కడప

అభివృద్ధిలో రాజంపేట ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, ఆగస్టు 15:రాష్ట్రంలోనే రాజంపేట నియోజకవర్గం మూడేండ్ల ప్రభుత్వ పాలనలో ఎంతో పురోభివృద్ధి సాధించిందని, ఒక మాడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్నట్లు విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక సబ్‌కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా మేడా పాల్గొన్నారు. ముందుగా ఎన్‌సిసి విద్యార్థుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆర్డీఓ వీరబ్రహ్మం, వివిధ శాఖల అధికారులతో కలసి దేశ మువ్వెన్నల జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా మేడా ప్రజలను ఉద్ధేశించి మాట్లాడుతూ రాజంపేటలో అత్యాధునిక వైద్య సదుపాయాల కల్పనలో భాగంగా సూపర్ స్పెషాలటీ హస్పటల్ సాధన దిశగా రూ. 5.74 కోట్లతో ఆస్పత్రిలో క్యాజువాలిటీ, ఒపి బ్లాక్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. వంద పడకల ఆస్పత్రిగా తీర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఒంటిమిట్ట చెరువుకు సోమశిల జలాల మళ్లింపునకు రూ. 34.74తో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి పలు ప్రాంతాలలో వ్యవసాయ భూములు సస్యశ్యామలం అయ్యేలా సీఎం చంద్రబాబునాయుడు కృషితో చేశామన్నారు. రాష్ట్రంలోని ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామని, ఇప్పటికే దేశ నలుమూలల ఖ్యాతిని చాటి చెప్పామన్నారు. నియోజకవర్గంలో దాదాపు వంద కోట్లతో 819 పనులు పూర్తి చేయడం జరిగిందని, దేవాదాయ శాఖ ద్వారా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలను జరిపేలా మరో అయోధ్యగా ఒంటిమిట్ట రామాలయాన్ని తీర్చిదిద్దామన్నారు. 2013 ఆర్థిక సంవత్సరానికి గాను ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు కమ్యూనిటీ హాల్స్, సిసి రోడ్లకు కోట్లాది రూపాయలతో ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. గ్రామీణ నీటి సరఫరాకు నియోజకవర్గంలోని 6 మండలాల్లో 260 పనులకు రూ. 95 కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో నివారణకు ప్రత్యేక నిధులతో చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ముస్లీం, మైనార్టీ ప్రజల కోసం ఈద్గా మైదానంలో వౌలిక సదుపాయాలు, ప్రహరీ నిర్మాణంకు రూ. 45 లక్షలు మంజూరు చేశామన్నారు. బైపాస్‌లోని షాదీఖానాకు రూ. 23 లక్షలు మంజూరు చేసి అభివృద్ధి పరచామన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని దేశం గర్వపడేలా ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు దేశభక్తి గేయాలతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, విన్యాసాలు పలువురిని అలరించాయి. డివిజన్‌లోని వివిధ శాఖలలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు, మెమొంటోలను విప్ మేడా, ఆర్డీఓ వీరబ్రహ్మం అందజేశారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లను విప్ మేడా, ఆర్డీఓ వీరబ్రహ్మం, పలువురు అధికారులు పరిశీలించారు.

నదుల అనుసంధానంతో జిల్లాకు నీరు..

