జాతీయంగా పేరుమోసిన బడాస్మగ్లర్లే సెంట్రల్ జైల్లో ఉన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 25 మందికి పైబడి పిడి యాక్టు బనాయించినా, వారితోపాటు ఇతర జిల్లాలకు చెందిన తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన ఎర్రకూలీలు కూడా సెంట్రల్ జైల్లో వందల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. కూలీలకు స్మగ్లర్లే తమ కుటుంబ పోషణ నిమిత్తం నెలసరి రూ.లక్షల్లో వెదజల్లుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఇబ్బడి ముబ్బడిగా కేసులు నమోదుచేసి చార్జిషీట్ దాఖలులో అనేక లోపాలు ఉండటంతో 90రోజుల్లో కొంతమంది, నాలుగైదు నెలల్లో మరికొంతమంది జైలు నుంచి విడుదలవుతున్నారు. శేషాచలం అభయారణ్యాల్లో గుట్టుచప్పుడుకాకుండా ఎర్రచందనం నరికి దేశ విదేశాలకు యధేచ్చగా తరలిస్తూనే ఉన్నారు. సూత్రదారులు, పాత్రదారులు అంతర్జాతీయ స్మగ్లర్లు, జిల్లాకు చెందిన బడాస్మగ్లర్లు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు జైలు నుంచే పథకాలు రూపొందించి గుట్టుచప్పుడు లేకుండా బయట సంచరిస్తున్న కూలీల నుంచి ఎర్రచందనాన్ని సురక్షితంగా రూట్లు మార్చి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 900 మంది అరెస్టయి జైలుకు వెళ్లడం , 600 మంది పైబడి జైలుపై ఇప్పటికే విడుదలయ్యారు. జైలు కేసుల నిమిత్తం కొంతమంది సీనియర్ న్యాయవాదులు వివిధ ప్రాంతాల నుంచి రావడం, వారిని విడుదల చేయించుకుని వెళ్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కోవలో కొంతమంది లాయర్లు సైతం స్మగ్లర్లుగా అవతారాలు ఎత్తి పోలీసులకు చిక్కిన విషయం పాఠకులకు విధితమే. సెంట్రల్ జైల్లో అంతర్జాతీయ స్మగ్లర్లు, కూలీలు కలిసే ఉండటంతో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో స్పర్థలు ఏర్పడిన అంతర్జాతీయ స్మగ్లర్లు కూడా సెంట్రల్ జైల్లో ఉండటంతో తరచూ వారిమధ్య విభేధాలు చోటుచేసుకుని ఘర్షణలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సెంట్రల్ జైల్లో ఒక దశలో నిఖ్ఖచ్చిగా పనిచేసే అధికారులు, సిబ్బందికి స్మగ్లర్ల ఆదిపత్యపోరు, వారి ఘర్షణలు తలనొప్పిగా మారాయి. రాత్రుల్లో గస్తీ తిరిగేవారు, సెంట్రీ డ్యూటీలో ఉన్న పోలీసులు హడలెత్తిపోతున్నారు. మరికొంతమంది కంటికి కునుకు లేకుండా సెంట్రీ డ్యూటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు కఠినంగా వ్యహరించి , స్మగ్లర్లకు కఠినంగా శిక్షపడేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నీరు-చెట్టు కార్యక్రమంలో
రూ.వంద కోట్లు దుర్వినియోగం!

