కడప

జిల్లాలోకి స్టువర్టుపురం దొంగలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మే 15 : స్టువర్టుపురం దొంగలు జిల్లాలో ప్రవేశించడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. తాజాగా సోమవారం స్టువర్టుపురానికి చెందిన ఐదుగురు మహిళా దొంగలను జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుంచి బంగారు నగలతోపాటు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దశాబ్దాల క్రితం సువర్టుపురం దొంగలు పులివెందుల కేంద్రం చేసుకుని యథేచ్చగా దొంగతనాలకు పాల్పడేవారు. మహిళలు, పురుషులు రెక్కి తరహాలో నిర్వహించి ఇళ్లకు తాళంవేసిన వాటిని పగలు సమయంలో గుర్తించి రాత్రుళ్లు ఆ ఇళ్లను సునాయాసంగా వారి వద్దవున్న ఆయుధాలతో పగులగొట్టి గుట్టుచప్పుడులేకుండా అసలు దొంగతనం చేసినట్లు తెలియకుండా నగలు, నగదు ఎత్తుకుని పారిపోయేవారు. గతంలో కడపలో క్రైమ్ డిఎస్పీగా పనిచేసి రిటైర్డు అయిన తిరుపాల్, ఎరుకలయ్యలు రెండు దశాబ్దాల క్రితం స్టువర్టుపురం దొంగలకు సింహస్వప్నం చూపించారు. స్టువర్టుపురంలో దొంగలు తమ వృత్తి మానుకున్నట్లు ప్రభుత్వమే నిర్ధారించి కొనే్నళ్లుగా దొంగతనాలకు స్వస్తిచెప్పారు. అయితే స్టువర్టుపురం దొంగలు సోమవారం జిల్లాకు చెందిన మైదుకూరులో ప్రత్యక్షం కావడంతో పోలీసులకు కునుకులేకుండా పోతోంది. ఈ దొంగతనాలు కడప, మైదుకూరు,ప్రొద్దుటూరు, బద్వేలు, రాజంపేట ప్రాంతాల్లో సువర్టుపురం దొంగలుపడి గతంలో యధ్చేచ్చగా దోపిడీ చేసేవారు. గత కొంతకాలం నుంచి జిల్లాలో సాధరణ దొంగతనాలు జరుగుతున్నా పోలీసులకు స్టువర్టుపురంపై అనుమానం కలగలేదు. స్టువర్టుపురం దొంగలను గుర్తించాలన్నా అంత సులభతరం కాదు. వారు దొంగతనాలకు పాల్పడినా, దోపిడీలు చేసినా ఎటువంటి అనుమానాలు కలగకుండా చివరకు పోలీసులు క్లూస్‌టీమ్‌లుకానీ, డాగ్ స్వ్కడ్‌లు వచ్చినా వారు దొంగతనం చేసిన అనంతరం రసాయనాలు చల్లుకుంటూ చివరకు కారంపొడి చల్లుకుంటూ చాకచక్యంగా క్షణాల్లో మాయవౌతారు. వారిని పట్టుకోవాలంటే పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటే తప్ప నేరస్థలం నుంచి వారు నిష్క్రమిస్తే వారి ఆచూకీని పట్టుకోవడం సులభతరం కాదు. స్టువర్టుపురం దొంగలు ప్రవేశించడంతో జిల్లావాసుల్లో భయాందోళన మొదలై పోలీసులకు సవాల్‌గా మారింది.

వ్యవసాయ జూదానికి సిద్ధమవుతున్న అన్నదాత!