కడప,ఆగస్టు 15: నదుల అనుసంధానం ద్వారా జిల్లాకు నీరు తెస్తామని, పంట సంజీవినిలో కడప జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలోకి తీసుకొచ్చామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. 71వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని మంగళవారం నగరంలోని పోలీసు పేరేడ్ మైదానంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హార్టికల్చర్ హబ్‌గా జిల్లాను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి అనేక చర్యలు తీసుకుంటున్నామని గుర్తు చేశారు. నదుల అనుసంధానంలో భాగంగా కృష్ణా, గోదావరి జలాలను అనుసంధానం, పట్టిసీమ ద్వారా గండికోటకు నీరు తెప్పించి తద్వారా జిల్లాలో సాగునీరు, తాగునీరు ఇవ్వడమే తమ ధ్యేయమన్నారు. వందశాతం సబ్సిడీతో సూక్ష్మనీటి పథకం కింద పంటల అభివృద్ధికి తోడ్పానందించడమే ప్రభుత్వ కర్తవ్యమన్నారు. బిందుసేద్య పరికరాలు ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం సబ్సిడీతో ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, అలాగే 90శాతం సబ్సిడీతో 10 ఎకరాలకు పైబడిన రైతులకు రూ.2లక్షల వ్యయం వరకు బిందుసేద్యం పరికరాలు అందిస్తున్నామని, 50శాతం సబ్సిడీతో రూ.4లక్షలు వరకు సూక్ష్మబిందుసేద్య పరికరాలు పంపిణీ చేస్తున్నామని, గత ఏడాది రూ.160.49కోట్లు ఖర్చు చేశామని, ఈ ఏడాది 28,200 హెక్టార్లలో సూక్ష్మసేద్యపు పరికరాలు పంపిణీ చేసేందుకు లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికే 17వేల హెక్టార్లలో పంపిణీకి ఏర్పాటు చేశామని, అలాగే వర్షాభావ పరిస్థితులు సంభవించడంతో వేరుశెనగ పంటను కాపాడుకునేందుకు జిల్లాకు 242 రెయిన్‌గన్స్, 312 స్పింకర్లను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని మంత్రి సోమిరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాను రెండంకెల వృద్ధిరేటు సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం తొలిప్రాధాన్యత ప్రజలకే ఇవ్వాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ప్రజలే ముందు (పీఫుల్‌ఫస్ట్) అనే పేరిట కాల్‌సెంటర్‌ను ఏర్పాటుచేశారని ప్రజలు 1100 టోల్‌ఫ్రీనెంబర్‌కు ఫోన్‌చేసి వారి సమస్యలు, ఫిర్యాదులు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేశారన్నారు. అలాగే జిల్లాస్థాయి అధికారులు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతివారం షెడ్యూల్ ప్రకారం రాత్రి పూట పల్లెనిద్ర చేయాలని ప్రభుత్వం అధికారులకు ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ ఉత్తర్వులు జిల్లాస్థాయి అధికారులు తు.చ తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులకు పంట రుణాలు రూ.3.838 కోట్ల లక్ష్యంగాపెట్టుకుని ఇప్పటి వరకు రూ.2.490కోట్లు మంజూరు చేశామన్నారు. కౌలు రైతులకు జిల్లా వ్యాప్తంగా 13.350 మంది రైతులకు రూ.1.64కోట్లు మంజూరుచేశామని, అలాగే రుణమాఫీ పథకం కింద 3.54 లక్షల మంది రైతులకు రూ.668.46కోట్లు ఇప్పటికే వారి ఖాతాల్లో జమచేశామని పేర్కొంటూ రైతుల పొలాల్లో మట్టినమూనాలు సేకరించి భూసార పరీక్షలు చేసి లక్షా 65వేల మంది రైతులకు భూసార పరీక్షల కాపీలు అందజేశామని పేర్కొన్నారు. రైతులకు రాయితీపై యంత్రపరికరాలు పంపిణీ చేసేందుకు రూ.43.19కోట్లు