కడప

ఇసుక మాఫియాపై నిఘా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, సెప్టెంబర్ 25: ఇసుక అక్రమరవాణాకు అడ్డుకట్టవేసేందుకు కలెక్టర్ టి.బాబూరావునాయుడు నేతృత్వంలో ఎస్పీ అట్టాడ బాబూజీ నడుం బిగించి ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లకు అక్టోబర్ 1 నుంచి జిపిఎస్ సిస్టమ్ అమర్చి, 28రీచ్‌లు గుర్తించగా ప్రస్తుతానికి 10 రీచ్‌ల నుంచే ఇసుక రవాణా చేసేందుకు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్‌లో గనులు, భూగర్భశాఖ ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీసు, గనులు, రెవెన్యూ యంత్రాంగం సమన్వయంతో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. అనుమతులు లేని రీచ్‌ల నుంచి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇసుక త్రవ్వకం, రవాణా జరగకుండా చూడాలన్నారు. జిల్లాలోని ఇసుక బయటి జిల్లాలకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు ఇసుకను ట్రాన్స్‌పోర్ట్ చేసే లారీలు, ట్రాక్టర్లకు తప్పక జిపిఎస్ సిస్టమ్‌ను అక్టోబర్ 1వ తేదీ నుండి అమర్చుకోవలసి ఉంటుందని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 1వ తేదీ నుండి ఇసుక ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు తప్పనిసరిగా జిపిఎస్ పరికరాన్ని అమర్చుకోవలసి ఉంటుందన్నారు. జిపిఎస్ పరికరాన్ని అమర్చుకొని వాహనాలకు ఇసుక ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి ఎటువంటి అనుమతి ఉండదన్నారు. రీచ్‌ల నుండి ఇసుక సజావుగా రవాణా జరిగేందుకు అవసరమైన ర్యాంప్‌లను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో 28 రీచ్‌లను గుర్తించినప్పటికి ప్రస్తుతం అందులో 10 రీచ్‌ల నుండి మాత్రమే ఇసుక తవ్వకం జరుగుతున్నందున, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరికొన్ని రీచ్‌లను గుర్తించాలన్నారు. గతంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ నిర్ణయించిన ధరలనే కొనసాగించాలని సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎస్పీ బాబూజీ అట్టాడ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా జరగకుండా పోలీసు నిఘా ఉంచడం జరిగిందన్నారు. ఇసుక రీచ్‌లలో ఉన్నటువంటి ఇసుక పరిమాణం, ఎంత మేరకు సదరు రీచ్ నుండి ఇసుకను తీయవచ్చుననే వివరాలు రీచ్‌ల వారిగా ఉంటే ఆ మేరకు ఇసుక త్రవ్వకం, రవాణాపై అందరికి స్పష్టత ఉంటుందన్నారు. జాయింట్ కలెక్టర్ శే్వత తెవతీయ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా జరుగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇసుక రీచ్‌ల నుండి అనుమతించిన పరిమాణం కంటే ఎక్కువగా ఇసుకను త్రవ్వకుండా చూడాలన్నారు. అందుకుగాను అధికారులు తరచూ రీచ్‌లను పరిశీలించి నివేదిక ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో గనులశాఖ సహాయ సంచాలకులు ఉమామహేశ్వరరెడ్డి, గ్రౌండ్ వాటర్ డి.డి. మురళీధర్, తెలుగుగంగ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ప్రతాప్, డిఎస్పీలు నాగేశ్వరరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గండి క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ధ్యేయం

చక్రాయపేట, సెప్టెంబర్ 25: రాయలసీమలో తలమానికమైన గండి క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ ఎస్‌వి సతీష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం గండి క్షేత్రంలో ఉత్తరభాగంలో ఉన్న కొండపై 135 అడుగుల అభయాంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఐదు ఎకరాలలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే సదుద్దేశ్యంతో దేవస్థాన సహాయ కమిషనర్ పట్టెం గురుప్రసాద్, దేవస్థాన ఛైర్మన్ వడ్లకుంట రాజారావు, వేంపల్లె, చక్రాయపేట తహశీల్దార్లు నాగేశ్వరరావు, శ్రీనివాసులు స్థలాన్ని పరిశీలించేందుకు కొండపైకి ఎక్కారు. 467 సర్వే నెంబర్‌లో ఆర్యవైశ్య కల్యాణ మండపం పక్క భాగం రెవెన్యూ స్థలమని, ఆ స్థలాన్ని పరిశీలించేందుకు శ్రీకారం చుట్టారు. తొలుతగా ఆ కొండపైకి ఎక్కడానికి మెటికలతో సైతం వాహనాలు కూడా పైకి ఎక్కి అక్కడ ఐదు ఎకరాల్లో 135 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహంతో పాటు పార్కింగ్ ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టామన్నారు. ఏది ఏమైనా రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించిన అనంతరం తమ నివేదికలలో పొందుపరిచి ఉన్నతాధికారులకు తెలియజేస్తామని తెలిపారు. ఉత్తర భాగంలో ఈ పర్యాటక కేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే స్థలాన్ని పరిశీలించామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు కేసరి, రాజారాం, సర్వేయర్ సర్వేశన్, వీఆర్‌వో గురునాధ్, వీఆర్‌ఏ, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.