కడప

ట్రిపుల్ ఐటిల్లో తిష్టవేసిన సమస్యలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, సెప్టెంబర్ 21: రాజీవ్ గాంధీ వైజ్ఞానిక ,సాంకేతిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇడుపులపాయలో 2 ట్రిపుల్ ఐటిల కళాశాలలు నిర్వహణలో ఉన్నాయి. ఆ ట్రిపుల్ ఐటిలకు ఏటా రూ.వందలకోట్లు ఖర్చుచేస్తున్నా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ఈ ఏడాది ఇడుపులపాయ ట్రిపుల్ ఐటికి రూ.100కోట్లు విడుదలైంది. ప్రకాశం జిల్లాలోని ట్రిపుల్ ఐటికి ఆ జిల్లాలో సౌకర్యాలు లేకపోవడంతో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటిలోనే 2ట్రిపుల్ ఐటిలను రెండేళ్లుగా నిర్వహిస్తున్నారు. ట్రిపుల్ ఐటిలో పనిచేస్తున్న డైరెక్టర్లు , సీనియర్ అధికారులు ,మరికొంతమంది సీనియర్ అధ్యాపకుల మధ్య ఆధిపత్యపోరు విద్యార్థులకు శాపంగా మారింది.్ఫలితంగా విద్యార్థులు అరకొర సౌకర్యాలు మధ్య చదువులు కొనసాగిస్తున్నారు. ఆహారం, భద్రత, బోధనేతర సిబ్బంది ఏజెన్సీల ద్వారా నిర్వహణలో ఉండటంతో ఈ ఏజెన్సీలు సంపాదనకు అలవాటుపడి ట్రిపుల్ ఐటిల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఈ 2ట్రిపుల్ ఐటిల్లో 7వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటిలో 5సంవత్సరాలు బిటెక్, ఇంటిగ్రేటెడ్ కోర్సులు మొదలయ్యాయి. సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్, టెక్నాలజి అండ్ లర్నింగ్ సైనె్సస్‌ను కూడా ప్రవేశపెట్టారు. అయితే వసతిగృహాల నిర్వహణ అధ్వాన్నంగా తయారైంది. విద్యార్థుల్లో మానసిక వత్తిడి కారణంగా అప్పుడప్పుడు విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం, ఆత్మహత్యలు చేసుకోవడం, ఆందోళన చేపట్టడం జరుగుతోంది. ముఖ్యంగా ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటిలో ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌లో గత డిసెంబర్‌లో సంబంధిత పాఠ్యాంశాల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు కూడా ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని ట్రిపుల్ ఐటిలకు ఈ ఏడాది రూ.400కోట్లు ఖర్చు చేస్తున్నా అరకొర సౌకర్యాలతో ప్రతిభావంతులైన విద్యార్థులు కష్టాల చదువులు నెట్టుకొస్తున్నారు. యాజమాన్యంలో ఆధిపత్యపోరుకు స్వస్తిచెప్పి ప్రైవేట్ ఏజెన్సీల నిర్వహణ లేకుండా ప్రభుత్వమే సౌకర్యాలన్నీ మెరుగుపరిచినట్లయితే ప్రభుత్వలక్ష్యం నెరవేరి దేశస్థాయిలోనే సాంకేతిక నిపుణులుగా విద్యార్థులు రాణించగలరు.

సబ్సిడీ రుణాలకు రాజకీయ గ్రహణం!
చాపాడు,సెప్టెంబర్ 21: చాపాడు మండలంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో ప్రభుత్వం చేపట్టిన సబ్సిడీ రుణాల మంజూరుకు రాజకీయ గ్రహణం ఎదురైందని పలువురు విమర్శిస్తున్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 127 మంది నిరుద్యోగులకు వివిధ రకాల యూనిట్లను అందివ్వడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఆగస్టు నెలలో 427మంది నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోగా ఆవెంటనే జరిగిన ఇంటర్వ్యూలలో 281 మంది రుణాలకోసం హాజరయ్యారు. అయితే ఈ ఎంపిక ప్రక్రియ మండల అభివృద్ధి అధికారులతోపాటు జన్మభూమి కమిటీ ఆధ్వర్యంలో జరగాల్సివున్నప్పటికీ అధికారపక్ష నాయకులు జన్మభూమి కమిటీ ద్వారా ఎంపికచేయకుండా ప్రతిసారి అడ్డంకులు తగులుతూ రావడంతో చివరకు అధికారులు జిల్లాకలెక్టర్‌కు హాజరైన నిరుద్యోగుల జాబితా పట్టికను యధావిధిగా పంపించారు. బ్యాంకర్లతో వైకాపా నాయకులు జతకట్టి వారు చెప్పిన విధంగానే జాబితా తయారు చేయాలని పట్టుబట్టగా అధికారపక్షం మాత్రం తాము చెప్పిన విధంగానే జాబితాను తయారుచేయాలని అధికారులపై వత్తిడి తేవడంతో ఇరువర్గీయుల మాటలు పక్కనపెట్టి అధికారులు ఇంటర్వ్యూల ఆధారంగా వచ్చిన జాబితాను కలెక్టర్‌కు నివేదించామన్నారు. అయితే ఇంతవరకు ఇంటర్వ్యూలు ఏమయ్యాయనే విషయం బయటపడకపోవడంతో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు మండల కార్యాలయం చుట్టు కాళ్లు అరిగేలా తిరుగుతున్నా వారికి సమాధానం చెప్పే నాధుడే లేడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రాజకీయ గ్రహణాన్ని తొలగించి సబ్సిడీ రుణాలు అర్హులైన వారికి అందజేయాలని స్థానికులు కోరుతున్నారు.