మంజూరు చేశామని, అలాగే జిల్లా వ్యాప్తంగా 221 చంద్రన్న రైతు క్షేత్రాలను కోటిరూపాయల వ్యయంతో నిర్వహిస్తున్నామన్నారు. గత ఏడాది ఖరీఫ్‌లో కరవువల్ల పంట నష్టపోయిన 64వేలమంది రైతులకు రూ.77కోట్లు ఇన్‌ఫుట్ సబ్సిడీని వారి ఖాతాల్లో జమచేశామని, అలాగే వాతావరణ ఆధారిత పంటల పథకం కింద 1.39లక్షల మందికి రూ.93.60కోట్లు వారి ఖాతాల్లో జమచేశామని పేర్కొన్నారు. జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నామని, ఇప్పటికే జిల్లాలో 22 రకాల ఉద్యానవన పంటలు, వాణిజ్యపరంగా 98.475 హెక్టార్లలో రైతులు సాగు చేస్తున్నారని రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ యోజన పథకం కింద గత ఏడాది రూ.25.19కోట్లు ఖర్చుచేశామని, ఈ ఏడాది రూ.25.73కోట్లు ఖర్చుచేసేందుకు ప్రణాళికలు రూపొందించి ఇప్పటికీ రూ.3.57కోట్లు ఖర్చు చేశామని, 32వేల మంది ఉద్యానవన రైతులకు రుణమాఫీ పథకం కింద రూ.67.35కోట్లు మాఫీ చేశామని తెలియజేశారు. జిల్లాలో ఎండిపోతున్న ఉద్యానపంటలకు నీటి తడులు అందించేందుకు రూ.10కోట్లు మంజూరు చేయగా ఇప్పటికే రూ.9.46కోట్లను 19.619 ఎకరాల్లోని ఉద్యనవనపంటలకు నీటిని అందించామని గుర్తు చేశారు. జిల్లాలో 1428 ఎకరాల్లో మలబరీ సాగును చేస్తున్నారని ఈ ఏడాది 81 ఎకరాల్లో నూతనంగా మలబరీ సాగులోకి తెచ్చామని పేర్కొన్నారు. పట్టుచేనేత కార్మికులకు నెలకు 4 కిలోల చొప్పున పట్టుదారం కొనుగోలుచేసేందుకు ప్రతినెలా రూ.1000లు బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నామని తెలుపుతూ గత ఏడాది పట్టుదారం కొనుగోలుకు రూ.5.63కోట్లు సబ్సిడీగా అందజేశామన్నారు. పాడి సంపదను అభివృద్ధి చేసేందుకు పశుసంవర్థకశాఖ అధికారులు గత ఏడాది రూ.15.31కోట్లు ఖర్చు చేశారని, ఈ ఏడాది ఇప్పటికే రూ.11.34కోట్లు ఖర్చు చేశామని, అలాగే ఈ ఏడాది ఊరూర పశుగ్రాస క్షేత్రాలను ఏర్పాటు చేసేందుకు రూ.23లక్షలతో 262 ఎకరాల్లో లక్ష్యంగా పెట్టుకున్నామని ఇప్పటి వరకు 2వేల ఎకరాలు పైబడి పశుగ్రాసం పెంచుతున్నామన్నారు. జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల ఫీజు రూ.16.72 కోట్లు లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ.4.39కోట్లు వసూళ్లు చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది పసుపు కొనుగోలుకోసం మార్క్‌ఫెడ్ ద్వారా రూ.6వేలు నుంచి రూ.6,500లు చొప్పున ధర నిర్ణయించి రైతుల నుంచి 1.83లక్షల క్వింటాళ్లను పసుపుకొనుగోలు చేశామని అలాగే రైతు బంధు పథకం ద్వారా రూ.3.46లక్షల వడ్డీలేని రుణాలను రైతులకు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో 1841 నీటి పారుదల, 4 మధ్యతరహా నీటి పారుదల ద్వారా 1.71 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామని, అలాగే వర్షం నీటిని భూమిలో నిల్వ వుంచుకునేందుకు నీరు-చెట్టు పథకం ద్వారా గత ఏడాది 3180 పూడికతీత పనులను రూ.219కోట్లతో చేపట్టగా 2742 పనులకు రూ.181కోట్లతో పనులు పూర్తి చేశామని, దీని ద్వారా 1056 చెక్ డ్యామ్‌లు రూ.102కోట్లతో చేపట్టి నీరు నిల్వవుంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. మహిళా సాధికారతను బలోపేతం చేసేందుకు ఈ ఏడాది జిల్లాలో 50 మండలాల్లో 3.39లక్షల మహిళల్లో 35వేల స్వయం సహాయ సంఘాలకు రూ.607కోట్లు వడ్డీలేని రుణాలు మంజూరు చేశామని ఇప్పటి