కడప

బదిలీల్లో గందరగోళం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మలమడుగు, మే 15: ఉపాధ్యాయ బదిలీలపై తీవ్ర గందరగోళం నెలకొంది. యేటా నిర్వహించే సాధారణ బదిలీల మాదిరిగానే మాన్యువల్‌గా చేస్తారా లేక వెబ్‌కౌన్సిలింగ్ ద్వారా నిర్వహిస్తారా అన్న విషయం ఉపాధ్యాయవర్గాలో ఉత్కంఠగామారింది. ఈ అంశం ఇలావుంటే నిబంధనలు, మార్గదర్శకాలు ఎలా ఉంటాయోనని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వేసవి సెలవుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్ల బదిలీలు, రేషనలైజేషన్ పూర్తిచేసి మళ్లీ వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం అయ్యేనాటికి బదిలీ అయిన టీచర్లు ఆయా పాఠశాలల్లో చేరేటట్లు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే వేసవి సెలవులు పూర్తయ్యే గడువు దగ్గరపడుతున్నా బదిలీలకు కాలయాపన జరిగిపోతోంది. ఇప్పటికీ బదిలీలకు సంబంధించి సరైన మార్గదర్శకాలు లేవు. దీంతో జిల్లాలో సుమారు 12 వేల మంది ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. వీరికి సంబంధించిన హేతుబద్దీకరణ ప్రక్రియను పూర్తిచేసి ఏప్రిల్ నెలలోనే బదిలీల ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. బదిలీల్లో పారదర్శకతను తీసుకువచ్చేందుకు ఈ యేడాది వెబ్‌కౌన్సిలింగ్ ద్వారా బదిలీలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. బదిలీల అంశంపై పలు ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరాలను లేవనెత్తాయి. వెబ్‌కౌన్సిలింగ్ ప్రక్రియను చాలాసంఘాలు వ్యతిరేకించాయి. ఇప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి మార్గదర్శకాలు విడుదలకాకపోవడంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. పరిస్థితి ఇలాగే కొనసాగి పాఠశాలలు ప్రారంభమైన తరువాత బదిలీల ప్రక్రియ ప్రారంభిస్తే ఉపాధ్యాయులకు, విద్యార్థులకు తరగతలు నిర్వహణ భారమయ్యే సమస్య ఉంది. ఈ విషయంపై ఎస్టీయు రాష్ట్ర కార్యదర్శి బి.గురుకుమార్ మాట్లాడుతూ ఇకమీదటనైనా జాప్యం జరుగకుండా త్వరితగతిన బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. ఉపాధ్యాయులకు నష్టం వాటిల్లకుండా మార్గదర్శకాలు జారీ చేయడంలో నిబంధనలు పాటించాలన్నారు.

జగన్‌పై స్వరం పెంచిన మంత్రి ఆది

కడప, మే 15: వైఎస్సీర్ సిపి అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారపార్టీపై దూకుడు తగ్గించేందుకు మంత్రి సి.ఆదినారాయణరెడ్డి దృష్టిసారించారు. ఆయన జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాలపైనే దృష్టిపెట్టి తన మార్క్ కలిగివున్న అధికారులపై ఆ రెండు నియోజకవర్గాలపైనే దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా జగన్ అనుచరగణాలపై చూపుపెట్టి వారిని పార్టీలోకి లాగేందుకు సర్వశక్తులు వడ్డుతున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా 2019 ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే గ్రామ, మండలస్థాయి వైసిపికి చెందిన కీలక నేతల జాబితాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. తన నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పనులు పర్యవేక్షించేందుకు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు తన సోదరుడు ఎమ్మెల్సీ సి.నారాయణరెడ్డికి పూర్తిస్థాయిలో బాధ్యతలు మోపినట్లు తెలుస్తోంది. తన కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరిని నియోజకవర్గంలో జోక్యం చేసుకోకుండా అడ్డుకట్టవేసి తన సోదరుడు నారాయణరెడ్డికే బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆయన రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం ఇన్‌చార్జి కావడంతో ఆ నియోజకవర్గ పరిధిలోని రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి అసెంబ్లీ సెగ్మెంట్లతోపాటు చిత్తూరు జిల్లాకు చెందిన వాయల్పాడు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాలపై దృష్టిసారించి నియోజకవర్గాల అధికారపార్టీ ఇన్‌చార్జిలతో చర్చించడంతోపాటు సంబంధిత ప్రాంతాలతో అనుబంధమున్న జిల్లా నేతల సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైసిపి ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో వారి ప్రాబల్యానికి అడ్డుకట్టవేసేందుకు దారులు వెతుకుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో కూడా సీనియర్ నేతలను అందుబాటులో ఉంటూ పార్టీ కార్యకలాపాల విషయంలో జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డికి బాధ్యతలు అప్పగించి పులివెందుల నియోజకవర్గంలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ బిటెక్ రవి, పార్టీ శిక్షణ తరగతుల శిక్షణ డైరెక్టర్ రామ్‌గోపాల్‌రెడ్డిలను సమన్వయంచేసి పులివెందులపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు అధికారపార్టీ కార్యకర్తలకే అందేలా సంబంధిత అధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్‌టిఆర్ గృహాలు, పెన్షన్లు, రేషన్‌కార్డులు కూడా టిడిపి కార్యకర్తలకే ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. మంత్రి జిల్లాలో పర్యటించిన సమయంలో ఆయన వెంటే జిల్లా అధికారులు ఉండేలా ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి ఆది కూడా గతంలోకంటే ప్రస్తుతం తనశైలిలో మార్పు తెచ్చుకుని నిదానమే ప్రధానమని తరహాలో అధికారయంత్రాంగంపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. మొత్తంమీద ఆదినారాయణరెడ్డి జిల్లాలో పులివెందుల, జమ్మలమడుగుపైనే ప్రత్యేక దృష్టిసారించినట్లు స్పష్టవౌతోంది.