కడప, ఏప్రిల్ 27:జల వనరుల సంరక్షణ, భూగర్భజలాల పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నీరు-చెట్టు, నీరు-ప్రగతి కార్యక్రమాలతో పాటు ఉపాధిహమీ పథ కం క్రింద యేటా రూ. 400 కోట్లకు పైబడి ఖర్చు చేస్తున్నా ప్రజా ధనం ప్రక్క దారి పడుతుందే తప్ప, అక్రమాలను అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారనేది జగమెరిగిన స త్యం. ఇప్పటి వరకు నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా రూ. 400 కోట్ల ప్రణాళికను రూపొందించి రూ. 350 కోట్లకు పైబడి ఖర్చు చేశారు. చెరువులకు, చెరువు కట్టలకు, కుంటలకు మరమత్తులు చేసి సఫ్లైఛానళ్లలో పూడికలు తీసి, ఎత్తు ప్రాంతంలోని నారవలు, కాలువలలో తూతూ మంత్రంగా మట్టి తీసేసి రూ. 300 కోట్లకు పైబడి నిధులను అప్పనంగా నేతలకు బంగారు పళ్లెంలో పెట్టి అధికారులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే జాతీయ గ్రామీణ ఉపాధిహమీ పథకం క్రింద ఇప్పటి వరకు రూ. 600 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. వెయ్యి కోట్ల కేటాయింపులు జరిగాయి. వందల కోట్లు నీటి సంరక్షణ కోసం వివిధ పథకాల పేరిట ఖర్చు చేస్తూ ఇప్పటి వరక చేపట్టిన పనులలో తిరిగి మట్టి చేరడం, కొన్ని పనులకు రూపురేఖలు మారడంతో గత ఏడాది తంతే ఈ ఏడాది కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇరవై యేళ్ల క్రింద ప్రారంభమైన బిపిఏపి కార్యక్రమం, వాటర్ షెడ్ పథకం, మైక్రో వాటర్‌షెడ్ ద్వారా ఇవే పనులు చేపట్టి యేటా ఒకొక్క వాటర్‌షెడ్ నుంచి ఐదేళ్లకు రూ. 5 కోట్లు ఖర్చు చేశారు. ఆ తరహాలో జిల్లా వ్యాప్తంగా 500 వాటర్‌షెడ్‌లు ఏర్పాటు చేసి ఖర్చు చేశారు. ప్రస్తుతం నీరు-ప్రగతి పథకం క్రింద లక్ష పంట కుంటలు త్రవ్వనున్నారు. కొన్ని కుంటలకు రూ. 30 వేలు పైబడి, మరి కొన్ని కుంటలకు రూ. 70 వేలు పైబడి విస్తీర్ణంతో నిర్ణయించాల్సి ఉంది. గత ఏడాది చేపట్టిన పంట కుంటలు చాలా వరకు రూపురేఖలు మారాయి. ఇక చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి రూ. 3 లక్షలు ఖర్చు చేయనున్నారు. జిల్లాలో లెక్కలేని చెక్‌డ్యామ్‌లు వేలలో ఉన్నాయి. కొంతమంది పాత చెక్‌డ్యామ్‌లు తొలగించి వాటి రాళ్లను కొత్త చెక్‌డ్యామ్‌లకు నిర్మించి పాత చెక్‌డ్యామ్‌ల రూపురేఖలు మార్చి తిరిగి ఆ స్థానం కొత్త చెక్‌డ్యామ్‌లు నిర్మించడం, చెక్‌డ్యామ్‌ల పునరుద్దరణ, మరమత్తుల పేరిట బడా నాయకుల అనుమతి పొందుతున్నారు. ఇక చెక్ వాల్స్‌లు, గ్యాబియన్ స్ట్రక్ఛరులు, కందకాల నిర్మాణాలు తదితర వాటి పేర్లతో మరి కొన్ని పనులకు ప్రతిపాదనలు పెడుతున్నారు. అధికార పార్టీ నేతలతో పాటు వారి సామాజిక వర్గం వారు ఏ పార్టీలో ఉన్నా వారందరికీ పనులు కల్పించి కొంతమంది కమీషన్‌లు తీసుకుని కుంటలు, చెరువులు, చెక్‌డ్యామ్‌లు తదితరాల మరమత్తులు, పునరుద్ధరణ నిర్మాణాల నిమిత్తం ఇప్పటి వరకు రూ. 200 కోట్లు జిల్లా వ్యాప్తంగా అధికార పక్షం నేతలు అధికారులకు ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం చేపట్టిన నీరు-ప్రగతి కార్యక్రమం క్రింద పంచాయితీరాజ్, జల వనరుల శాఖ, ఉపాధిహమీ పథకం మూడు శాఖల సమన్వయంతో నిధుల కేటాయింపులలో నీరు-ప్రగతి పథకం క్రింద రూ. 500 కోట్లకు పైబడి ఖర్చు పెట్టనున్నారు. యేటా చేపట్టే పనులకే నిధులు ఖర్చు చేస్తుండడంతో ప్రజా ధనం దుర్వినియోగం కావడమే తప్ప ఈ పథకాల క్రింద చేపట్టిన పనుల వలన జల వనరుల సంరక్షణ అంతంత మాత్రంగానే మిగిలింది. ప్రస్తుతం జరిగే నీరు-ప్రగతి కార్యక్రమాన్ని పకడ్భందీగా అధికారులు నిర్వహించి, ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రజలతో చర్చించకుండా హైవే పనులా!