వరకు రూ.73.42కోట్లు మహిళా సంఘాలకు అందజేశామన్నారు. ఎన్‌టిఆర్ భరోసా పథకం కింద 2.43లక్షల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు, చేనేత కార్మికులకు ప్రతినెలా రూ.26.36కోట్లు పెన్షన్లరూపంలో అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించేందుకు రూ.9.52కోట్లు జిల్లాలో ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. రెవెన్యూశాఖ ద్వారా నిరుపేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అలాగే ఆపద్భందు పథకం కింద ఈ ఏడాది 35మందికి రూ.17.50లక్షలు మంజూరుచేశామని, భారీ వర్షాలు పిడుగుపాటు వల్ల చనిపోయిన రెండు కుటుంబాలకు రూ.8లక్షలు ఆర్థికసాయంగా అందించామన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికింద ఈ ఏడాది జిల్లాలో రూ.10లక్షలు, గత ఏడాది 1142 మందికి రూ.1.72కోట్లు మంజూరు చేసి పంపిణీ చేశామని, జిల్లాలో భూమిలేని 4218 మంది ఎస్సీ రైతులకు 7687 ఎకరాలు అసైన్డ్భూములు గుర్తించామన్నారు. అలాగే 4181మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జిల్లాలో ఆస్తిపాస్తులు లేని 183 దేవాలయాలకు ధూపదీప నైవేధ్యం కింద ఒక్కో దేవాలయానికి రూ.5వేలు చొప్పున అందిస్తున్నామన్నారు. ఈ వేడుకల్లో జిల్లా మంత్రి సి.ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్‌నాయుడు, ఎమ్మెల్సీ బిటెక్ రవీంద్రారెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసారెడ్డి(వాసు), డిప్యూటీ మేయర్ బి.ఆరిఫుల్లా జిల్లా అధికారులు తదితరు పాల్గొన్నారు. తొలుత మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేశారు. అనంతరం పోలీసులు చేసిన మార్చ్ఫాస్ట్‌ను తిలకించి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం వివిధ శాఖలు ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలను తిలకించి వారిని అభినందించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల వారిని ఘనంగా సన్మానించారు.

కన్నుల పండువగా శ్రీ కృష్ణుని కల్యాణోత్సవం
నందలూరు, ఆగస్టు 15:అరవపల్లెలో వెలసిన శ్రీ కృష్ణ మందిరంలో మంగళవారం రుక్మిణీ, సత్యభామ సమేతంగా శ్రీ కృష్ణుని కల్యాణోత్సవం కన్నుల పండువగా భక్తుల గోవిందనామ స్మరణల మధ్య అంగ రంగ వైభవంగా జరిగింది. వేద పండితులు బండాత్మకూరు శివకుమార్‌శర్మ బృందంచే వేద మంత్రోచ్చరణలు, మేళతాళాల మధ్య దేవేర్లతో స్వామివారి కల్యాణోత్సం అభిజిత్ లగ్నంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఘట్టాన్ని పసుపులేటి శివశంకర్ వాఖ్యాతగా వివరించిన తీరు భక్తులను ఆకట్టుకుంది. తొలుత టిడిపి మండల అధ్యక్షులు బి.లక్ష్మీనరసయ్య కల్యాణోత్సవానికి ముత్యాల తలంబ్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బి ఆవరణలో ఏర్పాటు చేసిన పండరీ, చెక్క్భజనలు భక్తులను ఆకట్టుకుంది. చిన్నారులు గోపికలు, రుక్మిణీ, సత్యభామ, శ్రీకృష్ణుని వేషధారణలతో అందరిని అలరించారు. మండల శ్రీకృష్ణ పాద సేవకుల సంఘం భక్తాదులకు అన్నదానం నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల రామ్‌ప్రసాద్, మండల సర్పంచుల సంఘ అధ్యక్షులు సమ్మెట శివప్రసాద్, ఎంపీటీసీ శ్రీరాములు, టిడిపి నాయకులు పల్లె నాగయ్య, నారపుశెట్టి శివ, తాటి సుబ్బరాయుడు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారి లడ్డుకు వేలం నిర్వహించగా బిజెపి నాయకులు కానకుర్తి వెంకటయ్య రూ. 7,500 దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాద సేవకులు కుర్రామణియాదవ్, హిమగిరినాథ్, మధుయాదవ్, వేణు, బెస్త సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

