కడప

ప్రతి ఎకరాను నీటితో తడుపుతాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమలాపురం, సెప్టెంబర్ 21:ప్రతి ఎకరాను నీటితో తడపడమే సిఎం చంద్రబాబు లక్ష్యమని ఇందుకోసం ఆయన చేపట్టిన నీరు-చెట్టు సత్ఫ్‌లితాలిస్తోందని నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్,మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం మండల పరిదిలోని కొండాయపల్లె, రామాపురం, ఈడిగపల్లె గ్రామాల్లో జిల్లా టిడిపి ఉపాధ్యక్షుడు అంకిరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు సాయినాదశర్మతో కలసి ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామాల్లో పార్టీపతాకాన్ని ఎగురవేసి యన్‌టిఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లోని సమస్యలను తెలియచేయాలని కోరారు. కొండాయపల్లెలో వంద శాతం ఫింఛన్లు మంజూరయ్యాయని చెప్పారు. అనంతరం జరిగిన సమావేశంలో పుత్తా మాట్లాడుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన నీరు-చెట్టు పనులు ఇటీవల కురిసిన వర్షాల వల్ల మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. చెరువులకు, చెక్‌డ్యాంలకు నీరంది జలకళ సంతరించుకుందన్నారు. కావున వ్యవసాయ బోర్లల్లో నీటిమట్టం పెరిగిందని రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోందన్నారు. మరోసారి మంచి వర్షాలు వస్తే నియోజకవర్గంలోని కమలాపురం, చదిపిరాల, గోటూరు, కొప్పర్తి, సికెదినె్న, యర్రచెరువు పూర్తి గా నిండి ఆయకట్టు సాగు అవుతుందన్నారు. ఇందులో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు వాసుదేవరెడ్డి, ఆసుపత్రిచైర్మెన్ నరసింహారెడ్డి, సర్పంచుల సంఘం అద్యక్షుడు నాగిరెడ్డి, జిల్లా తెలుగుయువత అద్యక్షుడు జి దివాకరరెడ్డి పాల్గొన్నారు.
ట్రాఫిక్ నియమాలు పాటించాలి
రాయచోటి, సెప్టెంబర్ 21: వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబందనలు పాటించకుంటే ఎప్పటికైనా ప్రమాదాలు తప్పవని అర్బన్ సిఐ మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నేను తప్పు చేశాను అనే కార్యక్రమాన్ని వీడియో వీక్షణం ద్వారా విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. అనంతరం సిఐ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే ప్రమాదాలు తప్పవని తెలిసినా ఎంతో మంది నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు గురై మృత్యువాత పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని తెలియజేశారు. ఎక్కువగా యువత బైక్ రేసింగ్, మితిమీరిన వేగం, తొందరగా వెళ్లాలనే ఉత్సాహం లాంటి కారణాల వలన ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయన్నారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించడం వలన ప్రమాదాల బారీన పడకుండా ఉండగలరన్నారు. పూర్తిగా అవగాహన కలిగి వాహనాన్ని నడపాలన్నారు. డ్రైవింగ్ లైసెన్సులు లేని వారికి వాహనాలు ఇవ్వరాదని, అలా ఇచ్చినచో వారిపై కేసులు బనాయిస్తామన్నారు. కావున యువత ట్రాఫిక్ నియమాలు పాటించి జీవితాన్ని సుఖవంతం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్‌ఐ మహమ్మద్ఫ్రి, డిగ్రీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విపత్తులు ఎదుర్కోవడంలో విద్యార్థినులకు శిక్షణ

కడప, సెప్టెంబర్ 21: ప్రకృతి వైపరీత్యాల కారణంగా కరవు, వరదలు, భూకంపాలు, అనేక రకాల ప్రమాదాల నివారణపై నగరంలోని కోటి రెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు గురువారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, స్టెప్, ఎన్‌ఎస్‌ఎస్ శాఖలచే శిక్షణ నిర్వహించారు. గురువారం నుంచి శనివారం వరకు కోటిరెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో 45 మంది విద్యార్థినీలను ఎంపికచేసి శిక్షణను నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా స్టెప్ సిఇవో మమత ప్రసంగిస్తూ పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, విపత్తుల సమయంలో ఏవిధంగా మహిళలు ఎదుర్కోవాలనే విషయాన్ని ఆమె వివరించారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వైస్ ఛైర్మన్ డాక్టర్ ఎస్.మహబూబ్‌పీరా మాట్లాడుతూ విపత్తుల సమయంలో రక్షించేందుకు మగ, ఆడ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ధైర్యంగా అడుగులు వేయాలని మహిళలకే ఓపికతో పట్టుదలతో ఎంత సమస్య అయినా పరిష్కరిస్తారని ఆయన గుర్తు చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి కృష్ణమూర్తి మాట్లాడుతూ విపత్తుల సమయంలో ప్రతి ఒక్కరు ఆందోళనకు గురికాకుండా నిగ్రహ శక్తితో ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా ఫీల్డ్ ఆఫీసర్ షేక్ ఫయాజ్ బాషా మాట్లాడుతూ విపత్తుల్లో బాధితులు తీసుకోవాల్సిన చర్యలు, కాపాడుకోవాల్సిన బాధ్యతలపై వివరించారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారిణి విజయలక్ష్మి, ప్రిన్సిపాల్ పి.సుబ్బలక్షుమ్మ, ఇండియన్ రెడ్‌క్రాస్ జిల్లా ప్రతినిధులు సుధాకర్, సుశీలమ్మ, విజయభాస్కర్‌లు పాల్గొని ప్రసంగించారు. ఈశిక్షణకు ఎంపికైన 45 మంది విద్యార్థినీలు శిక్షణలో తమ ధైర్యసాహసాలు ప్రదర్శించడం, వారిని స్టెప్ సిఇవో మమత అభినందించారు.