రాయచోటి, ఏప్రిల్ 27:రాయచోటి పట్టణంలో గురువారం నుంచి మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌రాజు జాతీయ రహదారిపై ఉన్న అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారని, ఈ కట్టడాలు తొలగిస్తే ప్రజల నుంచి ఏ విధంగా స్పందిన ఉంటుంది, ఏవైనా సమస్యలు తలెత్తుతాయా అని అలోచించకుండా వన్ మ్యాన్ అధికారిగా వ్యవహరిస్తున్నారని మున్సిపల్ చైర్ పర్సన్ నసీబున్‌ఖానమ్ పేర్కొన్నారు. గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల స మావేశంలో ఆమె మాట్లాడుతూ ము న్సిపల్ పాలక వర్గానికి తెలియకుండా మున్సిపల్ కమిషనర్ ఈ జాతీయ రహదారి పనులు చేపట్టుతున్నారని ఆమె తెలిపారు. ఈ చేయడం వల్ల పట్టణంలో సమస్యలు తలెత్తితే ఎవ్వ రు సమాధానం చెప్పాల్సి ఉం టుందని ఆమె ప్రశ్నించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులైన మేము ప్రజలతో చర్చించి తర్వాత అక్రమ కట్టడాలు తొలగిస్తే ఇబ్బందు లు రావని ఆమె తెలిపారు. అలా కా కుండా ఇష్టం వచ్చినట్లు కౌన్సిల్ సభ్యులను తెలియకుండా ఈ విధంగా చేస్తున్నారని ఆమె వాపోయా రు. ఇలా ప్రజాభిప్రాయం తీసుకోకుం డా చేస్తుంటే ఇది ఊరా లేదా అడవా అని ఆమె ప్రశ్నించారు. అనంతరం మాసాపేటకు చెందిన సుమారు 50 కుటుంబాల వారు మున్సిపల్ కార్యాలయా న్ని ముట్టడించారు. 2009లో అప్పటి హైవే అధికారులు 70 అడుగులతో మాకు మార్కింగ్ వేశారని దాని ప్రకారం మాకు నష్ట పరిహారం కల్పించారని, దాని ప్రకారం మా ఇంటి నిర్మాణాలను తొలగించడం జరిగిందన్నారు. నేడు 70 అడుగలు కాకుండా 82 అడుగుల వరకు ఇళ్లను కూల్చివేయాలని అధికారులు చెబుతున్నారని తెలిపారు. ప్రభుత్వ జీవోలు అంటే ఎప్పటికీ ఒకే విధంగా ఉండాని కానీ ఇష్టం వచ్చినట్లు మార్చుతూ పోతే జరిగే పరిణామాలకు ఎవ్వరు బాధ్యత వహిస్తారని ప్రజలు మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. అంతే కాకుండా 82 అడుగుల వరకు ఇళ్లను కూల్చివేయాలని ఏ విధంగా చెబుతారని, ప్రజలతో చర్చించకుండా అధికారులు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని ప్రజలు వాపోయారు. పట్టణం అంతా ఒకే కొలతలు తీయాలని వారు సూ చించారు. అలా కాకుండా కాలనీ లో ఒక కొలత, ఠాణా వద్ద ఒక కొ లత, మాసాపేటలో ఒక కొలత తీస్తే చూ స్తూ ఊరుకోమని హెచ్చరించారు. అలా చేస్తే ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ పట్టణంలో ఏ ప్రాంతంలో ఏన్ని అడుగుల వెడల్పు రోడ్డు వేస్తున్నారో స్పష్టంగా ప్రజలకు, పాలక వర్గానికి తెలియపరచాలని మున్సిపల్ చైర్ పర్సన్ కోరా రు. అందుకు కమిషనర్ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ కట్టడాలు కూల్చివేయడం జరుగుతోందన్నారు. ఇప్పటికైనా కమిషనర్ పద్దతి మార్చుకుని అభివృద్ధి విషయంలోనైనా కానీ, పాల క వర్గానికి సమాచారం తెలపడంలోకానీ సహకరించకపోతే ముందు ముందు ధర్నాలు, నిరసనలు, నిరీహార దీక్షలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ మెంబర్లు సలావుద్దీన్, కొట్టే చలపతి, కౌన్సిలర్లు ఫయాజూర్ రెహిమాన్, రిజ్వాన్, అల్తాప్, చిల్లిస్ ఫయాజ్, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి నిరోధకుడు వైఎస్ జగన్
