కడప

చదువుకు పేదరికం అడ్డురాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుండుపల్లె, అక్టోబర్ 16: పేదరికం చదువుకు అడ్డురాదని పులివెందుల ఏఎస్పీ కృష్ణారావు తెలిపారు. మండల కేంద్రానికి సమీపంలోని చెన్నారెడ్డినగర్‌లో ఉన్న కేజీబీవీ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఈ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. స్వచ్ఛ్భారత్‌ను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి మన పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. అనంతరం కేజీబీవీ అభివృద్ధికి కృషిచేసి చాలాబాగా అభివృద్ధి చేయడం ప్రతి సమస్యను తమ సొంత పనిగా తీసుకొని పరిష్కరించిన ఎస్‌ఐ నరసింహారెడ్డిని అభినందించారు. ప్రతి విద్యార్థి చదువుపై ప్రత్యేక శ్రద్ధచూపి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. పోలీసుల యొక్క త్యాగాలను విద్యార్థులకు ప్రజలకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. చిన్నతనం నుండే అన్నిరంగాల్లో రాణించాలన్నారు. నాణ్యమైన విద్యను అందించి కావాల్సిన రీతిలో విద్యను బోధించగలిగే ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారన్నారు. అనంతరం రాయచోటి రూరల్ సీఐ నరసింహారెడ్డి మాట్లాడుతూ అన్ని వసతులతో కూడిన విద్యను అందించడంలో పాలకులతో పాటు పోలీసుశాఖ కూడా జిల్లాలోని పలు కేజీబీవీ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. పై అధికారుల ఆదేశాల మేరకు పలు పాఠశాలలను దత్తత తీసుకుని వాటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుండుపల్లె ఎస్‌ఐ నరసింహారెడ్డి, ప్రత్యేకాధికారి సిద్దేశ్వరి, కానిస్టేబుళ్లు మహేంద్ర, మదన, వీరారెడ్డి, గోపి పాల్గొన్నారు.

కలెక్టర్‌ను కలిసిన గండికోట ముంపువాసులు

కొండాపురం, అక్టోబర్ 16: గండికోట ప్రాజెక్టు క్రింద మునకకు గురైన బాధితులు ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామనాథరెడ్డి కుమారుడు సిఎం రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ బాబూరావు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా బాధితుల తరపున ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి జిల్లా కలెక్టర్‌తో చర్చించారు. బాధితుల డిమాండ్ల మేరకు గతంలో 14 గ్రామాలకు సర్వే ద్వారా బాధితులకు అందించిన తరహాలో రెండో విడతలో సర్వేలు నిర్వహించాలన్నారు. బాడుగ ఇళ్లలో నివసించే వారికి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలి, ఆస్థి కోల్పోయిన వారు ఎక్కడ నివాసం ఉన్నా వారికి పరిహారం ఇవ్వాలి, సర్వేలో తేడాలు లేకుండా నిర్వహించాలి వంటి వాటిని పిఆర్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ బాబూరావు నాయుడు బాడుగ ఉన్న వారికి ప్రస్తుతం పరిహారం ఇవ్వడం లేదని, వారి ప్రతిపాదనను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. స్పెషల్ కలెక్టర్ నాగేశ్వరరావు మంగళవారం నుండి మూడు రోజుల పాటు కొండాపురంలోనే ఉంటారన్నారు. సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నేతలు ఉన్నారు.