కడప

ఎన్‌టిఆర్ వైద్య సేవ ద్వారా విషజ్వరాలకు వైద్యం అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(కల్చరల్)అక్టోబర్ 16: విషజ్వరాలను ఎన్‌టిఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ)లో చేర్చాలని, అలాగే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాలని జిల్లాకాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు షేక్ నజీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఇందిరాభవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయని, ముఖ్యంగా 5సంవత్సరాలులోపు పిల్లలకు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యు, చికున్‌గున్యా లాంటి విషజ్వరాలు బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జిల్లా పరిస్థితి అనారోగ్య కడప జిల్లాగా ఉందని, జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు విజృంభించి ప్రతి 5 ఇళ్లల్లో ఒకరిద్దరు అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యు లాంటి వ్యాధులతో ప్రజలు బాధపడుతున్నారన్నారు. ప్రధానంగా జిల్లాలోని కడప, రాజంపేట, రాయచోటి, పోరుమామిళ్ల ప్రాంతాల్లోని ప్రజలు విషజ్వరాల బారిన పడి అల్లాడుతున్నారన్నారు. దీన్ని ఆసరాచేసుకుని ప్రైవేట్ వైద్యశాలల్లో వేలాది రూపాయలు రోగుల నుంచి వసూళ్లు చేస్తున్నారన్నారు. అలాగే ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు సరైన వసతులు, మందులు లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాలంటే పేదలు ఆర్థిక స్తోమత లేక ఇంటివద్దనే ఉండి ప్రాణాలుకోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం విషజ్వరాలను కూడా ఎన్‌టిఆర్ వైద్యసేవలో చేర్పించి పేదలను, మధ్యతరగతి ప్రజలు ఆదుకోవాలని ఆయన కోరారు. విలేకర్ల సమావేశంలో డిసిసి నాయకులు కర్నాటి చంద్రశేఖర్‌రెడ్డి, విజయభాస్కర్, చాన్ అలీ, జోడునాగరాజు, రఫి తదితరులు పాల్గొన్నారు.

డిజిటల్ ల్యాబ్‌తో విద్యార్థులకు ప్రయోజనం

మైలవరం, అక్టోబర్ 16: వావ్ (వరల్డ్ ఆన్ వీల్స్) కార్యక్రమం ద్వారా చేపట్టిన డిజిటల్ ల్యాబ్ అవగాహన కార్యక్రమాలతో విద్యార్థులకు మెరుగైన ప్రయోజనం చేకూరుతుందని మైలవరం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పరమేశ్వరయ్య తెలిపారు. మండలంలోని చిన్నకొమెర్ల వద్ద ఉన్న దాల్మియా సిమెంటు పరిశ్రమలో దాల్మియా సియస్‌ఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన వావ్ కార్యక్రమ అవగాహన కార్యక్రమాన్ని సోమవారం పరిశ్రమలోని కాలనీలో ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న పరమేశ్వరయ్య మాట్లాడుతూ విద్యార్థులకు డిజిటల్ తరగతి గదులు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. ఈ క్రమంలో దాల్మియా సియస్‌ఆర్ వారు గ్రామీణ విద్యార్థులకు డిజిటల్ తరగతులపై ముందస్తుగా అవగాహన కల్పించేందుకు వావ్ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. అనంతరం సియస్‌ఆర్ స్థానిక విభాగాధిపతి రాజశేఖరరాజు మాట్లాడుతూ విద్యార్థులకు డిజిటల్ తరగతులు నిర్వహణలపై దీని ద్వారా ప్రధానంగా అవగాహన కల్పించనున్నామని తెలిపారు. వావ్ కార్యక్రమంలో వోల్వా బస్సులో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా డిజిటల్ తరగతులను తెలియజేస్తారన్నారు. దీని కోసం పరిశ్రమ పరిధిలోని గ్రామాల, ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల వద్దకు వెళ్లి విద్యార్థులకు వివరిస్తారన్నారు. ఇందుకుగాను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు ముందస్తుగా వావ్ కార్యక్రమంపై శిక్షణ ఇస్తున్నామని సియస్ ఆర్ విభాగాధిపతి రాజశేఖరరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో వావ్ సిబ్బంది నాగార్జున, రాజేష్, రత్నాకర్, సియస్‌ఆర్ ఈవోలు శ్రీనివాసులు, గురుదేవి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.