వేంపల్లె, ఏప్రిల్ 27:జిల్లాలో కానీ, నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుంటే వెంటనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడ్డుకోవడం ఆనవాయితీగా మారిందని, దీంతో అభివృద్ధి నిరోధకుడిగా చరిత్రలో నిలుస్తున్నాడని మండలి మాజీ ఉపాధ్యక్షుడు సతీష్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక షాదీఖానాలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎంతో కష్టపడి కృష్ణా జలాలను పులివెందుల నియోజకవర్గానికి తెప్పిస్తే ఎక్కడో ఒకచోట ఒకటి, రెండు చీనీచెట్లు ఎండిపోతే దానిని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భూతద్దంలో చూపించడం ఎంత వరకు సమంజసమన్నారు. కృష్ణా జలాల రాకతో పులివెందుల నియోజకవర్గంలో రైతులు ఎంతో హర్షిస్తున్నారని తెలిపారు. వేల ఎకరాలు పులివెందుల నియోజకవర్గంలో సాగులోకి వచ్చిందన్నారు. తాను మరియు చంద్రబాబునాయుడు అవినీతి విషయంలో మచ్చలేని నాయకులమన్నారు. దీంతో రాష్ట్ర ప్రజలు మరోసారి చంద్రబాబునాయుడికి పట్టం కడతారన్నారు. 2019లో తెలుగుదేశం పార్టీ తరపున పులివెందుల నుండి తాను పోటీ చేసి గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలంటే తనను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా పరిశీలకులు నరసనాయుడు, ఏపీ హజ్ ఛైర్మన్ అహమ్మద్‌హుస్సేన్, మార్కెట్‌యార్డు ఛైర్మన్ తూగుట్ల రాఘవరెడ్డి, వేంపల్లె సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
చెన్నకేశవునికి అభిషేకాలు
* నేడు చందనోత్సవం * శాస్త్రోక్తంగా అష్టోత్తర కలశాభిషేకం
* పెద్దశేషవాహనంపై ఊరేగిన చెన్నకేశవుడు
వల్లూరు,ఏప్రిల్ 27: బ్రహ్మోత్సవాల్లో భాగంగా పుష్పగిరిలో శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామికి శాస్త్రోక్తంగా అష్తోత్తర కలశాభిషేకాన్ని వేదపండితులు నిర్వహించారు. బుధవారం కొండపై వెలసిన చెన్నకేశవస్వామి ఆలయంలో చెన్నకేశవస్వామి మూలవిరాట్‌కు పలు అభిషేకాలు నిర్వహించారు. ఉదయం వేదపండితులు 108 కలశాలు ఏర్పాటుచేసి అందులో దేశంలోని పవిత్ర నదీ జలాలను ఆవాహనం చేశారు. కలశాలలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, గంధం, సుగంధ ద్రవ్యాల పుష్పాలు నింపారు. అనంతరం 108 కలశాలతో స్వామివారి మూలవిరాట్‌కు అభిషేకాలు చేశారు. రాత్రి స్వామివారు శ్రీదే వి, భూదేవి సమేతంగా పెద్దశేషవాహనంలో ఊరేగారు. గ్రామంలో వెలసిన వై ద్యనాదేశ్వరస్వామికి ఉదయం గణపతిపూ జ, రుద్రాభిషే కం, కుం కుమార్చన త దితర పూజలు నిర్వహించా రు. సాయంత్రం కామా క్షీ సమేతుడైన వైద్యనాదేశ్వరుడు పురుషాన్ మృగవాహనంలో ఊరేగారు.
ముందస్తు ఎన్నికలకు
సిద్ధంకండి
