కడప

రేపటి నుంచి దసరాశరన్నవరాత్రి మహోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(కల్చరల్)సెప్టెంబర్ 19: అత్యంతవైభవంగా జరిగే దసరాశరన్నవరాత్ర మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్యసంఘం, ఉత్సవకమిటీ తెలిపింది. మంగళవారం స్థానిక అమ్మవారిశాలలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఉత్సవాల నిర్వహణ ,అమ్మవారి ప్రతిరోజు అలంకరణలతోపాటు భక్తులకు దర్శనభాగ్యం గురించి తెలియజేశారు. ప్రతి ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించే ఉత్సవాలు ఈ ఏడాది కూడా భక్తిశ్రద్ధలతో విద్యుత్‌దీపాలంకరణలతో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా 21వ తేదీ గురువారం నుంచి 9రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీదేవి వివిధ అలంకారాలతో భక్తులకు దర్శనమిస్తుందన్నారు. మొదటిరోజు దీక్షాబంధన అలంకారంతో, రెండవ రోజు శ్రీరాజరాజేశ్వరీదేవి అలంకారంతో, మూడవ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంతో, నాల్గవరోజు శ్రీగజలక్ష్మీదేవి అలంకారంతో, ఐదవరోజు శ్రీమోహినీదేవి అలంకారంతో, ఆరవ రోజు శ్రీత్రిపురసుందరీదేవి అలంకారంతో, ఏడవరోజు శ్రీసరస్వతీదేవి అలంకారంతో, ఎనిమిద రోజు శ్రీ మహిషాసురమర్ధిని అలంకారంతో, తొమ్మిదవరోజు శ్రీకన్యకా పరమేశ్వరీదేవి అలంకారంతో వాసవీమాత భక్తులకు దర్శనమిస్తారని తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం 9గంటల నుంచి వివిధ అర్చనలు, హోమాలు, పూజలు నిర్వహించడం జరుగుతుందని, ప్రతిరోజు సాయంత్రం 6.30గంటల నుంచి వాసవీమాత వివిధ అలంకారాలతో ప్రజలకు దర్శనమిస్తారని వివరించారు. 10వ రోజు శనివారం విజయదశమిరోజు అమ్మవారు మత్స్యకాపరమేశ్వరీదేవి అలంకారంతో భక్తులకు దర్శనమిస్తారు. అదేరోజు సాయంత్రం 3.30గంటల నుంచి శ్రీదేవి శమీదర్శనం, రాత్రి 9గంటల నుంచి శ్రీశ్రీ విజయలక్ష్మీదేవి అలంకారం, శ్రీదేవి గ్రామోత్సవం ఉంటుందని, ఆదివారం తెల్లవారు జామున 6గంటలకు మంగళహారతితో దశమి ఉత్సవాలు ముగుస్తాయన్నారు. 11వరోజు పవళింపుసేవ కార్యక్రమం ,మద్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు బంతిభోజనాలు, ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. పదిరోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులు శాంతి సహనంతో అమ్మవారిని దర్శించుకుని ఆమె కృపకుపాత్రులు కావాలని కోరారు. విలేకర్ల సమావేశంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా అద్యక్షుడు బుధవరపుకృష్ణమూర్తి, ఉత్సవ కమిటీ చైర్మన్ బూరగడ్డ విశ్వనాధంశ్రేష్టితోపాటు కోశాధికారి రెడ్డయ్య, సత్యనారాయణ, మల్లికార్జున, రమేష్‌బాబు, సుమన్‌కుమార్, నారాయణ అనంత, సునీల్‌కుమార్, ఘంటసాల ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.