అధికారులకు ప్రశంసా పత్రాలు
* పనితీరును కొనియాడిన మంత్రి సోమిరెడ్డి
కడప,(కల్చరల్)ఆగస్టు 15: జిల్లాలో వివిధశాఖల్లో అధికారులు, సిబ్బంది సేవలందించడంలో అత్యున్నత స్థాయిలో నిలచిన 318మంది అధికారులు, సిబ్బందిని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వారి ప్రతిభపై ప్రతి ఒక్కరినీ ఆయన ప్రశంసించారు. 71వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా మంగళవారం నగరంలోని పోలీసుపేరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో ఆయన జిల్లాలోని అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేసి వారిని కొనియాడారు. ప్రశంసలు పొందిన అధికారుల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ -2 బి.శివారెడ్డి, డిఆర్వో నరసింహరావు, స్పెషల్ కలెక్టర్ ఎస్వీ నాగేశ్వరరావు, ఆర్డీవోలు వీరబ్రహ్మం, చిన్నరాముడు, డ్వామా పిడి విజయకుమార్, మున్సిపల్ కమిషనర్ చంద్రమోహన్‌రెడ్డి, ఏపిఎంఐపి పిడి మధుసూధన్‌రెడ్డి, నేషనల్ ఇన్పర్మేషన్ జిల్లా అధికారి టిఆర్ విజయకుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఇడి శ్రీలక్ష్మి, బిసి కార్పొరేషన్ ఇడి రామచంద్రారెడ్డి, సిపివో తిప్పేస్వామి, డిఇవో శైలజ, ఆర్‌జెడి ప్రతాప్‌రెడ్డి, హౌసింగ్ పిడి ఎస్వీ ఆర్ ప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ ఐఅండ్‌పిఆర్ ఏడి అబ్దుల్ఫ్రిక్, వ్యవసాయశాఖ జిల్లా అధికారి ఠాగూర్‌నాయక్, డిఎంహెచ్‌వో డా.రామిరెడ్డి, పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారి సంజీవరావు, రాజంపేట డివిజనల్ ఫారెస్టు అధికారి ఖాదర్‌వల్లీ, ప్రొద్దుటూరు డివిజనల్ ఫారెస్టు అధికారి రవిశంకర్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఎం.బసిరెడ్డి, మైనర్ ఇరిగేషన్ అధికారి కె.గోపాల్‌రెడ్డి, తెలుగుగంగ ప్రాజెక్టు ఇడి ప్రతాప్, కడప డివిజనల్ ఫారెస్టు అధికారి సోమశేఖర్, జిల్లాపోలీసు అధికారులు క్రైం డిఎస్పీ జి.నాగేశ్వరరెడ్డి, ట్రాఫిక్ డిఎస్పీ భక్తవత్సలం, ఫ్యాక్షన్ జోన్ డిఎస్పీ బి.శ్రీనివాసులు, మైదుకూరు ఎస్‌డిపివో బిఆర్ శ్రీనివాసులు, సిఐలు కె.పుల్లయ్య, టి.శ్రీనివాసులురెడ్డి, జి.ఓబులేసు, వై.వెంకటేశ్వర్లు, హనుమంత్‌నాయక్, ఎస్.పద్మనాభం, నారాయణప్ప, ఎస్‌ఐలు ఎన్.రాజేశ్వరరెడ్డి, హేమకుమార్, ఎం.్భస్కర్‌రెడ్డి, ఎస్.వినోద్‌కుమార్, ఆర్‌వి కొండారెడ్డి, అన్సర్‌బాషా, పి.మైనుద్దీన్, కృష్ణంరాజునాయక్, సునీల్‌కుమార్‌రెడ్డి, వెంకటేశ్వర్లు కె.వెంకటరమణ, ఎల్.జీవన్‌రెడ్డిలు, అలాగే లీడ్‌బ్యాంకు మేనేజర్ ఆంజనేయచారి, నాబార్డు ఏజిఎం బి.శ్రీనివాసులు, ఎస్‌బిఐ రీజనల్ మేనేజర్లు సందీప్, నంబియార్, జి.శ్రీనివాసులు, సిండికేట్ బ్యాంక్ ఆర్‌ఎం ఆర్.అనూరాధ, ఏపిజిబి ఆర్‌ఎంలు విసికె ప్రసాద్, పి.ఓబయ్య, ఏపిజిబి నేజర్లు ఎన్.రామకృష్ణ, టి.ఆదినారాయణరెడ్డి, ఎస్‌బిఐ మేనేజర్లు ఆనందబాబు, ఎన్.రాజేష్, సిండికేట్ బ్యాంకు మేనేజర్లు ఎం.వెంకటేశ్వరప్రసాద్, జి.