చాపాడు, ఏప్రిల్ 27: కేంద్రంతోపాటు రాష్ట్రంలో ముందస్తుగా ఎన్నికలు జరిపేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అందుకనుగుణంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మైదుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని అల్లాడుపల్లె టిటిడి కళ్యాణమండపంలో మండలకమిటీ ఎన్నికల నిమి త్తం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్‌యాదవ్ మాట్లాడుతూ కేంద్రంతోపాటు రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వాటిని ఎదుర్కొనేందుకు టిడిపి కార్యకర్తలు సమాయాత్తంగా ఉండాలన్నా రు. ఇప్పటికే మండలంలో వైకాపా నుంచి టిడిపిలోకి భారీ స్థాయిలో వలసలు వచ్చారన్నారు. కార్యకర్తలు కూడా సమన్వయంగా అందరూ కలుపుకొనిపోతూ అభివృద్ధికి బాటలు వేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల చెంతకు చేర్చి వారినుంచి ప్రభుత్వంపట్ల సానుకూలత సాధించాల్సిన అవసరముందని ఆయన సూచించారు. ఇప్పటికే వృద్దులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు విరివిగా అందించి తెలుగుదేశం ప్రభుత్వం వారి ఆదరాభిమానాలు పొందుతోందన్నారు. ఈ యేడాది గృహనిర్మాణాలను నియోజకవర్గానికి 2500లను కేటాయించి ప్రతి ఒక్కరికీ గూడు కల్పించాలనే ధ్యేయం తో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటివసతి కల్పించాల్సిన బాధ్యత మనందరిపై వుందన్నారు. అలాగే రైతు, డ్వా క్రా రుణమాఫీని లబ్దిదారుల చెం తకు తీసుకువెళ్లి వివరించి వారి నుంచి అభిమానం పొందాలన్నారు. రాష్ట్ర పరిశీలకుడు రాధాక్రిష్ణ మాట్లాడుతూ కడపజిల్లాలో తెలుగుదేశంపార్టీ పుం జుకుంటోందన్నారు. ఇటీవల జరిగిన స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితమే ఇందుకు నిదర్శనమని, రాబోవు ఎన్నికల్లో మంచి ఫలితాలను పొంది ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రా వడం జరుగుతుందన్నారు. ప్రస్తు తం మండలాల వారీగా నిర్వహిస్తున్న సం స్థాగత ఎన్నికలను సజావుగా జరిపి ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ వైవి.సు బ్బారెడ్డి, డిసిఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పాలగిరి వేమారెడ్డి, చాపాడు ఛానల్ నీటిసంఘం నాయకులు రవిశంకర్‌రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు అన్నవరం సుధాకర్‌రెడ్డి, గోసుల క్రిష్ణారెడ్డి, మొగిలి రామాంజనేయులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆర్టీపీపీ 6వ యూనిట్ పనులు
వేగవంతం చేయండి
ఎర్రగుంట్ల,ఏప్రిల్ 27: రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)లో నిర్మాణంలో ఉన్న 6వ యూనిట్ పనులను వేగవంతం చేయాలని ఇంధన కార్యదర్శి అజయ్‌జేన్ పేర్కొన్నారు. గురువారం 600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన ఆర్టీపీపీలోని 6వ యూనిట్ పనులు ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన గుత్తేదారులు, అధికారుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాయలసీమ ప్రాంతానికి అత్యంత ప్రాముఖ్యత ఈ ధర్మల్ పవర్ ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అయితే అనుకున్న మేరకు పనులు త్వరితగతిన పూర్తికావడంలేదని గుత్తేదారులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. యూనిట్ నిర్మాణానికి నిధులకొరత ఏమాత్రం లేదని అయితే గుత్తేదారుల నిర్లక్ష్యం కారణంగా యూనిట్ పనులు సకాలంలో పూర్తికావడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ,గుత్తేదారులు పనులు పూర్తిచేసేందుకు కృషి చేయాలని కోరారు. అంతకుముందు అజయ్‌జేన్ నిర్మాణంలో ఉన్న చిమ్ని, కోల్‌ప్లాంట్, కూలింగ్ టవర్, బాయిలర్, టిజి తదితర ప్రాంతాలను సందర్శించి జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆయన వెంట జెన్కో డైరెక్టర్ సుందర్‌సింగ్, సిఇ (సివిల్)రవీంద్రకుమార్, సూర్యలక్ష్మి, ఆర్టీపీపీ సిఇ శ్రీరాములుతోపాటు స్థానిక ఎస్‌ఇలు, ఏడిఇ, ఏఇ తదితర అధికారులు పాల్గొన్నారు.
చెత్త తొలగించండి మహాప్రభో
* కమిషనర్ ఛాంబర్‌ను ముట్టడించిన ప్రజలు
* ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
రాయచోటి, ఏప్రిల్ 27:మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు అలిమీబాద్ వీధి ఆదిరెడ్డి మిల్లు సమీపంలో డ్రైనేజి కాలువల్లోని చెత్తను తొలగించాలని ఆ ప్రాంత ప్రజలు గురువారం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. కమిషనర్ లేకపోవడంతో కమిషనర్ చాంబర్ ఎదుట బైఠాయించి కమిషనర్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. ఈసందర్భంగా 11వ వార్డు ప్రజలు మాట్లాడుతూ రెండు మూడు నెలలు అయినా కూడా మా వీధిలోని కాలువల్లో చెత్త తొలగించకపోవడంతో మురుగునీరు ప్రవహించక ఎక్కడివక్కడే నిలిచిపోతున్నాయన్నారు. ఫలితంగా దుర్గంధం వెదజల్లుతూ వ్యాధులు ప్రభలే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంపై గత నాలుగురోజుల నుంచి మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అయినా కమిషనర్ పట్టించుకోలేదని వాపోయారు. డ్రైనేజి కాలువల్లో అధికంగా మురుగు నీరు నిలవడం వల్ల దోమలు వృద్ధి చెంది పిల్లల వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. మీ పిల్లలకు ఈ విధంగా ఉంటే మీరు ఈ విధంగానే ఏమి చేయకుండా ఉంటారని వారు మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. అంతే కాకుండా ఆ ప్రాంతానికి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న హరికి కూడా పలు మార్లు ఫిర్యాదులు చేయడం జరిగిందన్నారు. అతను కూడా పట్టించుకోవడం లేదన్నారు. అంతే కాకుండా మా 11వ వార్డులో తాగునీటి కుళాయిలు కానీ, సిమెంటు రోడ్డు కాని లేవన్నారు. మున్సిపల్ అధికారులు మాత్రం ఇంటి పన్నులు కట్టే విషయంలో ముందు ఉండి అభివృద్ధి విషయంలో వెనుకంజలో ఉంటారని వారు తెలిపారు. 11వ వార్డులోని సమస్య పరిష్కరించేంత వరకు ప్రతి రోజు మున్సిపల్ కార్యాలయం వచ్చి ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు ప్రజలు తదితరులు పాల్గోన్నారు.
