కడప

కౌలు రైతు పరిస్థితి దా‘రుణం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మలమడుగు, ఆగష్టు 22: కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తామని ప్రభుత్వం చెప్పే మాటలు ప్రచారానికే పరిమితమవుతున్నాయి. పరపతి అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, రుణాలు, దళారీల ప్రమేయం, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని వ్యవసాయానే్న నమ్ముకొని సాగుచేస్తున్న కౌలు రైతుకు ప్రభుత్వం నుండి అందుతున్న సాయం కొసరంతే నష్టపరిహారాలు, రుణసాయం, ఇన్‌పుట్ సబ్సిడీ, ధాన్యం కొనుగోలు తదితరాలన్నింటిలో ఏటేటా మోసపోతూనే ఉన్నాడు. 2001 భూ అధీకృత చట్టం అమల్లోకి వచ్చి ఆరేళ్లవుతున్నా ఇప్పటికీ అనుకున్నంత స్థాయిలో ప్రయోజనాలు అందుకోలేదు. ఈ ఏడాది ఏరువాక సాగుకాలం ప్రారంభం అయినప్పటి నుండి ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగుకు రైతులు పూర్తి స్థాయిలో ఉపక్రమించారు. అయితే సాగుకు అవసరమైన ఖర్చుల కోసం కౌలు రైతులు అప్పులకై అగచాట్లు తప్పడం లేదు. వివిధ కారణాలతో బ్యాంకర్లు అప్పుడే అప్పులు ఇవ్వమంటూ వాయిదాలు వేస్తూండడంతో కౌలు రైతులకు ఈ ఖరీఫ్ సీజన్‌లోనూ రుణ తిప్పలు తప్పడం లేదు. కౌలు రైతులకు పంటలు సాగుకుపక్రమించే సమయానికే బ్యాంకర్లు పంట రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్దేశిత లక్ష్యాలను నిర్దేశిస్తున్నా క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు ఇవ్వడం లేదు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 14వేల మంది కౌలు రైతులకు పంట రుణాలు బ్యాంకర్ల ద్వారా మంజూరు చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. అయితే రెవెన్యూ శాఖ ద్వారా కౌలు రైతులకు పంపిణీ చేయాల్సిన రుణ అర్హత పత్రాలు ఇప్పటి వరకు దాదాపు 5వేల మందికి మాత్రమే పంపిణీ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నారు. రుణ అర్హత పత్రాల పంపిణీలోనే ఇంతదారుణమైన పరిస్థితి నెలకొని ఉంటే బ్యాంకర్ల నుండి రుణాలు కల్పించడంలో మరింత దయనీయ పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 500 మంది కౌలు రైతులకు మాత్రమే పంట రుణాలను మంజూరు చేశారు. కొన్ని బ్యాంకు శాఖల్లో భూయజమాన్ని ధృవీకరణ పత్రాలను చూపిస్తే గానీ రుణాలు ఇవ్వమంటూ మెలికలు పెడుతున్నారు. మరికొంత మంది బ్యాంకర్లు కౌలు రైతులకు రుణాలు కల్పించేందుకు ప్రభుత్వం నుండి మరింత స్పష్టమైన ఆదేశాలు లేవంటూ దాటవేస్తున్నారు. బ్యాంకర్ల రుణాలు కల్పించడంలో వాయిదాల పర్వం కొనసాగిస్తూండడంతో గత్యంతరం లేక కౌలు రైతులు బయట వడ్డీ వ్యాపారస్థులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇలా బయట వడ్డీలకు రుణాలు తీసుకున్న వారి మరణాల రేటే ఎక్కువగా రైతన్న ఆత్మహత్యల్లో ప్రస్ఫుటం అవుతూండడం ఆందోళన చెందాల్సిన అంశం. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో కౌలు రైతులకు ఎల్‌ఈసి, సిఓసి పత్రాలు కల్పించడం, వాటికి అనుగుణంగా బ్యాంకర్లతో మాట్లాడి కౌలు రైతులకు బ్యాంకర్ల నుండి రుణాలు అందేలా జిల్లా కలెక్టర్ టి.బాబూరావు నాయుడు చర్యలు తీసుకొని కౌలు రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.