కడప

సీఎంకు ఘనస్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,సెప్టెంబర్ 19: ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు మంగళవారం ఉదయం 10.05 గంటలకు స్థానిక ఎయిర్ పోర్టుకు చేరుకుని నంద్యాల పర్యటన నిమిత్తం వెళ్లారు. ఈ సందర్భంగా ఆయను జిల్లా నేతలు, అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారినుద్దేశించి సూచిస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులంతా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ టి.బాబూరావునాయుడును ఆదేశించారు. అవసరమున్నచోట పోలీసు యంత్రాంగం సహకరించాలని ఎస్పీ అట్టాడ బాబూజీకి సూచించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, రబీలో రైతులు సాగుకు అధికారులు పూర్తిగా సహకరించాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు నీరును నిల్వచేసేందుకు పంట సంజీవిని కుంటలను, చెక్‌డ్యామ్‌లను పెద్ద ఎత్తున నిర్మించి ప్రభుత్వ లక్ష్యాన్ని చేరాలని కూడా కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ టి.బాబూరావునాయుడు, ఎస్పీ అట్టాడ బాబూజీ, జాయింట్ కలెక్టర్ శే్వత తెవతియ, ఆర్డీవో చినరాముడు, డిఎస్పీ మాసూంబాషా పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశంపార్టీ నేతలు రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్‌నాయుడు, ఎమ్మెల్సీ బిటెక్ రవి, జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి (వాసు), మాజీ ఎమ్మెల్సీలు పుత్తానరసింహారెడ్డి, బచ్చల పుల్లయ్య, టిడిపి జిల్లా కార్యదర్శి బి.హరిప్రసాద్, టిటిడిబోర్డు మాజీ సభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.గోవర్దన్‌రెడ్డి తదితరులు సీఎంను కలిశారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ఏవిధంగా జిల్లాలో జరుగుతుందోనని నేతలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కార్యకర్త, ప్రతి నేత అందరూ ఏకతాటిపై ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని ప్రజల యోగక్షేమాలు తెలుసుకుని ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులకు అందుతున్నాయలోలేదోనని తెలుసుకుని అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన నేతలకు సూచించారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేస్తూ పార్టీకోసం కష్టించే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఇస్తామన్నారు. తిరిగి ముఖ్యమంత్రి నంద్యాల నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సాయంత్రం కడప ఎయిర్ పోర్టుకు చేరు కుని గన్నవరంకు బయలుదేరడంతో నేతలు, అధికారులంతా చంద్రబాబుకు ఘనంగా వీడ్కోలు పలికారు.