కడప

త్వరలో గ్రామీణులపై పన్నులభారం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమలాపురం, ఆగస్టు 22: పంచాయతీల ఆదాయం పెంచుకునేందుకు వీలుగా ప్రభుత్వం పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో గ్రామీణస్థాయిలో ఇళ్ల సర్వే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా పంచాయతీ గ్రామకార్యదర్శులు తమ సిబ్బందితో కలసి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఇళ్లకు సంబంధించి స్థలాలను, ఇంటిని కొలతలు వేసి నమోదు చేస్తున్నారు. ఆ ఇళ్లనిర్మాణాలు ఎంతో విస్తీర్ణంలో నిర్మాణం చేశారో, కొలతలు వేసి సర్వే చేస్తున్నారు. ఇందులో ఉండే ఇళ్లకట్ట్ఢాలు పాత, కొత్త రకాలను నమోదు చేస్తున్నారు. ఆ ఇళ్లకు ఒక్కో అసెస్‌మెంట్ నంబరును నమోదు చేస్తున్నారు. ఈ వివరాలన్నింటిని కూడా పంచాయతీ కార్యాలయాల్లో కంప్యూటరైజ్ చేస్తున్నారు. ఈఅసెస్‌మెంటు నంబరుకు భవన యజమాని ఆధార్‌కార్డుతో లింకప్ చేయనున్నారు. ఇదివరలో మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఉండే ఆన్‌లైన్ విధానాన్ని పంచాయతీల్లో కూడా నమోదు చేయనున్నారు. 150 ఇళ్లను ఒక వార్డుగా విభజించే కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కార్యాచరణ సిద్దం చేశారు. ఇందుకోసం ప్రత్యేక యాప్ ద్వారా ఇళ్ల వివరాలను పంచాయతీ సిబ్బంది సేకరిస్తున్నారు. అనంతరం వీటిని ఆన్‌లైన్‌లో పొందుపరచడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఐతే సిబ్బంది పంచాయతీల్లో ఈ ఇళ్లవివరాలను సేకరిస్తుండడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తవౌతోంది. ఇప్పటివరకు గ్రామీణప్రాంతాల్లో రాజకీయవత్తిళ్లతో అధికారులతో ఉన్న సంబంధాలతో పన్ను తక్కువగా చెల్లించే వారు. ఈ ఆన్‌లైన్ విదానం అమలులోకి వస్తే ఇంటిపన్నులు రెండుమూడురెట్లు అధిక మయ్యే అవకాశం ఉందని ఆందోళన పడుతున్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు సైతం వదలకుండా ఇళ్ల పన్నులు విధించి ప్రజలనుంచి భారీగా పన్నులు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోందని పలువురు మండి పడుతున్నారు. అలాగే పంచాయతీ అధికారుల సర్వేలో మహడి ఇళ్లను, ఇంటిలో ఉండే మంచినీటి సౌకర్యాలను, విద్యుత్ సౌకర్యాలను సేకరిస్తుండడంతో తమ ఇళ్లకు పన్నులు అధికమవుతాయేమోనని, అలాగే కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లను సైతం సేకరిస్తుండడంతో వీటన్నింటికి కూడా మునిసిపాలిటీ తరహాలో పన్నుల భారం ఉంటుందేమోనని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోందని ఇందువల్ల పేదప్రజలకు తీవ్ర ఆర్థికభారం పడుతుందని వైసిపి జిల్లా రైతునేత పుత్తా ప్రసాదరెడ్డి విమర్శించారు.