కడప

కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, సెప్టెంబర్ 21: రాష్ట్ర ప్రభుత్వంచే ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లచే రుణాలను లబ్దిదారులకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని , శాంతి భద్రతలు మెరుగుపరుస్తూ రోడ్డుప్రమాదాలు అరికట్టాలని గురువారం కలెక్టర్ల, ఎస్పీల సదస్సులో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు సమీక్షించినట్లు జిల్లా అధికారులతో విజయవాడ నుంచి ప్రత్యక్షంగా అధికారులు చెబుతున్నారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ల, ఎస్పీ సదస్సును జిల్లా అధికారులు వీక్షిస్తుండగా ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, రోడ్ల భవనాలశాఖ , విద్యుత్‌శాఖ, ఏపి ఫైబర్ నెట్ వర్క్‌లపై సిఎం సమీక్షను జిల్లా అధికారులు సమీక్షించారు. జిల్లాలో రోడ్డుప్రమాదాలు అరికట్టేందుకు రోడ్డుమలుపుల వద్ద ప్రమాద సూచికలు ఏర్పాటుచేయడం, స్పీడు బ్రేకర్లు నిర్మించడం, రేడియం స్టిక్కర్లు అంటించాలని సిఎం అధికారులను ఆదేశించారు. రాత్రిపూట రోడ్డుప్రమాదాల నివారణకు ప్రత్యేక గస్తీలు ఏర్పాటుచేసి ట్రాన్స్‌పోర్టు, పోలీసు, ఇంజనీరింగ్‌శాఖ, రోడ్ల భవనాలశాఖ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. ఈసందర్భంగా అధికారులు కలెక్టర్‌కు జిల్లాలో జరుగుతున్న నివారణ చర్యలు అధికారులు బ్రీఫ్‌నోట్‌ను అందించినట్లు తెలుస్తోంది. సిఎం ఆదేశించిన ప్రతి అంశంపై జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు నోట్ చేసుకున్నారు. ఈసమావేశంలో సిపిఓ తిప్పేస్వామి, డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ రామచంద్రారెడ్డి, డిపిఓ ఖాదర్‌బాషా, సోషల్‌వెల్పేర్ డిడి సరస్వతి, బిసి కార్పొరేషన్ ఇడి రామచంద్రారెడ్డి, ఐసిడిఎస్ పిడి మమత, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చంద్రవౌళీశ్వరరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సాగునీటి కోసం రేపు మైదుకూరులో ధర్నా
* ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి
చాపాడు, సెప్టెంబర్ 21: శ్రీశైలం జలాశయం నుంచి సాగునీటి విడుదలతో రాయలసీమ ప్రజలకు, రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని అందుకు నిరసనగా ఈనెల 23న మైదుకూరులో ధర్నా చేపడుతున్నట్లు మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన చాపాడులో మాట్లాడుతూ గత మూడేళ్లుగా రాయలసీమకు సాగునీటి విషయంలో అన్యాయం జరుగుతోందన్నారు. గత ఏడాది ఎట్టకేలకు సాగునీరు అష్టకష్టాల వల్ల వచ్చిందన్నారు. ఈ ఏడాది ప్రాజెక్టుల్లోకి నీరు వచ్చినా సాగునీరు అందివ్వడంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తోందన్నారు. ముఖ్యంగా కెసి కెనాల్‌కు నీటి విడుదలలో స్పష్టత ఇవ్వకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తోందన్నారు. రైతులు, రైతు సంఘం నాయకులు, ప్రజాసంఘాలు, స్వచ్చంధసంస్థలు, మేధావులు ధర్నాకు మద్దతు ఇచ్చి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం పెద్దచీపాడు గ్రామంలో వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరు వైకాపాలో చేరి రాబోయే ఎన్నికల్లో జగన్‌ను సిఎం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈకార్యక్రమంలో జడ్పీటిసి బాలనరసింహారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు ఎస్.నరసింహారెడ్డి, నాయకులు లక్షుమయ్య యాదవ్, ఎంపిటిసి మహేష్‌యాదవ్, జయరామిరెడ్డి, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.