కడప

దేవీం శరణం గచ్ఛామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు టౌన్, సెప్టెంబర్ 21: శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత అయిన శ్రీ మత్కన్యకాపరమేశ్వరీదేవి ఆలయం ఉత్సవాల సందర్భంగా సుందరంగా ముస్తాబైంది. ఆర్యవైశ్యసభ అధ్యక్షులు బుశె్శట్టి రామ్మోహన్‌రావు ఆద్వర్యంలో గురువారం ఉదయం 6:30గంటలకు ఆర్యవైశ్య కులానికి చెందిన 102 మంది సుహాశినులు స్థానిక అమ్మవారిశాల నుండి శాస్త్రోక్తంగా, మంగళ వాయిద్యాల నడుమ పట్టణ నడిబొడ్డున వెలసిన శ్రీ అగస్త్యేశ్వర ఆలయానికి చేరుకుని అక్కడ శివగంగతో కూడిన కలశాలను స్వీకరించి వేదపఠనముల నడుమ, పసుపురంగు దుస్తులు ధరించిన సుహాశినులు భక్తిశ్రద్ధలతో కలశాలను తీసుకువచ్చి అమ్మవారిశాలలో సమర్పించారు. అనంతరం 8:30 నిముషాలకు అమ్మవారి పురాణమును తీసుకువచ్చేందుకై అమ్మవారిశాల నుండి ఆర్యవైశ్యసభ అధ్యక్షులు బుశె్శట్టి రామ్మోహన్‌రావు ఆద్వర్యంలో కమిటీ సభ్యులు, పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు శాస్త్రోక్తంగా ధవళ వస్త్రాలు ధరించి బివిఎస్ థియేటర్ వద్దనున్న తెల్లాకుల శివయ్యగారి శ్రీ నగరేశ్వరస్వామి ఆలయం చేరుకున్నారు. అక్కడి నుండి తిరిగి పురాణమును తీసుకుని అమ్మవారిశాలకు చేరుకున్నారు. దారిపొడవునా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బాంబేకు చెందిన కళాకారులచే డ్రమ్స్ వాయిద్యాలు, విజయవాడకు చెందిన రాజు, రాణి, కదిలే ఏనుగు బొమ్మల ప్రదర్శన, మేళతాళాల వాయిద్యాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవాలను దర్శించేందుకు పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు కుటుంబ సమేతంగా రావడంతో అమ్మవారిశాల నుండి రాజీవ్‌సర్కిల్ వరకు రోడ్లు, వీధులన్నీ ప్రజలతో నిండిపోయాయి. ఎటుచూసినా కోలాహల వాతావరణం నెలకొంది. ఉత్సవాల సందర్భంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడంతో ట్రాఫిక్ పోలీసులు వ్యయ ప్రయాసలకోర్చి క్రమబద్దీకరించారు. అలాగే పాత మార్కెట్‌లో వెలసిన శ్రీ మహాలక్ష్మీ సమేత చెన్నకేశవాలయం, రతనాల వేంకటేశ్వరాలయం, శ్రీ అగస్త్యేశ్వరాలయం, శ్రీ రాజరాజేశ్వరీదేవాలయం, శ్రీ చౌడేశ్వరీదేవాలయాలకు చెందిన అమ్మవార్లను ఆయా ఆలయాల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ఆలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు.

ఎర్రచందనం పట్టివేత
* 26 మంది అరెస్టు.. * 48 దుంగలు, లారీ స్వాధీనం
రాజంపేట, సెప్టెంబర్ 21: రైల్వేకోడూరు సర్కిల్ పరిధిలో బుధవారం రాత్రి నుండి గురువారం వరకు పోలీసులు విస్తృతంగా నిర్వహించిన దాడులలో 26 మందిని అరెస్టు చేసి, వారి నుంచి 48 దుంగలతో పాటు, ఒక లారీని, మరి కొన్ని గొడ్డళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ ఎ.రాజేంద్ర తెలిపారు. రైల్వేకోడూరు రూరల్ ఎస్సై భక్తవత్సలం, కోడూరు ఎస్సై వెంకటేశ్వర్లు, మరో పది మంది పోలీసులకు అందిన సమాచారంతో బుడుగుంటపల్లె సమీపంలో బుధవారం చేసిన దాడులలో తమిళనాడు, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అక్భర్, మణి, పెరుమాళ్, తంగరాజ్, సునీల్, మరో ఐదుగురిని పట్టుకుని వారి నుంచి ఒక లారీతో పాటు 24 దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. చిట్వేల్ ఎస్‌ఐ డాక్టర్ నాయక్ సిబ్బందితో ఓబులవారిపల్లె, చిట్వేల్ మండలాలలోని వేర్వేరు ప్రాంతాలలో 16 మందిని పట్టుకుని వారి నుంచి 24 దుంగలు స్వాధీనం చేసుకున్నామన్నారు. దుంగలతో పాటు నిందితులను పట్టుకున్న ఎస్‌ఐలు, సిబ్బందిని డిఎస్పీ అభినందించారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ.కోటి ఉంటుందన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిర్మూలన కోసం పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొంతమంది దొంగచాటుగా స్మగ్లింగ్ చేయడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా బాలుపల్లె చెక్‌పోస్ట్ వద్ద మరింత భద్రతను పెంచినట్లు తెలిపారు.