కడప

పులివెందులలో టీడీపీ జెండా ఎగరాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేంపల్లె, సెప్టెంబర్ 22: 2019లో జరిగే ఎన్నికలలో పులివెందులలో తెలుగుదేశం అభ్యర్థి గెలుపొంది ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలని శాసనమండలి మాజీ ఉపాధ్యక్షుడు సతీష్‌కుమార్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం వేంపల్లెలో తన స్వగృహంలో పులివెందుల నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న 2019 ఎన్నికలలో కార్యకర్తలు, నాయకులు సమష్టి కృషితో పోరాడి టీడీపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచించుకోవాలన్నారు. ముఖ్యంగా కార్యకర్తలు అహం వీడి ప్రజల్లో మమేకమై ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. గతంలో వేంపల్లెలో జరిగిన సర్పంచు ఎన్నికలలో కేవలం 2 వేల మెజార్టీ మాత్రమే వచ్చిందన్నారు. తిరిగి ఎమ్మెల్యే ఎన్నికలలో 4 వేల మెజార్టీతో వైసీపీ గెలుపొందిందన్నారు. దీనిని బట్టి చూస్తే కార్యకర్తల్లో ఏమాత్రం శ్రద్ధ ఉందో గమనించవచ్చన్నారు. ప్రతి గ్రామంలో టీడీపీ నాయకులు సైనికుడిలా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలను గడప గడపలోకి ప్రచారం తీసుకెళ్లాలన్నారు. అలాగే ప్రభుత్వం కొత్త యాప్‌ను కూడా ప్రవేశపెట్టిందన్నారు. ఈ యాప్‌ను డిసెంబర్, జనవరి మాసాల్లోపు వినియోగించుకోవాలన్నారు. ఎలాగైనా పులివెందుల స్థానాన్ని టీడీపీ ఖాతాలో వేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు రాజగోపాల్‌రెడ్డి, తూగుట్ల మధుసూదనరెడ్డి, శివమోహన్‌రెడ్డి, సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు షబ్బీర్, భాస్కర్‌రెడ్డి, మునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆర్డీవో వినాయకం సస్పెన్షన్..

కడప,సెప్టెంబర్ 22: జమ్మలమడుగు పూర్వపురెవిన్యు డివిజనల్ అధికారి కె.వినాయకం ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కారణంగా ఆయన్ను విధులనుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు శుక్రవారం అందినట్లు కలెక్టర్ టి.బాబూరావునాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. వినాయకం జమ్మలమడుగు ఆర్డీవోగా పనిచేసిన కాలంలో గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారంలో అవకతవకలు జరిగినట్లు కలెక్టర్ ప్రభుత్వానికి పంపిన నివేదిక ఆధారంగా వారిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం జివో ఆర్‌టి నెం.996ను ఈనెల 20వ తేదీన విడుదల చేసినట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

శరవేగంగా రోడ్డు పనులు..

కడప,సెప్టెంబర్ 22: గండికోట రిజర్వాయర్‌లో 5టిఎంసిల నీరు నిలిచినట్లయితే పలు ప్రాంతాలు ముంపునకు గురై రోడ్డురవాణా అస్తవ్యస్థంగా మారే సమయంలో ప్రత్యామ్నాయ రోడ్డుమార్గాన్ని శరవేగంగా నిర్మాణాలు చేపట్టారు. ముద్దనూరు నుంచి తాడిపత్రి వరకు 30కి.మీ.పైబడి రూ.100కోట్లతో పనులు మొదలుపెట్టారు. ప్రాజెక్టు నిర్మాణం మునుపు ముద్దనూరు శెట్టివారిపల్లె నుంచి కొండాపురం, సుగమంచిపల్లె మీదుగా తాడిపత్రికి రాకపోకలు కొనసాగేవి. ప్రస్తుతం గండికోటలో 1టిఎంసి పైబడి నీరు నిల్వచేయడం, ఎగువప్రాంతం నుంచి వరదనీరు ప్రతిరోజు 75 నుంచి 100క్యూసెక్కులనీరు చేరుతోంది. ఇక శ్రీశైలం జలాశయం నుంచి నీరు వదిలినట్లయితే గండికోటకు 5టిఎంసిల నీరు చేరడం రోజుల్లోనే ఉంటుంది. గండికోట రిజర్వాయర్ నుంచి పులివెందులకు, సర్వారాయసాగర్ ప్రాజెక్టునుంచి వామికొండ రిజర్వాయర్‌కు నీరు పంపేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. అయితేగండికోట నీటి సామర్థ్యం 26 టిఎంసిల పైబడి వుండగా ప్రస్తుతం 5 టిఎంసిల నీరుమాత్రమే నిల్వవుంచేందుకు జలవనరుల అభివృద్ధిశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 5 టిఎంసిల నీటి నిల్వకే 30 నుంచి 50 కి.మీ.పైబడి రోడ్డుమార్గాలు మునకకు గురౌతుండటంతో ముద్దనూరు నుంచి తాడిపత్రికి ప్రత్యామ్నాయ రోడ్డుమార్గం ఏర్పాటు చేసుకున్నారు. ముద్దనూరు నుంచి మల్లెల, ఘాట్‌రోడ్డు, లావనూరు, తిమ్మాపురం, పొట్టిపాడు మీదుగా తాడిపత్రికి రోడ్డు నిర్మిస్తున్నారు. కొత్త చిత్రావతి బ్రిడ్జిపైనే ఈ రోడ్డుమార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరో 6రోజుల్లో ఈమార్గం నుంచే వాహనాలు నడుపుకోవాల్సివస్తోందని, జలవనరుల అభివృద్ధిశాఖ అధికారులు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. రెవెన్యూ అధికారులు కూడా సంబంధిత గ్రామ అధికారుల ద్వారా ముద్దనూరు నుంచి తాడిపత్రికి ప్రత్యామ్నాయ రోడ్డుమార్గం నుంచే వాహనాల రాకపోకలు కొనసాగించాలని ప్రజలకు టామ్‌టామ్ ద్వారా తెలియపరుస్తున్నారు. జలవనరుల అభివృద్ధిశాఖ అధికారుల హడావిడి చూస్తుంటే అతి త్వరలోనే శ్రీశైలం జలాలను మళ్లించే అవకాశాలు కన్పిస్తున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ సమీపంలో కూడా అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా వర్షాలు వస్తే ఎగువప్రాంతాల్లోని వర్షపునీరు, అనంతపురం, కర్నూలు జిల్లాల పరిధిలోని గండికోట రిజర్వాయర్ సమీపంలోని నీరు కూడా రిజర్వాయర్‌కు చేరుకుంది. పైడిపాలెం పైపులైన్ ద్వారా ఈ నీటిని తోడి పులివెందుల, వామికొండ రిజర్వాయర్‌కు, సర్వారాయ రిజర్వాయర్‌కు నీరు పంపే ఏర్పాట్లు ముందస్తుగా చర్యలు చేపట్టారు. రహదారి విషయానికొస్తే ఇప్పటికే రైల్వేలైన్‌ను మంగపట్నం కొండపైన ఏర్పాటుచేసి చెన్నై-ముంబయి రైళ్లరాకపోకలు కొనసాగిస్తున్నారు. అదే తరహాలో ప్రత్యామ్నాయ రోడ్డుమార్గాన్ని ముద్దనూరు నుంచి తాడిపత్రికి మల్లెల మీదుగా శరవేగంతో ఏర్పాటు చేస్తున్నారు.