ఆరిఫ్‌తోపాటు తహశీల్దార్లు గుణభూషణ్‌రెడ్డి, జి.శ్రీనివాసులు, మహబూబ్‌చాన్, డిప్యూటీ తహశీల్దార్లు ఎస్‌ఏ నజీర్ అహ్మద్, మనోహర్‌రెడ్డి, కలెక్టర్ ఆఫీస్ సూపరింటెండెంట్ నరసింహులు, సీనియర్ అసిస్టెంట్లు కలందర్, కె.శ్రీనివాసులు, బి.జనార్దనరెడ్డి, కె.శివారెడ్డి, రామకిశోర్, జూనియర్ అసిస్టెంట్లు నరేంద్ర, వేణుగోపాల్, ప్రమోద్‌లతోపాటు జిల్లాలోని వివిధ శాఖల అధికారులకు ప్రశంసాపత్రాలు ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్‌నాయుడు, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ ఎం.లింగారెడ్డి, ఎమ్మెల్సీ బిటెక్ రవీంద్రారెడ్డి, ఎమ్మెల్యే జయరాములు, గ్రంథాలయ చైర్మన్ రమణారెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసారెడ్డి (వాసు), జిల్లా కలెక్టర్ టి.బాబూరావునాయుడు, ఎస్పీ అట్టాడ బాబూజీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

వాడవాడలా రెపరెపలాడిన మువ్వనె్నల జెండా

కడప,(కల్చరల్)ఆగస్టు 15: 71వ స్వాతంత్య్రదినోత్సవం పురస్కరించుకుని మంగళవారం నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలతోపాటు పలు సంఘాల ఆధ్వర్యంలో మువ్వనె్నల జెండా రెపరెపలాడింది. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల కరస్పాండెంట్స్, యాజమాన్యాలు, ముఖ్యఅతిధులు వచ్చి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాడి స్వాతంత్య్రం తెచ్చిన నేతల గురించి విద్యార్థులకు వివరించారు. అలాగే మహాత్మగాంధీ యొక్క జీవిత విశేషాలు స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన వహించిన ప్రధానపాత్రపై, చేసిన ఉద్యమాలపై క్షుణ్ణంగా వివరించారు. అనంతరం విద్యార్థులచేత దేశభక్తి గీతాలు పాడించారు. అలాగే స్వాతంత్య్ర ఉద్యమంపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి, స్వీట్లు, చాకెట్లు పంచిపెట్టారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప నగర సమీపంలోని రామాంజనేయపురంలో ఉన్న హెల్లన్ కెల్లర్ (బధిరుల) ఉన్నత పాఠశాల, కళాశాలలో మంగళవారం ఆ కళాశాల కరస్పాండెంట్ డా.పి.దౌలత్‌ఖాన్, ప్రిన్సిపాల్ మసూదాబేగంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. నగర సమీపంలోని వౌంట్‌ఫోర్ట్ స్కూల్‌లో 71వ స్వాతంత్య్రవేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్ జోసఫ్ త్రివర్ణపతాకాన్ని ఎగురవేసి వందనం స్వీకరించారు. 71వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మంగళవారం స్థానిక చిన్నచౌకు అశోక్‌నగర్‌లోని హోలీ జీసస్ క్రైస్ట్ కేథడ్రిల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్య్ర పోరాటాలను వివరించారు. తొలుత బిషప్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. నగర సమీపంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్దవున్న మండల పరిషత్ స్కూల్‌లో హెడ్మాస్టర్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం 71వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్య్ర సమరయోధుల దేశానికి చేసిన సేవలు, వారి వల్లవచ్చిన స్వాతంత్య్రఫలాలు విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు చెన్నకేశవరెడ్డి, శివరామ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు,చాక్లెట్లు పంచిపెట్టారు.
