కడప

టిడిపిలోకి వైకాపా ఎమ్మెల్యేలు.!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,సెప్టెంబర్ 16: ప్రతిపక్ష పార్టీకి చెందిన వైసిపి నుంచి నలుగురు ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆ పార్టీ అధిష్ఠానం ప్రతినిధులతోనూ, జిల్లా మంత్రి సి.ఆదినారాయణరెడ్డి నేతృత్వంలో సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. తమకు టిడిపి టికెట్ కేటాయింపుపై స్పష్టమైన హామి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఆ నాలుగు నియోజకవర్గాల్గోని టిడిపి నేతలు మాత్రం ఆ ఎమ్మెల్యేలు వస్తే మా పరిస్థితేంటని ఆందోళన చెందుతు, వారి రాకను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా వారం రోజుల క్రితం ఇరువురు ఎమ్మెల్యేలు బెంగళూరులో మంత్రి సి.ఆదినారాయణరెడ్డి సమక్షంలో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కడప పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన ఇరువురు వైసిపి ఎమ్మెల్యేలు, రాజంపేట పార్లమెంట్‌కు చెందిన మరో ఇరువురు వైసిపి ఎమ్మెల్యేలు వారం రోజుల కిందట టిడిపి నేతలతో ఎడతెరిపిలేకుండా చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గతంలో ఆ వైసిపి ఎమ్మెల్యేలు టిడిపి నేతలతో కూడా చర్చలు జరిపి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రంగంలో దిగడంతో వారు టిడిపిలో చేరకుండా విరిమించింది పాఠకులకు విధితమే. నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల అనంతరం వైసిపి నేతలు జీర్ణించుకోలేకపోవడం, పార్టీ మారితే తప్ప రాజకీయ భవిష్యత్ ఉండదని పలువురు వైసిపి ఎమ్మెల్యేలు భావించి పార్టీలు మారుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాజ్యాంగానికి వ్యతిరేకంగా అడ్డగోలు ప్రసంగాలే తమ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారని జిల్లాలో వైసిపి నేతలే అంటున్నారు. ఒక వేళ జగన్మోహన్‌రెడ్డికి తీరుమార్చుకోవాలని చెప్పాలన్నా నేతలు ఎవ్వరూ సాహసించలేకపోతున్నారు. ఈ తరుణంలో వైసిపిలో కొనసాగితే రాజకీయ భవిష్యత్ ఉండదని బహిరంగంగానే వైసిపి నేతలు ప్రచారం చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగిన వారే వైసిపిలో కొనసాగడం వారు తిరిగి తమ మాతృపార్టీలోకి రావడమే శ్రేయస్కరమేనని భావించి గతంలో వారికున్న టిడిపి నేతల సంబంధాలు ఈ చర్చల్లో కొంతమేరకు అనుకూలిస్తున్నట్లు తెలుస్తోంది. వైసిపి ఎమ్మెల్యేలు జిల్లాలోని తెలుగుదేశంపార్టీ నేతల ద్వారా వైసిపికి గుడ్‌బై కొట్టి టిడిపిలో చేరేందుకు సిద్దపడుతున్నట్లు తెలియవచ్చింది. అయితే టిడిపిలో చేరే వైసిపి ఎమ్మెల్యేలంతా 2019 ఎన్నికల్లో తమకు పార్టీ టికెట్ ఇస్తామంటే పార్టీలో చేరుతామని కొంతమంది కండిషన్లు పెడుతున్నారు. టిడిపి అధిష్ఠానం మాత్రం తొలుత పార్టీలో చేరి పనిచేయాలని తర్వాత టికెట్‌మాట మాట్లాడాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. టిడిపి అధిష్ఠానం వైసిపి ఎమ్మెల్యేలతో మాత్రం 2019కి ఎలాగూ వైసిపి అధికారంలోకి రాదని, టిడిపిలో చేరితే తగిన గుర్తింపు ఇస్తామని పార్టీలో చేరిన తర్వాత మాట్లాడుతామని సమాధానం ఇస్తుండటంతో పార్టీలో చేరేందుకు వైసిపి నేతలు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో తెలుగుదేశంపార్టీ నేతలు వైసిపి ఎమ్మెల్యేల వలసలపై నోరుమెదపకుండా వైసిపి ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తే తమ రాజకీయ భవితవ్యం ఏమిటని కూడా టిడిపి సీనియర్ నేతలు పునరాలోచనలో పడ్డారు. మొత్తంమీద నలుగురు వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరేందుకు పలువురు జిల్లా టిడిపి నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇటు టిడిపి, అటు వైసిపి నేతల భవితవ్యం కాలమే నిర్ణయించాల్సివుంది.

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో
నిరసనలకు తెర..

వేంపల్లె, సెప్టెంబర్ 16: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఒప్పంద అధ్యాపకుడిగా పనిచేస్తూ ఇటీవల మృతిచెందిన నాగరాజు కుటుంబానికి తోటి అధ్యాపకులు గత నాలుగైదు రోజులుగా మద్దతుగానిలిచి ట్రిపుల్ ఐటీలో ధర్నాలు, నిరసనలతో హోరెత్తించారు. దీంతో ట్రిపుల్ ఐటీ వైస్ ఛాన్స్‌లర్ రామచంద్రరాజు శనివారం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న అధ్యాపకులు, అధికారులు, విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యాపకుడు నాగరాజు మృతిపై కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టడం జరుగుతుందన్నారు. నాగరాజు భార్యకు యూనివర్శిటీ పరిధిలో నాన్ టీచింగ్‌ఉద్యోగం కేటాయిస్తామని తెలిపారు. అలాగే ఎక్స్‌గ్రేషియాకు సంబంధించి త్వరలో జరగనున్న వీసీల సమావేశంలో ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడం జరుగుతుందన్నారు. నాగరాజు మృతిపై మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ప్రత్యేక విచారణ చేపట్టారన్నారు. నాగరాజు కుటుంబానికి సంబంధించి అటు యూనివర్శిటీ, ఇటు ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ఆ కుటుంబానికి తగిన న్యాయం జరుగుతుందన్నారు. యూనివర్శిటీలో ఉన్న మెస్‌లు అధ్వాన్నంగా ఉన్నాయని విద్యార్థులు పెద్దఎత్తున గగ్గోలు పెట్టారు. విద్యార్థుల మెస్‌లకు సంబంధించి కూడా త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన విద్యార్థులకు భరోసా ఇచ్చారు. యూనివర్శిటీ పరిధిలో ఆటస్థలం మరియు విద్యాభ్యాసం సరిగాలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆటస్థలం గురించి త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ప్రభుత్వానికి ఇదివరకే సిబ్బంది రెగ్యులర్ పోస్టుల గురించి నివేదిక సమర్పించామన్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే నాలుగు ట్రిపుల్ ఐటీల పరిధిలోని 260 మంది సిబ్బందిని రెగ్యులర్ చేయబోతున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ వెనె్నపూస గోపాల్‌రెడ్డి, వేంపల్లె ఎంపీపీ రవికుమార్‌రెడ్డి ట్రిపుల్ ఐటీలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. యూనివర్శిటీ సమస్యలు ఉన్నవి వాస్తవమేనని, త్వరలోనే అన్నిరకాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. దీంతో అధ్యాపకులు, సిబ్బంది ట్రిపుల్ ఐటీలలో చేస్తున్న ధర్నాలకు, నిరసనలకు తెరదించారు. ఈ కార్యక్రమంలో ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ భగవన్నారాయణ, ఏవో అమరేంద్ర, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.