కడప

శ్రీ విష్ణుమూర్తి అలంకారంలో శ్రీ సౌమ్యనాథుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందలూరు, సెప్టెంబర్ 25:నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీ విష్ణుమూర్తి అలంకారంలో శ్రీ సౌమ్యనాథుడు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో ఆలయ అర్చకులు సురేష్‌శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ పాలకమండలి అధ్యక్షులు పల్లె సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై గ్రామంలోని నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ దర్శనమివ్వడం జరిగింది. ఈ సందర్భంగా పాలకమండలి అధ్యక్షులు పల్లె సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆలయానికి ఇటీవల అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నందున వారంలో శుక్రవారం, శనివారం, ఆదివారం అన్నదాన సేవా ట్రస్ట్‌చే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వివరించారు.
నేడు కృష్ణావతారంలో
శ్రీ సౌమ్యనాథుడు
నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం కృష్ణావతారంలో శ్రీ సౌమ్యనాథస్వామి భక్తులకు దర్శనమివ్వనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

పోలీసుల సంక్షేమానికి కృషి..

కడప,సెప్టెంబర్ 25: పోలీసు సంక్షేమానికి అన్నివిధాల కృషి చేస్తామని ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు అందరికీ అందేలా చేస్తానని ,విధి నిర్వహణలో మరణించిన పోలీసు, సిబ్బంది కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని బాధిత కుటుంబాలు అధైర్యపడరాదని వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన బెటిఫిట్స్ అన్నీకల్పిస్తామని ఎస్పీ అట్టాడ బాబూజీ పేర్కొన్నారు. సోమవారం జిల్లాపోలీసు కార్యాలయంలో విధి నిర్వణలో మరణించిన పోలీసు అధికారులు, సిబ్బంది కుటుంబాలను ఆయన పిలిపించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రతి బాధిత కుటుంబం తమ కుటుంబమేనని వారి పిల్లలకు విద్యా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కుటుంబ సభ్యులను అన్ని విధాల ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. చనిపోయిన వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇన్సూరెన్స్, ఏపి జిఎల్‌ఐసి, లీవ్, పెన్షన్, గ్రాడ్యుటీ తదితరాలు వారిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ఏ ప్రభుత్వశాఖలో పెండింగ్‌లో ఉన్న వాటిన్నింటినీ పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో పరిపాలన అదనపు ఎస్పీ శ్రీనివాసరెడ్డి, రిజర్వుడ్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.