కడప

బిల్వవృక్ష నివాసిని పార్వతీదేవిగా అమ్మవారి దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు టౌన్, సెప్టెంబర్ 25: అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిశాలలో అమ్మవారు శ్రీ బిల్వ వృక్ష నివాసిని పార్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. సోమవారం ఉదయం అమ్మవారు శ్రీ దేవీ వనవిహారిణీదేవి అలంకారంలో భక్తులను అలరించగా భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం 7గంటలకు అమ్మవారు పార్వతీదేవి అలంకారంలో కొలువుదీరింది. అలాగే పాతమార్కెట్‌లో వెలసిన శ్రీ మహాలక్ష్మీ సమేత చెన్నకేశవాలయంలో శ్రీ మోహినీ వనవిహారిణీదేవి అలంకారంలో, అగస్త్యేశ్వరాలయం (శివాలయం)లో పార్వతీదేవి అలంకారంలో, వైఎంఆర్ కాలనీ సాయినాథాలయంలో శ్రీ శ్రీపురం నారాయణీ అలంకారములో, శ్రీ లలితాదేవి, రతనాల వేంకటేశ్వరాలయంలో శ్రీ దేవీ వనవిహారిణీదేవి (పార్వతి) అలంకారములో అమ్మవార్లు భక్తులకు కనువిందుచేసింది. ఉత్సవ కమిటీ నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీచేశారు.

జిల్లాలో 282 మి.మి వర్షపాతం

కడప,సెప్టెంబర్ 25: జిల్లాలో ఓ మోస్తారులో వర్షం సోమవారం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 282.6 మి.మీ.వర్షపాతం నమోదైంది. కడప రెవెన్యూ డివిజన్‌లోని 18 మండలాల్లో 120.8మి.మీ.వర్షపాతం కురవగా, కడపలోనే 23.4మి.మీ.వర్షపాతం నమోదైంది. రాయచోటి, చిన్నమండెం, సంబేపల్లి, వీరబల్లి, రామాపురం, గాలివీడులో చుక్కవాన కురవలేదు. జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌లో 147.8మి.మీ వర్షపాతం నమోదుకాగా, దువ్వూరు, మైదుకూరు, రాజుపాలెం మండలాల్లో చుక్కవర్షం కురవలేదు. రాజంపేట రెవెన్యూ డివిజన్‌లో కేవలం రైల్వేకోడూరులో 7.2మి.మీ, కాశినాయన మండలంలో 6.8మి.మీ వర్షపాతం నమోదుకాగా, కొన్ని మండలాల్లో తుంపర జల్లులు పడి 14మి.మీ, వర్షపాతం నమోదై 15 మండలాల్లో చుక్కవర్షపాతం కూడా కన్పించలేదు. మొత్తం మీద జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తదం చేస్తున్నారు.