గడ్డివామి దగ్ధం
గాలివీడు, ఏప్రిల్ 27:మండల కేంద్రంలోని పక్కీరారెడ్డిగారిపల్లెకు చెందిన డ్రైవర్ సిద్దూనాయక్‌కు చెందిన గడ్డివామి దగ్ధమైంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రభుత్వాసుపత్రికి సమీపంలోని గడ్డివామికి ప్రమాదవశాత్తూ నిప్పంటుకోవడంతో పశువులమేత కోసం ఉంచిన పశుగ్రాసం మొత్తం దగ్ధమైనట్లు సిద్దూనాయక్ వాపోయారు. సమాచారం అందుకున్న లక్కిరెడ్డిపల్లె అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన వచ్చి మంటలు ఆపే ప్రయత్నం చేశారు. అయినా పశుగ్రాసం మాత్రం మొత్తం అగ్నికి ఆహుతైంది. దాదాపు రూ.30 వేలు విలువ చేయు పశుగ్రాసం అగ్నికి ఆహుతైనట్లు సిద్దూనాయక్ తెలియజేశారు.

ఘాట్‌రోడ్డులో లారీలు ఢీ
* ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
రామాపురం, ఏప్రిల్ 27:కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిలోని గువ్వలచెరువు ఘాట్ నాల్గో మలుపు వద్ద రెండు లారీలు ఢీకొని రోడ్డుపై పడటంతో తీవ్ర అంతరాయం కలిగింది. రామాపురం వరకు వాహనాలు ఆగిపోవడంతో ఘాట్‌రోడ్డులో ఉన్న ప్రయాణికులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం 3 గంటలకు ప్రమాదం జరగడంతో చిత్తూరు, బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్లు ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు పడ్డారు. సంఘటనా స్థలానికి పోలీసు సిబ్బంది చేరుకుని వాహనాలను పక్కకి తొలగించేయడంతో దాదాపు 6 గంటలకు పూర్తిగా తిరిగి యధావిధిగా తిరిగాయి.
తాగునీటి సమస్యను పరిష్కరించాలి
* కలెక్టర్‌కు కుంచం వినతి
కమలాపురం, ఏప్రిల్ 27: ఈ యేడాది వేసవిలో జిల్లా అంతటా నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేలా తగుచర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాబురావుకు ఆర్‌ఆర్‌యస్ అద్యక్షుడు కుంచం వెంకటసుబ్బా రెడ్డి వినతించారు. ఆయన గురువారం విలేఖర్లతో మాట్లాడుతూ చాలా గ్రామాల్లో తీవ్ర నీటిఎద్దడి నెలకొని ప్రజలు మంచినీటికి కటకటలాడుతున్నారని సత్వరమే చర్యలుతీసుకుని అవసరమైన నిధులు కేటాయించి ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరాచేసి ప్రజలను ఆదుకోవాలని కలెక్టర్‌ను కోరినట్లు చెప్పారు. అంతేకాక ఉపాధిహామి పనులు పెద్దఎత్తున చేపట్టి కూలీలకు 200పనిదినాలు కల్పించాలని వారికి అవసరమైన నీడ, మంచినీరు, మజ్జిగ సరఫరాచేసి వడదెబ్బకు గురికాకుండా కాపాడాలని కోరినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఖరీఫ్ సీజన్‌లో ఉచితంగా ఎరువులు సరఫరా చేయాలని కూడా కోరామని వివరించారు.