జిల్లాకోర్టు ప్రాంగణంలో...
కడప, లీగల్: భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడి మనకు స్వేచ్ఛావాయువులు అందించిన ఉద్యమ ఫలాలు మనం పొందుతున్నామని జిల్లా ప్రధాన జడ్జి జి.శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లాకోర్టు ప్రాంగణంలో 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణపతాకాన్ని ఉదయం 8.30గంటలకు ఎగురవేసి ఆతర్వాత న్యాయశాఖ ఉద్యోగులను, న్యాయవాదులనుద్దేశించి మాట్లాడుతూ మన జాతిపిత మహాత్మాగాంధీ శాంతియుతం ద్వారా ఎన్నో పోరాటాతో స్వాతంత్య్రం సిద్దించిందని వారు పోరాట ఫలితంగా మనం స్వేచ్ఛావాయువులను పీల్చుకుంటున్నామన్నారు. వారు నడిచిన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడుచుకుని దేశానికి గర్వించే వ్యక్తులుగా తయారుకావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం న్యాయవాదుల సంఘం భవనంలో అధ్యక్షుడు మస్తాన్‌వల్లీ త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని న్యాయవాదులు ఆలపించారు. ఈకార్యక్రమానికి నాల్గవ అదనపు జడ్డి అన్వర్‌బాషా, మొదటి అదనపు జడ్జి శ్రీనివాసమూర్తి, సబ్ జడ్జి సుభవాణి, ఫ్యామిలీ జడ్జి ఎస్.ప్రసాద్, లోక్ అదాలత్ కార్యదర్శి యు.యు.ప్రసాద్, విశాఖపట్టణం సీనియర్ సివిల్ జడ్జి సుబ్బారెడ్డి, జూనియర్ జడ్జిలు శోభారాణి, ఎక్సైజ్ మేజిస్ట్రేట్ అశోక్‌కుమార్, న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు రాజగోపాల్‌రెడ్డి, కార్యదర్శి శ్రీనివాసులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అట్లూరులో...
అట్లూరు: మండలంలోని స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం 71వ స్వాతంత్య్రవేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ ఈశ్వరయ్య తన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అలాగే పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐ మహ్మద్ రఫి, కస్తూరిబా గురుకుల పాఠశాలలో ప్రత్యేక అధికారిణి అరుణ, జడ్పి ఉన్నతపాఠశాలల్లో ఎంపిడివో కార్యాలయంలో ఎంపిడివో రెడ్డినాయుడు, ఎంఇవో కార్యాలయంలో ఎంఇవోలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే మండలంలోని అన్ని ప్రభుత్వపాఠశాలల్లో ఆయా ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాలను ఎగురవేసి విద్యార్థులకు మిఠాయిలుపంచిపెట్టారు.
చెన్నూరులో..
