కడప

నేడే సీతారాముల కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, ఏప్రిల్ 19. ఒంటిమిట్ట కోదండరామయ్య కల్యాణోత్సవానికి సిద్ధమయ్యాడు. విద్యుత్ కాంతులతో విరాజిల్లుతున్న ఏకశిలానగరాన్ని వీక్షించేందుకు రెండు కళ్లూ సరిపోవడం లేదు. బుధవారం సిఎం రామయ్యకు తలంబ్రాలు, పట్టువస్త్రాలు తేనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాకను పురస్కరించుకుని పోలీసు యంత్రాంగం ఆలయ ప్రాంగణమంతా మొహరించింది. రేంజి డిఐజి రమణకుమార్, టిటిడి ఇఓ సాంబశివరావు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై మంగళవారం రాత్రి సుదీర్ఘంగా చర్చించారు. కల్యాణోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి విఐపిలు వస్తున్నందున విస్తృత ఏర్పాట్లు చేశారు. మంగళవారం స్వామివారు మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ వాహనంపై పురవీధుల్లో ఊరేగారు. టిటిడి ఆధ్వర్యాన తొలిసారిగా జరుగుతున్న ఈ ఉత్సవాన్ని ఇఓ సాంబశివరావు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నరు.