కడప, మే 15: జిల్లాలో మరో రెండువారాల్లో ప్రారంభంకానున్న ఖరీఫ్‌సీజన్ సందర్భంగా జిల్లా రైతాంగం వ్యవసాయ జూదంలో అడుగుపెట్టనున్నారు. అయితే వరుణుడు కరుణిస్తాడో లేదోనని రైతుల్లో అనుమానం రేకెత్తిస్తోంది. మరి కొన్నిరోజుల్లో వర్షాల జల్లులు కురుస్తాయని జూన్ మొదటి వారంలో విత్తనాలు విత్తేందుకు దుక్కులు చదును చేసుకుంటూ సన్నద్ధవౌతున్నారు. గత దశాబ్దకాలంగా రైతులను వరుసకరవులు వెంటాడుతున్నా వ్యవసాయంపై మమకారం చంపుకోలేకుండా గంపెడుఆశతో ఖరీఫ్ దుక్కులు దున్నుకుని ఎరువులను పొలాలపై వేసుకుంటున్నారు. జిల్లాలో ఉన్న విస్తీర్ణంలో వర్షాధారంపై ఆధారపడి వ్యవసాయం చేయాల్సివుంది. విత్తనపుకాయ సమకూర్చే విషయంలో జిల్లా అధికారులు గత యేడాది 42వేల క్వింటాళ్లుపైబడి విత్తనపుకాయలను జిల్లాకు దిగుమతి చేశారు. ఈ యేడాది 60వేల వేరుశెనగ విత్తనకాయ కావాలని అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ఖరీఫ్‌లో జిల్లాలో అధికశాతం మంది రైతులు వేరుశెనగనే సాగుచేయడం తొలి నుంచి ఆనవాయితీగా మారింది. గత ఏడాది వేరుశెనగ పంట దిగుబడి సమయంలో వర్షాలు కురువకపోవడం 70నుంచి 80హెక్టార్లలో మెట్టప్రాంతంలోని పొలాల్లో ఎక్కడికక్కడ చెట్లు ఎండిపోయాయి. దీంతో ప్రభుత్వం 32 మండలాలు కరువుమండలాలుగా ప్రకటించింది. ఈ యేడాది లక్షా 60వేల హెక్టార్లలో పంటలసాగుకు రైతులు పొలాలు దుక్కులుచేసుకుని ఎరువులు సమకూర్చుకుంటున్నారు. జిల్లాలో రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రాజంపేట, కడప ప్రాంతాల్లో ఎర్రరేగడి నేలలు అధికంగా ఉంది. కమలాపురం, ప్రొద్దుటూరు, బద్వేలు ప్రాంతంలో నల్లరేగడి భూములు అధికంగా ఉన్నాయి. జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరులలో నల్లరేగడి నేలలు అధికంగా ఉన్నాయి. వేరుశెనగ మాత్రం లక్కిరెడ్డిపల్లె, కమలాపురం, రాయచోటి, పులివెందులలో అత్యధికంగా సాగుచేస్తారు. వేరుశెనగ, ఆముదం,పసుపు, సోయా చిక్కుళ్లు,నువ్వులు, ప్రొద్దుతిరుగుడు లక్షా 50వేల హెక్టార్లు పైబడి సాగుచేయనున్నారు. అలసంద, కంది, ఉలవలు, పెసలు, మినుము పంటలు 25వేల హెక్టార్లలో సాగుకునోచుకోనుంది. ఇక చిరుధాన్యాలు జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగి, వరి 70వేల హెక్టార్లలో సాగుచేయనున్నారు. 22రకాల పంటలను ఖరీఫ్‌లో ఏటా సాగు చేస్తున్నారు. మెట్టసాగులో వేరుశెనగ, పత్తి అధికంగా సాగుచేయడం ఆనవాయితీ. వరుణి కరుణపై మెట్టపొలాల్లో విత్తనాలు విత్తుకుని ఆకాశంపై ప్రతిరైతు ఎదురుచూస్తుంటారు. సకాలంలో వర్షాలు కురిస్తే రైతులు పంటలకు పెట్టిన పెట్టుబడులు దక్కుతాయి. లేనిపక్షంలో యేటా తరహాలో రైతులు అప్పులపాలు కావాల్సిందే. అధికారులు మాత్రం ఉచిత సలహాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు తప్ప దశాబ్దకాలంగా రైతులకు పంటలకు పెట్టిన పెట్టుబడులు రాక ఏటా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ ఖరీఫ్‌లోనైనా రైతులకు వర్షాలు అనుకూలించి ఖరీఫ్‌లో నైనా రైతుల కష్టాలు తీరుతాయని ఆశిద్ధాం.