చెన్నూరు: మండలంలో 71వ స్వాతంత్య్రవేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. స్థానిక ఎంపిడివో కార్యాలయంలో ఎండిపివో మహబూబ్‌బీ, మండల పరిషత్ అధ్యక్షురాలు బాలమ్మ, పోలీసుస్టేషన్, తహశిల్దార్ కార్యాలయాలతోపాటు వివిధ ప్రభుత్వకార్యాలయాల్లో జాతీయ పతాకాలు ఎగురవేశారు. ప్రభుత్వపాఠశాలల్లో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పతాకాన్ని ఎగురవేశారు.
చింతకొమ్మదినె్నలో...
చింతకొమ్మదినె్న: సికెదినె్న మండల పరిధిలోని పలు ప్రభుత్వకార్యాలయాలు, పాఠశాలల్లో 71వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా ముగిశాయి. మండల తహశిల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ మధసూధన్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవవందనం చేశారు. ఎంపిడివో కార్యాలయంలో ఎంపిడివో రామచంద్రారెడ్డి ,మండల విద్యాశాఖాధికారి నాగమునిరెడ్డి జాతీయ పతాకాలు ఎగురవేశారు. సికెదినె్న పోలీసుస్టేషన్ ఆవరణంలో ఎస్‌ఐ హేమకుమార్, కృషివిజ్ఞాన కేంద్రంలో కో-ఆర్డినేటర్ డా.వీరయ్య, ఊటుకూరు వ్యవసాయ పాలిటెక్నికల్ కళాశాలలో డా.కరుణాసాగర్, బయనపల్లె వెంకటేశ్వర ఉన్నతపాఠశాలలో హెచ్‌ఎం దీనదయాల్, సికెదినె్న జెడ్పిహైస్కూల్‌లో ఎంఇవో నాగమునిరెడ్డితోపాటు ఆయా పాఠశాలలకు సంబంధించిన ప్రధానోపాద్యాయులు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం స్వీకరించారు. అనంతరం విద్యార్థులు దేశభక్తిగీతాలు ఆలపించారు. విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు.
ఖాజీపేటలో..
ఖాజీపేట: మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి సుమలత, ఎంపిడివో అజముద్దీన్, ఇవోఆర్డీ రాధాకృష్ణవేణి, తహశీల్దార్ కార్యాలయంలో శివరామయ్య, పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐ రంగారావులు జాతీయ జెండాను ఎగురవేశారు.
బి.కోడూరులో..
బి.కోడూరు: మండలంలో 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అన్నిప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాల్లో మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జెడ్పిటిసి రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రదినోత్సవంలో పాల్గొన్న సమరయోధుల గురించి వివరిస్తూ పేద, ధనిక, కులమతాలకు అతీతంగా స్వాతంత్య్రం వచ్చిందన్నారు. అలాగే తహశీల్దార్ దుగ్గిరెడ్డి, వ్యవసాయశాఖ కార్యాలయంలో చంద్రమోహన్‌రెడ్డి, ప్రభుత్వవైద్యశాలలో డాక్టర్ శివకృష్ణ, రామసముద్రం ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ సుబ్బరత్నమ్మతోపాటు అన్ని ప్రభుత్వకార్యాలయాల్లో ఆయాశాఖల అధికారులు, ప్రభుత్వపాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు త్రివర్ణపతాకాన్ని ఎగురవేసి గౌరవవందనం చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు.

పెండ్లిమర్రిలో...
పెండ్లిమర్రి: ఘనంగా 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మండలంలోని తహశీల్దార్ కార్యాలయం, ఎంపిడివో కార్యాలయం, రక్షకభట నిలయం, మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, సంస్థల్లో మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటగా తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో తహశీల్దార్ ఆంజనేయులు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందన స్వీకరించారు. పోలీసు అధికారులు మార్చ్ఫాస్ట్ చేసి వందనం స్వీకరించారు. ఎంపిడివో సభాభవన్‌లో ఎంపిపి అనూరాధ, రక్షక భట నిలయంలో ఎస్‌ఐ రోషన్, మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఎంఇవో సుజాత, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలయొక్క యాజమాన్యాలు జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు.