కడప

భైరవేశ్వరస్వామి ఆలయంలో నాగపడిగల ప్రతిష్ఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుండుపల్లె, సెప్టెంబర్ 22: స్థానిక భైరవేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు స్వామి వారికి నిర్వహించారు. శుక్రవారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భైరవగుట్ట ఆలయంలోని భైరవేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. ముక్కోటి దేవుళ్లలో అత్యంత శక్తివంతుడైన శివయ్య మహిళలు ఎంతో పవిత్రంగా ఆరాధించారు. వేదపండితుల మధ్య కలశస్థాపన, నాగపడిగలను ప్రతిష్ఠింపజేశారు. దసరా ఉత్సవాల్లో ఎంతో పవిత్రంగా నిర్వహించే నాగపడిగల పూజలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అదే విధంగా మండలంలోని సుండుపల్లె శివాలయం, తిమ్మసముద్రం ఆంజనేయస్వామి, భైరవగుట్ట ఆంజనేయస్వామి, సుండుపల్లె వైశ్యా బజార్‌లోని కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయంలో రాగిమానుబిడికి శివాలయం, చిన్నబిడికి వెంకటేశ్వరాలయంలోను ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాయలసీమకు నికరజలాలు కేటాయించాలి

కడప,సెప్టెంబర్ 22: నిరంతరం కరవుకు గురౌతున్న రాయలసీమలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి నికర జలాలు కేటాయించి సాగు, తాగునీరు విడుదల చేయాలని ఏపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.నారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఎం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ కెసి కెనాల్‌కు నికర జలాలు ఉన్నాయని వాటిని తక్షణమే విడుదల చేయాలని లేనిపక్షంలో ఆందోళన చేపట్టాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసే సమయంలో తెలంగాణ ప్రభుత్వం రాద్దాంతం చేయడం తగదన్నారు. పట్టిసీమ, పులిచింతల ప్రాజెక్టుల ద్వారా కృష్ణానదిలో 40టిఎంసిల మిగులు జలాలు ఉన్నాయని, ఆ జలాలను రాయలసీమకు నికర జలాలుగా కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. పట్టిసీమ ప్రాజెక్టుకు సంవత్సర కాలంలో రూ.1600కోట్లు కేటాయించి పూర్తి చేశారని, రాయలసీమలో గత 30 సంవత్సరాలుగా సాగునీటి ప్రాజెక్టులకు నిధులు లేక పెండింగ్‌లో ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుగంగ, గాలేరునగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులు ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కెసి కెనాల్‌కు నికర జలాలున్నా శ్రీశైలం ప్రాజెక్టులో నీరు ఉన్నా ప్రభుత్వం ఎందుకు విడుదల చేయలేదని ఆయనప్రశ్నించారు. కెసి కెనాల్ రైతాంగం దిక్కుతోచని స్థితిలో సతమతవౌతున్నారని, వరినారు మడులు వేసుకుని నీరు విడుదల చేస్తారో లేదో తెలియక అవస్థలు పడుతున్నారన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే సీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తిచేసి రాయలసీమకు నికర జలాలు కేటాయించి కరవుకు గురౌతున్న రైతాంగాన్ని ఆదుకోవాలని లేనిపక్షంలో సీమ ప్రజలు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శారదాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

ప్రొద్దుటూరు టౌన్, సెప్టెంబర్ 22: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవరోజైన శుక్రవారం శ్రీమత్కన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారు శారదాదేవి అలంకారములో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 6గంటలకు అమ్మవారి అలంకరణను పూర్తిచేసి అమ్మవారిశాల నందు దర్శనానికిగాను భక్తులను అనుమతించారు. రెండవరోజు శుక్రవారం కావడంతో మహిళా భక్తులు పెద్దసంఖ్యలో ఆలయాలకు చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే పాత మార్కెట్‌లో వెలసిన శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీ చెన్నకేశాలయంలో అమ్మవారు శ్రీ ధాన్యలక్ష్మీదేవి అలంకారములో, పట్టణ నడిబొడ్డున వెలసిన శ్రీ అగస్త్యేశ్వరాలయం (శివాలయం)లో శారదాదేవి అలంకారములో, శ్రీ లలితాదేవి రతనాల వేంకటేశ్వరాలయంలో శ్రీ శారదాదేవి అలంకారములో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అన్ని ఆలయాలలో అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరించగా భక్తులు దర్శించుకొని తన్మయత్వానికి లోనయ్యారు. ఆయా ఆలయాల కమిటీ నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయడంతోపాటు తీర్థప్రసాదాలు పంపిణీచేశారు. అలాగే స్థానిక వైఎంఆర్ కాలనీలోని శ్రీ సాయినాథుని ఆలయంలో అమ్మవారు శ్రీ భవానీ అలంకారములో భక్తులను కనువిందు చేశారు. అంతే కాకుండా పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద ప్రత్యేకంగా వేసిన కాళీమాత శెట్టింగ్ ప్రజలను ఆకట్టుకుంటోంది. అమ్మవారిశాలలో సాయంత్రం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్, స్థానిక జడ్జిలు, న్యాయవాదులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిశాల అధ్యక్షులు బుశె్శట్టి రామ్మోహన్‌రావు జడ్జిని సన్మానించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

సమస్యల పరిష్కారానికే ఇంటింటికీ టిడిపి..

కమలాపురం, సెప్టెంబర్ 22: గ్రామాల్లోని ఫ్రజాసమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకే ఇంటింటికీ టిడిపి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సూదా అంకిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని పెద్దచెప్పల్లి గ్రామంలో నిర్వహించిన ఇంటింటికి టిడిపిలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, గ్రామాల్లోని సమస్యలను ప్రత్యక్ష్యంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. తద్వారా ప్రజల ఇళ్ల వద్దకు నేరుగా వెళ్లి వారి పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, పక్కాగృహాలు తదితర విషయాలను తెలుసుకుని అమలుకు నోచుకోని వారి పేర్లను ట్యాబ్ ద్వారా నమోదు చేసుకుంటున్నామన్నారు. అలాగే గ్రామ సమస్యలను ప్రజల నుంచి నమోదు చేసి వాటిని రాష్టక్రమిటీకి పంపుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు గండినారాయణ, నరసింహారెడ్డి, రఫి, సుధాకర్, మల్లేష్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శ్రీశైలం నీటిపై రాద్దాంతం తగదు

చెన్నూరు,సెప్టెంబర్ 22: కృష్ణానది ఎగువప్రాంతం నుంచి వస్తున్న వరదనీరు కారణంగా తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు పుష్కలంగా నీరు అందుతున్నా తెలంగాణ ప్రభుత్వం రాద్దాంతం చేయడం తగదని కమలాపురం టిడిపి ఇన్‌చార్జి పుత్తానరసింహారెడ్డి పేర్కొన్నారు. ఇంటింటికీ తెలుగుదేశంపార్టీ కార్యక్రమంలో భాగంగా రామనపల్లెలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల కారణంగా వరుణదేవుడు కరుణించి భారీ వర్షాలు కురిపించడంతో అటు తెలంగాణ, ఇటు ఏపిలో వర్షాలు కురవడంతో కృష్ణానదికి భారీ ఎత్తున వరదనీరు చేరడంతో శ్రీశైలంలో అనతికాలంలోనే ప్రాజెక్టుకు దాదాపు 115 టిఎంసీల నీరు చేరిందన్నారు. రాయలసీమ వాటా ప్రకారం నీటిని వాడుకునే హక్కు సీమప్రాంత వాసులకు ఉందని పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా కడప, కర్నూలు కాలువలకు నీటిని విడుదల చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం రాద్దాంతం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో శ్రీశైలం ప్రాజెక్టు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా కడప కెసి కెనాల్‌కు నీరును అందించేందుకు లక్ష్యంగా సీఎం నిర్ణయించుకున్నారన్నారు. ఇప్పటికే ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట ద్వారా కడప కెసి కెనాల్ నుంచి పాతకడప చెరువుకు, చెన్నూరులో రెండు చెరువులతోపాటు స్థానిక చెన్నూరు కెనాల్ ద్వారా రామనపల్లి, ఓబులంపల్లి, గుర్రంపాడు, నజీర్ బేగ్ పల్లి గ్రామాల్లో కెనాల్ రైతులకు నీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కడప మార్కెట్‌యార్డు చైర్మన్ ఐ.శివారెడ్డి, నాయకులు శ్రీనివాసులురెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, ముళ్లపల్లె మాజీ సర్పంచ్ సుబ్బారెడ్డి, పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.