కడప

సిఎం రాక సందర్భంగా భారీ బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఏప్రిల్ 19: ఒంటిమిట్ట కోదండరామయ్య కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విచ్చేస్తున్నందున జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఇందుకోసం సుమారు 2వేల 500మంది వినియోగిస్తున్నారు. బుధవారం మద్యాహ్నం 3 గంటల నుంచి హైవేలో రాకపోకలు నిలిపివేస్తున్నారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు, భారీ వాహనాలన్నీ రాజంపేట, రాయచోటి మీదుగా మళ్లించనున్నారు. అదేవిధంగా కడప నుంచి తిరుపతి వైపు వెళ్లే బస్సులు, భారీ వాహనాలు మాధవరం లోని సాయిబాబా ఆలయం వద్ద నుంచి ఒంటిమిట్ట మండలంలోని సాలాబాదు, మలకాటిపల్లె మీదుగా స్థానిక ఒంటిమిట్ట చెరువుకట్ట నుంచి మళ్లిస్తారు. కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రితోపాటు ప్రజాప్రతినిధులు, విఐపిలు వస్తున్న నేపధ్యంలో భారీ స్థాయిలో పోలీసు బలగాలను మోహరించారు. అలాగే కల్యాణం సందర్భంగా విఐపిల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటుచేశారు. ఒంటిమిట్టలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌ను పోలీసు ఉన్నతాధికారులు పరీశీలించారు.
కల్యాణోత్సవానికి వచ్చే భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ సహకరించాల్సిందిగా ఎస్పీ గులాఠీ విజ్ఞప్తిచేశారు. ఎవరికి కేటాయించిన ప్రదేశాల్లో వారు మాత్రమే వాహనాలను నిలపాలని అన్నారు. విఐపిలు వస్తున్నందున బందోబస్తు అధికంగా ఉంటుందని అన్నారు. జిల్లా యంత్రాంగం, టిటిడి అథికారుల సమన్వయంతోనే ఏర్పాట్లు చేశామన్నారు.